Political News

ఏపీలో లిక్కర్ క్వాలిటీ చెకింగ్ కు క్యూఆర్ కోడ్!

2019-24 మధ్య జగన్ జమానాలో ఏపీలో నాణ్యమైన మద్యం కరువైన సంగతి తెలిసిందే. తన మంత్రులు, అనుయాయులకు సంబంధించిన డిస్టిలరీల నుంచి నాసిరకం మద్యానికి అఫీషియల్ పేర్లు పెట్టి జగన్ అమ్మేశారని తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. తెలంగాణ మద్యం కోసం ఏపీలో మందుబాబులు ఎగబడ్డారంటే పరిస్థితి ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

తెలంగాణ నుంచి ఆంధ్రాకు వచ్చే వారు తెచ్చే ఒకటి అర బాటిల్ ను మహా ప్రసాదం అన్న రీతిలో మందుబాబులు ఫీల్ అయ్యారంటే అతిశయోక్తి కాదు. అయితే, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నాణ్యమైన మద్యం అందిస్తామని ఎన్నికలకు ముందు స్వయానా చంద్రబాబు హామీ ఇవ్వ వలసిన పరిస్థితిని జగన్ కల్పించారు. ఆయన అన్నమాట ప్రకారం రాష్ట్రంలో నాణ్యమైన మద్యం అందుబాటులో ఉంచారు.

అయితే, ఇది చూసి ఓర్వలేని వైసీపీ నేతలు కూటమి సర్కార్ పై దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ కల్తీ ప్రచారాన్ని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఖండించారు. కల్తీ మద్యం పేరుతో గొడ్డలి పార్టీ దుష్ప్రచారానికి తెర తీసి ప్రభుత్వంపై కుట్ర చేస్తోందని మండిపడ్డారు. ఈ క్రమంలోనే లిక్కర్ క్వాలిటీ తెలుసుకునేందుకు సురక్ష యాప్ లో ఒక ఆప్షన్ తెచ్చామని తెలిపారు. త్వరలో దుకాణాల్లోనే మద్యం నాణ్యత పరీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

లిక్కర్ బాటిల్ మూత లేదా సీల్ పై ఉన్న QR కోడ్ ను మాత్రమే ‘AP Excise Suraksha’ (APESA) యాప్‌ ద్వారా స్కాన్ చేయాలని సూచించారు. స్కాన్ చేసిన వెంటనే ఆ మద్యం నకిలీదా? అసలైనదా? అనే సమాచారం..ఆ లిక్కర్ బ్రాండ్ పేరు, తయారీ తేదీ, బ్యాచ్ ఐడీ వంటి వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.

ఇలా నాణ్యమైన మద్యం అందుబాటులో ఉంచడమే కాకుండా…ఆ మద్యం నాణ్యతను వినియోగదారులు స్వయంగా చెక్ చేసుకునేలా క్యూఆర్ కోడ్ ను తెచ్చే దమ్మున్న ప్రభుత్వం ఇదని సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి.

This post was last modified on September 29, 2026 7:12 pm

Share

Recent Posts

బ్లడీ రోమియోకి లెక్కలు కుదురుతున్నాయి

మాస్ మార్కెట్ ని మరింత బలపరుచుకునే ఉద్దేశంతో నాని ఏరికోరి చేసిన ది ప్యారడైజ్ ఫైనల్ ఫలితం ఏంటనేది ఇంకా…

2 minutes ago

డ్రాగన్ మాట మీద నిలబడితే చాలు

ఆ మధ్య షూటింగ్ లో ప్రమాదానికి గురైన జూనియర్ ఎన్టీఆర్ కొన్ని వారాల విశ్రాంతి తర్వాత పూర్తిగా రికవర్ అయ్యాడు.…

17 minutes ago

బలహీనపడటాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు

కీలకమైన వీక్ డేస్ పరీక్షలో ప్యారడైజ్ తడబడుతోంది. మొదటి నాలుగు రోజులు ఆదివారం దాకా ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఆడిన…

1 hour ago

అప్పుడు అనారోగ్యం గుర్తు లేదా అంబటి?

ఏపీ లిక్కర్ రవాణా కుంభకోణం కేసు దర్యాప్తునకు మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ఏవో కారణాలు చెప్పి…

3 hours ago

తేజ సజ్జ తెలివికి ఇదే నిదర్శనం

యూత్ హీరోలు ప్లానింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే ఆర్థికంగా ఏమో కానీ కెరీర్ పరంగా ఇబ్బందులు చూడాల్సిన పరిస్థితులు ఇండస్ట్రీలో…

3 hours ago

‘ఇకపై వైసీపీకి క్రిస్టియన్లు ఓటు వేయొద్దు!’

వైసీపీ అధినేత జగన్ ఏపీ సీఎంగా ఉన్న 2019-24 మధ్యకాలంలో రాష్ట్రంలో క్రైస్తవ మత ప్రచారం విపరీతంగా జరిగేదని ఆరోపణలు…

4 hours ago