Movie News

అల్లరి నరేష్… ఇప్పుడు ఇలా..

ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించి, ప్రతి ఇంట్లోనూ అభిమానులను సంపాదించుకున్న నటుడు అల్లరి నరేష్. తన తొలి చిత్రం ‘అల్లరి’ సర్ప్రైజ్ హిట్ అయి, తన ఇంటి పేరుగా మారిపోయింది. తర్వాత ఎన్నో కామెడీ సినిమాలతో అతను అలరించాడు. ఒక దశాబ్దం పాటు నరేష్‌కు ఎదురే లేకపోయింది.

నరేష్ సినిమాలంటే కడుపుబ్బ నవ్వుకోవచ్చని అన్ని వర్గాల ప్రేక్షకులూ థియేటర్లకు వెళ్లేవాళ్లు. తన ఫ్లాప్ సినిమాలు కూడా డబ్బులు తెచ్చిపెట్టేవి. నిర్మాతల పాలిట కల్ప తరువులా ఉండేవాడు నరేష్. తనతో సినిమా తీస్తే మినిమం గ్యారెంటీ అన్నట్లుండేది.

కానీ ఒక దశ దాటాక తన కామెడీ సినిమాలు జనాలకు మొహం మొత్తేయడం మొదలుపెట్టింది. దీంతో వరుస ఫ్లాపులు ఎదురై కామెడీనే వదిలేయాల్సిన పరిస్థితి తలెత్తింది. కొన్నేళ్ల ముందు రూటు మార్చి ‘నాంది’ రూపంలో పూర్తి సీరియస్ మూవీ చేశాడు నరేష్. అది మంచి ఫలితాన్నందుకుంది కానీ.. తర్వాత చేసిన ఈ తరహా సినిమాలేవీ ఫలితాన్నివ్వలేదు. ఉగ్రం, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, ఆ ఒక్కటీ అడక్కు, 12 ఏ రైల్వే కాలనీ.. ఇలా ప్రతి సినిమా ఫ్లాపే అయింది.

దీంతో ఇప్పుడు ఏం చేయాలో పాలుపోని స్థితికి చేరుకున్నాడు అల్లరోడు. తన చివరి సినిమా ‘ఆల్కహాల్’ విడుదలకే నోచుకోకుండా పక్కన పడిపోయింది. దాని సంగతేమో తేల్చకుండా నరేష్ కొత్త సినిమాను మొదలుపెట్టాడు. ఆ చిత్రమే.. కనకదుర్గ. ఈసారి సక్సెస్ కోసం నరేష్ ఇంకో రూట్లోకి వెళ్తున్నాడు. టైటిల్‌కు తగ్గట్లే ఇది భక్తి రస చిత్రమట.

నరేష్ నుంచి ఇలాంటి సినిమాను అస్సలు ఊహించలేం.
కానీ ఇప్పుడు దేవుడు వెర్సస్ దుష్టశక్తి అంటే జనం ఊగిపోతున్నారని ఈ రూట్లోకి వెళ్తున్నట్లుంది. ఈ చిత్రానికి సీనియర్ రైటర్ బీవీఎస్ రవి కథ అందించడం విశేషం. చిత్ర నిర్మాతల్లో కూడా ఆయనొకరు. సత్యదేవ్‌తో ‘47 డేస్’ అనే సినిమా, నరేష్ అగస్త్యతో ‘వికటకవి’ అనే వెబ్ సిరీస్ తీసిన ప్రదీప్ మద్దాలి ఈ చిత్రానికి దర్శకుడు. కాజల్ చౌదరి అనే కొత్తమ్మాయి కథానాయికగా నటిస్తోంది. మరి ఈ ప్రయత్నమైనా అల్లరి నరేష్‌కు విజయాన్నిస్తుందేమో చూడాలి.

This post was last modified on April 8, 2026 4:02 pm

Share

Recent Posts

ఏపీలో లిక్కర్ క్వాలిటీ చెకింగ్ కు క్యూఆర్ కోడ్!

2019-24 మధ్య జగన్ జమానాలో ఏపీలో నాణ్యమైన మద్యం కరువైన సంగతి తెలిసిందే. తన మంత్రులు, అనుయాయులకు సంబంధించిన డిస్టిలరీల…

32 minutes ago

అప్పుడు అనారోగ్యం గుర్తు లేదా అంబటి?

ఏపీ లిక్కర్ రవాణా కుంభకోణం కేసు దర్యాప్తునకు మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ఏవో కారణాలు చెప్పి…

36 minutes ago

తేజ సజ్జ తెలివికి ఇదే నిదర్శనం

యూత్ హీరోలు ప్లానింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే ఆర్థికంగా ఏమో కానీ కెరీర్ పరంగా ఇబ్బందులు చూడాల్సిన పరిస్థితులు ఇండస్ట్రీలో…

42 minutes ago

‘ఇకపై వైసీపీకి క్రిస్టియన్లు ఓటు వేయొద్దు!’

వైసీపీ అధినేత జగన్ ఏపీ సీఎంగా ఉన్న 2019-24 మధ్యకాలంలో రాష్ట్రంలో క్రైస్తవ మత ప్రచారం విపరీతంగా జరిగేదని ఆరోపణలు…

1 hour ago

పైరసీ ఇష్యూ వల్ల కాగితానికి ప్రచారం

అక్టోబర్ 2 విడుదల కాబోతున్న సినిమాల్లో తెల్లకాగితం అంతో ఇంతో సౌండ్ చేస్తోంది. యూత్ ఎలిమెంట్స్ తో కోర్ట్, బ్యాండ్…

2 hours ago

తెలుగు తమిళ స్టార్ కమెడియన్లు కలిస్తే

మల్టీస్టారర్లు మాములుగా స్టార్ హీరోల గురించే ఎక్కువగా వాడతాం. ఆర్ఆర్ఆర్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఉదాహరణగా చెప్పుకుంటాం. అయితే…

2 hours ago