Movie News

అతిథి చాలా పెద్ద రిస్కు చేస్తున్నాడు

ఈ మధ్య రీ రిలీజుల ట్రెండ్ కొత్త పోకడలు పోతోంది. మొదలైనప్పుడు కేవలం తెలుగు రాష్ట్రాలకు పరిమితం చేయడం దగ్గరి నుంచి ఇప్పుడు ఓవర్సీస్ లో అడ్వాన్స్ ప్రీమియర్లు వేయడం దాకా హడావిడి మాములుగా ఉండటం లేదు. అయితే అన్నింటికీ ఒకే ఫలితం రావడం లేదు. ఖలేజా మంచి లాభాలు ఇస్తే అతడు కొంచెం పోరాడాల్సి వచ్చింది. వీటి మెయిన్ రిలీజ్ లో బాక్సాఫీస్ రిజల్ట్స్ రివర్స్ లో వచ్చిన సంగతి తెలిసిందే. మే 29 గ్రాండ్ గా అతిథి రాబోతోంది.

అనూహ్యంగా ఈసారి అతిథి టీమ్ కొన్ని ప్రయోగాలు చేస్తోంది. ఎడిటింగ్ ప్యాట్రన్ మార్చి న్యూ ఫీల్ వచ్చేలా ప్లాన్ చేస్తున్నారట. అంతే కాదు రీ రికార్డింగ్, డిఐ, రీ స్టోరింగ్ లాంటి చర్యల్లోనూ కొత్త ట్రెండ్ సృష్టించే దిశగా ఏర్పాట్లు చేసుకున్నట్టు తెలిసింది. అయితే ఇక్కడో రిస్క్ ఉంది. నోస్టాల్జియా ఫ్యాన్స్ ఎప్పుడూ ఒరిజినల్ నే కోరుకుంటారు. ఆ మధ్య సూర్య సికందర్ ని ఇలాగే మార్పులు చేసి తమిళంలో మళ్ళీ విడుదల చేస్తే ఆశించినంత గొప్ప స్థాయిలో ఫలితం రాలేదు.

మాయాబజార్, షోలే లాంటి క్లాసిక్స్ కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మొత్తాన్ని మళ్ళీ రీ రికార్డింగ్ చేయించడం అధిక శాతం కల్ట్ లవర్స్ కి నచ్చలేదు. దీని వల్ల వాటి ఆత్మ దెబ్బ తిందని ఫీలవుతూ ఉంటారు. అయితే అతిథి విషయంలో ఈ ఎక్స్ పరిమెంట్ ని సమర్థిస్తున్న వాళ్ళు లేకపోలేదు. అతిథి ఫ్లాప్ అవ్వడానికి కారణం స్క్రీన్ ప్లే అని, కొంచెం నిడివి తగ్గించి, ట్విస్టులను సరిగ్గా ప్రెజెంట్ చేసి ఉంటే పెద్ద హిట్టయ్యేదని మహేష్ బాబు అభిమానులు భావించడం చూశాం.

మరి నిజంగా ఆ స్థాయిలో కొత్త కట్ రెడీ చేసి మెప్పిస్తారా లేక ఊరికే ప్రమోషన్ అటెన్షన్ కోసం ఇలాంటి ఫీలర్లు వదులుతున్నారా అనేది థియేటర్ లో చూశాకే క్లారిటీ వస్తుంది. టీజర్ లో అయితే అన్నంత పని చేసినట్టే కనిపిస్తోంది. అయితే మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని కొత్తగా వినడంతో పాటు కొన్ని కీలక మార్పులనైతే చూడబోతున్నాం అన్న మాట. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన అతిథిని మహేష్ బాబు అన్నయ్య స్వర్గీయ రమేష్ బాబు నిర్మించడం విశేషం.

This post was last modified on April 10, 2026 10:06 am

Share

Recent Posts

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

49 minutes ago

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

6 hours ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

7 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

7 hours ago

40 సంవత్సరాల రాక్షసుడు… ఇది చిరంజీవి కెజిఎఫ్

కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…

7 hours ago

లక్ష కోట్లతో ‘రాయలసీమ రైజింగ్‘

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…

10 hours ago