Movie News

బన్నీ కోసం చిరు, పవన్, చరణ్…

అల్లు అర్జున్‌‌కు మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబితే.. ఒకప్పుడు అదేమీ విశేషం కాదు. కానీ ఇప్పుడు మాత్రం అది కూడా ఒక వార్తే. పరిస్థితులు అంతగా మారిపోయాయి మరి. కెరీర్లో చాలా ఏళ్లు బన్నీకి ‘మెగా’ హీరో అనే గుర్తింపే ఉండేది. అలా పిలిపించుకోవడానికే బన్నీ కూడా ఇష్టపడేవాడు. కానీ తర్వాత అతడి ఆలోచన మారింది.

తన అభిమానులను ‘ఆర్మీ’ అని పిలుచుకుంటున్నాడు. ‘మెగా’ గొడుగు నుంచి పూర్తిగా బయటికి వచ్చేశాడు. వేరే కారణాలు కూడా తోడై.. మెగా ఫ్యామిలీకి, బన్నీకి మధ్య డివిజన్ వచ్చేసింది. అందుకే ఇప్పుడు బన్నీ.. చిరు, పవన్‌, ఇతర మెగా హీరోల గురించి మాట్లాడినా.. వాళ్లు బన్నీ ప్రస్తావన తెచ్చినా ఒకింత ఆశ్చర్యంతో చూసే పరిస్థితి.

బుధవారం బన్నీ పుట్టిన రోజన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మెగా హీరోలందరూ అతడికి విష్ చేయడం ఇరు వర్గాల అభిమానుల దృష్టిని ఆకర్షించింది.
తన మేనల్లుడిని ‘డియర్ బన్నీ’ అని సంబోధిస్తూ చిరు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. చాలా సింపుల్‌గానే విష్ చేశాడు చిరు. మరోవైపు పవన్ సైతం బన్నీకి విషెస్ చెప్పాడు. అతను ఎల్లప్పుడూ విజయం సాధిస్తూనే ఉండాలని.. మరిన్ని మైలురాళ్లను అందుకోవాలని పవన్ ఆకాంక్షించాడు. మరోవైపు రామ్ చరణ్ సైతం ఎంతో ఆప్యాయంగా విష్ చేశాడు.

మరోవైపు మెగా ఫ్యామిలీ యువ హీరోలు సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ సైతం బన్నీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ.. అతడికి అంతా మంచే జరగాలని ఆకాంక్షించారు. ఇక నిన్న అర్ధరాత్రి నుంచే బన్నీ అభిమానుల హంగామా మామూలుగా లేదు. బన్నీ పుట్టిన రోజుకు సంబంధించిన హ్యాష్ ట్యాగ్‌ టాప్‌లో ట్రెండ్ అయ్యేలా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు.

సినీ, రాజకీయ రంగాలకు చెందిన అనేక మంది ప్రముఖులు బన్నీకి విషెస్ చెబుతన్నారు. ఈ రోజు బన్నీ కొత్త చిత్రం ‘రాకా’కు సంబంధించి టైటిల్, ప్రి లుక్ రిలీజ్ కావడంతో అది కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. పుట్టిన రోజు సందర్భంగా తన ఇంటి వద్దకు పెద్ద సంఖ్యలో వచ్చిన అభిమానులను బన్నీ కలుసుకుని వారిని ఉత్సాహం నింపారు.

This post was last modified on April 8, 2026 4:09 pm

Share

Recent Posts

టాలీవుడ్ ఇంటర్వ్యూల తీరు మారిపోయింది

గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…

1 hour ago

అసంతృప్తి ఓట్లు కూడా కూట‌మికేనా?

కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న ల‌బ్ధి దారుల‌కు మేలు…

4 hours ago

చిరు-ఓదెల… ముందుకు కదలాలంటే?

ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…

5 hours ago

ప‌వ‌న్ చెప్పిందేంటి.. సేన‌ల‌కు అర్థ‌మైంది ఏంటి?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన నాయ‌కుల‌కు అర్ధ‌మైంది ఏంటి? అనేది…

5 hours ago

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

6 hours ago

జ‌గ‌న్‌కు షాక్ ఇవ్వాలని ఫిక్స్ అయిన సాయిరెడ్డి

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా పార్టీ పెట్ట‌నున్న‌ట్టు రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖ‌ప‌ట్నంలో మాట్లాడిన ఆయ‌న‌..…

6 hours ago