గతంలో ఒక సినిమాకు ఓ రిలీజ్ డేట్ ప్రకటించారు అంటే దాన్ని చాలా సీరియస్‌గా తీసుకునేవారు. ఎలాగైనా చెప్పిన డేటుకే సినిమాను రిలీజ్ చేయాలని చూసేవారు. అలా చేయలేని పక్షంలో దాన్ని అవమానంగా భావించేవారు. సినిమా వాయిదా పడితే దాన్నొక నెగెటివ్ సెంటిమెంట్‌గానూ చూసేవారు. కానీ గత కొన్నేళ్లలో అంతా మారిపోయింది.
చెప్పిన డేటుకు ఏదైనా సినిమా రిలీజైతే ఆశ్చర్యపోయే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా కరోనా పుణ్యమా అని ఎన్నో పెద్ద సినిమాలు పలుమార్లు డేట్లు మార్చుకోవడంతో వాయిదాల పర్వం కామన్ అయిపోయింది. జనాలు కూడా వాటికి అలవాటు పడిపోయారు. డేట్ మారిస్తే సోషల్ మీడియాలో కాసేపు అసహనం వ్యక్తం చేయడం.. తర్వాత సర్దుకుపోవడం అభిమానులకు మామూలైపోయింది.
ఐతే ఆడియన్స్ అలవాటు పడుతున్నారు కదా అని నిర్మాతలు వాయిదాల విషయాన్ని మరీ తేలిగ్గా తీసుకుంటుండడం.. చెప్పిన డేట్‌కు సినిమా రాని పక్షంలో వీలైనంత త్వరగా సమాచారం ఇవ్వాలన్న ఆలోచన కూడా చేయకపోవడమే ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఈ రోజు ఏప్రిల్ 10. ఈ డేట్‌కు ‘స్వయంభు’ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు గతంలో మేకర్స్ ప్రకటించారు. కానీ ఆ డేట్‌కు సినిమా వచ్చే అవకాశం లేదని ముందే తేలిపోయింది. కానీ ఇప్పటిదాకా సినిమాను వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించలేదు. కొత్త డేట్ ఇవ్వలేదు. ఇక మార్చి చివరి వారం నుంచి ఏప్రిల్ 30కి వాయిదా పడ్డ ‘పెద్ది’ సినిమా ఆ డేట్‌కు కూడా రాదన్నది స్పష్టం.
యూనిట్‌కు ఈ విషయంలో పూర్తి స్పష్టత ఉంది. ఇండస్ట్రీ జనాలకు కూడా ఈ విషయం తెలుసు. అందుకే మే 1కి రెండు మూడు సినిమాలను షెడ్యూల్ చేశారు. కానీ అందరికీ తెలిసిన విషయాన్ని అధికారికంగా ప్రకటించడంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారో తెలియదు. ఏప్రిల్ 30కే సినిమా వస్తుందేమో అని ఇంకా కొందరు అభిమానులను భ్రమలో ఉంచుతూ కొత్త డేట్ ప్రకటించట్లేదు టీం.
కనీసం సినిమా వాయిదా పడబోతోందని అయినా చెప్పాల్సిన బాధ్యత అభిమానుల మీద ఉంది కదా? ఇక ‘విశ్వంభర’ సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఎప్పట్నుంచో ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. గత ఏడాది ఈ సినిమా గురించి అప్‌డేట్ ఇచ్చినపుడు వేసవి రిలీజ్ అన్నారు. కానీ ఈ చిత్రం వేసవికి రాదన్నది స్పష్టం.
మరి ఆ విషయాన్ని అభిమానులకు చెప్పాలి కదా? కానీ ఆరు నెలలకు పైగా ఈ సినిమా నుంచి ఏ అప్‌డేట్ లేదు. జులై 10న రిలీజ్ అంటున్నారు. కానీ ఆ విషయాన్ని అధికారికంగా చెప్పడంలోనూ ఆలస్యం చేస్తున్నారు. ఆడియన్స్‌ను మరీ ఇంత తేలిగ్గా తీసుకోవడం న్యాయమా.. వారి పట్ల బాధ్యత ఉండక్కర్లేదా అన్నది ప్రశ్న.
This post was last modified on April 10, 2026 10:43 am
ఒకపక్క టాక్సిక్ పుణ్యమాని తెలుగు, కన్నడ మూవీ లవర్స్ సోషల్ మీడియా వేదికగా ఒకరిమీద మరొకరు కామెంట్లు, ట్రోల్స్ చేసుకోవడం…
ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని, రెండు మూడు చిన్న సినిమాల అనుభవం ఉన్న హీరోను పెట్టి.. ఒక డెబ్యూ డైరెక్టర్ రూ.3-4…
అక్టోబర్ 2 నుంచి ఆదర్శ కుటుంబం ఏకె ఫార్టీ సెవెన్ తప్పుకున్నాక మళ్ళీ కొత్త డేట్ ప్రకటించలేదు. ఒకవేళ జైలర్…
ఏంటో జెన్ జీ ఆడియన్స్ మహా విచిత్రంగా ఉన్నారు. కొన్ని కొత్త సినిమాలను అస్సలు పట్టించుకోరు. కొన్ని రీ రిలీజులకేమో…
సినిమా నటులు ఎందరో రాజకీయ నాయకులయ్యారు. అయితే ప్రజల మనసులో బలమైన ముద్ర వేసిన వాళ్ళు మాత్రం కొందరే ఉంటారు.…
మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఇండియా టుడే సీ ఓటర్ చేసిన సర్వే తమిళనాడు టీవీకే, కాంగ్రెస్ కాపురం…