Movie News

ఫ్లాప్ సినిమాలు గుర్తు చేసుకోవడం అవసరమా

ఇవాళ అల్లు అర్జున్ – అట్లీ కాంబో మూవీకి రాకా టైటిల్ అనౌన్స్ చేసి ప్రీ లుక్  పోస్టర్ వదిలిన సంగతి తెలిసిందే. ఐకాన్ స్టార్ ని ఇలా డీ గ్లామర్ యానిమల్ లుక్ లో ఊహించని అభిమానులు దాన్ని చూసి ఒక్కసారిగా షాక్ తిన్నారు. రెగ్యులర్ గా కనిపించకుండా ఇలా పోస్టర్ తో ట్విస్ట్ ఇవ్వడం ఎవరూ ఊహించలేదు. పుష్ప 2 టైంలోనూ జాతర ఆడవేషంలో సోషల్ మీడియాని ఊపేసిన బన్నీ ఇప్పుడు అదే స్ట్రాటజీతో వచ్చాడు. అయితే ఈసారి రియాక్షన్లు కొంచెం మిక్స్డ్ గా ఉన్నాయి.

ముఖ్యంగా కొందరు యాంటీ ఫ్యాన్స్ రాకా పేరు ఇంతకు ముందు ఎక్కడ విన్నామా అంటూ ఫ్లాష్ బ్యాక్ తవ్వారు. జూనియర్ ఎన్టీఆర్ శక్తిలో ఒక విలన్ పేరు రాకానే. ప్రారంభంలోనే వీడికో బిల్డప్, ఎలివేషన్ ఉంటుంది. అయితే శక్తి ఎంత పెద్ద డిజాస్టరో చెప్పనక్కర్లేదు. తారక్ సైతం ఎక్కడైనా ఇంటర్వ్యూలలో దీని ప్రస్తావన వస్తే వామ్మో అంటాడు. నిర్మాత అశ్వినిదత్ ఏ ఇంటర్వ్యూలో శక్తి టాపిక్ వచ్చినా నష్టాల చిట్టా విప్పుతూ ఉంటారు. అంత పెద్ద డిజాస్టర్ అన్న మాట.

అలాంటి శక్తిని ఇప్పుడు గుర్తు చేసుకోవడం అనవసరమే కాదు అసందర్భం కూడా. మెహర్ రమేష్ శక్తి విషయంలో రెగ్యులర్ గా ట్రోల్ అవుతూనే ఉంటారు. భోళా శంకర్, షాడో కన్నా దీని వల్ల జరిగిన డ్యామేజ్ ఎక్కువ. అలాంటిది ఇప్పుడీ మెహర్ ని కూడా విజనరీ అంటూ ఎక్స్ మాధ్యమంలో పొగడ్తలు గుప్పించడం విశేషం. బన్నీ అభిమానులు దీనికి స్పందిస్తూ ఇదంతా ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారని, సేఫ్ గేమ్ ఆడకుండా అల్లు అర్జున్ చేస్తున్న రిస్కులను కావాలని నెగటివ్ చేస్తున్నారని అంటున్నారు.

స్టార్ హీరోలు డీ గ్లామర్ లుక్స్ ట్రై చేయడం అవసరమే. భైరవ ద్వీపంలో బాలకృష్ణ, శ్రీ మంజునాథలో చిరంజీవి ట్రై చేశారు. విక్రమ్ ఐ అప్పట్లో రాకా లాంటి పోస్టర్ తోనే ప్రేక్షకుల అంచనాలు పెంచేసింది. ఇది కూడా ఫ్లాపే. కాకపోతే ఆ గెటప్ ని శంకర్ కేవలం ఒక పాటకు పరిమితం చేసి మోసం చేయడం మూవీ లవర్స్ ని బాధ పెట్టింది. లుక్ పరంగా రాకాను ఐతో పోలుస్తున్న జనాలు కూడా గట్టిగానే ఉన్నారు. ఏదైతేనేం బన్నీ మరోసారి టాపిక్ అఫ్ ది సోషల్ మీడియా అయ్యాడు.

This post was last modified on April 8, 2026 4:46 pm

Share

Recent Posts

అసంతృప్తి ఓట్లు కూడా కూట‌మికేనా?

కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న ల‌బ్ధి దారుల‌కు మేలు…

2 hours ago

చిరు-ఓదెల… ముందుకు కదలాలంటే?

ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…

2 hours ago

ప‌వ‌న్ చెప్పిందేంటి.. సేన‌ల‌కు అర్థ‌మైంది ఏంటి?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన నాయ‌కుల‌కు అర్ధ‌మైంది ఏంటి? అనేది…

3 hours ago

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

4 hours ago

జ‌గ‌న్‌కు షాక్ ఇవ్వాలని ఫిక్స్ అయిన సాయిరెడ్డి

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా పార్టీ పెట్ట‌నున్న‌ట్టు రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖ‌ప‌ట్నంలో మాట్లాడిన ఆయ‌న‌..…

4 hours ago

తండ్రిపై ప్రేమ‌.. శ‌వాన్ని నాలుగేళ్లుగా.. !

తల్లిదండ్రుల‌పై ప్రేమ ఉండాల్సిందే. కానీ, అది వారు జీవించినంత వ‌ర‌కు ఉండాల్సిందే. కానీ, జ్యాత‌స్య‌హి ధ్రువో మృత్యు.. అన్న‌ట్టుగా కాలం…

4 hours ago