Political News

‘ఇకపై వైసీపీకి క్రిస్టియన్లు ఓటు వేయొద్దు!’

వైసీపీ అధినేత జగన్ ఏపీ సీఎంగా ఉన్న 2019-24 మధ్యకాలంలో రాష్ట్రంలో క్రైస్తవ మత ప్రచారం విపరీతంగా జరిగేదని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు, జగన్ హయాంలో రాష్ట్రంలోని హిందూ ఆలయాలపై దాడులు పెరిగాయని రామతీర్థం వంటి పలు ఘటనలు అందుకు నిదర్శనమని అప్పటి ప్రతిపక్ష పార్టీలు కూడా విమర్శించాయి. అయితే, తన ఐదేళ్ల పాలనలో క్రిస్టియన్లకు జగన్ ఒరగబెట్టిందేమీ లేదని జీసస్ బిలీవర్స్ అసోసియేషన్ కౌన్సిల్ తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

ఐదేళ్ల వైసీపీ పాలనలో క్రిస్టియన్లకు అన్యాయం జరిగిందని ఆ కౌన్సిల్ ఆరోపించింది. క్రైస్తవులకు జగన్ ఏ మాత్రం మేలు చేయకపోగా…తనపై క్రైస్తవ ముద్ర పడకూడదని తమకు మరింత అన్యాయం చేశారని కౌన్సిల్ చైర్మన్ జోసెఫ్ మోసిగంటి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చర్చిల మీద, క్రైస్తవుల మీద దాడులు జరిగినా జగన్ కనీసం స్పందించలేదని తీవ్ర ఆరోపణలు చేశారు. జగన్ అధికారంలో ఉండగా 12 వేల ఎయిడెడ్ పాఠశాలల్ని మూసివేశారని, పాస్టర్లు జారీ చేసే మ్యారేజ్ లైసెన్స్ విధానాన్ని కూడా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగన్ తీసుకున్న ఇటువంటి నిర్ణయాలతో తాము తీవ్ర ఇబ్బందులకు గురయ్యామని అన్నారు. క్రైస్తవుల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి పోరాడకుండా ఆ సమస్యలను గాలికి వదిలేశారని మండిపడ్డారు. క్రైస్తవుల తరఫున మాట్లాడితే హిందూ ఓట్లు పోతాయని జగన్ భయపడుతున్నారని, అందుకే తమకు మద్దతుగా నిలవడం లేదని ఆరోపించారు. ఈ విషయాలను క్రైస్తవ సమాజం గుర్తించిందని, అందుకే త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి క్రైస్తవులెవరూ ఓటు వేయకూడదని, జగన్ కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

మరోవైపు, జగన్ పై మత ముద్ర వేసేందుకు కూటమి పార్టీల నేతలు ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. 2029 ఎన్నికలకు ముందు జగన్ పై ఈ రకమైన దుష్ప్రచారం చేసి లాభపడాలని కూటమి పార్టీలు కుట్ర పన్నుతున్నాయని నాని అంటున్నారు.

This post was last modified on September 29, 2026 6:27 pm

Share

Recent Posts

బ్లడీ రోమియోకి లెక్కలు కుదురుతున్నాయి

మాస్ మార్కెట్ ని మరింత బలపరుచుకునే ఉద్దేశంతో నాని ఏరికోరి చేసిన ది ప్యారడైజ్ ఫైనల్ ఫలితం ఏంటనేది ఇంకా…

1 hour ago

డ్రాగన్ మాట మీద నిలబడితే చాలు

ఆ మధ్య షూటింగ్ లో ప్రమాదానికి గురైన జూనియర్ ఎన్టీఆర్ కొన్ని వారాల విశ్రాంతి తర్వాత పూర్తిగా రికవర్ అయ్యాడు.…

1 hour ago

బలహీనపడటాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు

కీలకమైన వీక్ డేస్ పరీక్షలో ప్యారడైజ్ తడబడుతోంది. మొదటి నాలుగు రోజులు ఆదివారం దాకా ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఆడిన…

2 hours ago

ఏపీలో లిక్కర్ క్వాలిటీ చెకింగ్ కు క్యూఆర్ కోడ్!

2019-24 మధ్య జగన్ జమానాలో ఏపీలో నాణ్యమైన మద్యం కరువైన సంగతి తెలిసిందే. తన మంత్రులు, అనుయాయులకు సంబంధించిన డిస్టిలరీల…

4 hours ago

అప్పుడు అనారోగ్యం గుర్తు లేదా అంబటి?

ఏపీ లిక్కర్ రవాణా కుంభకోణం కేసు దర్యాప్తునకు మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ఏవో కారణాలు చెప్పి…

4 hours ago

తేజ సజ్జ తెలివికి ఇదే నిదర్శనం

యూత్ హీరోలు ప్లానింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే ఆర్థికంగా ఏమో కానీ కెరీర్ పరంగా ఇబ్బందులు చూడాల్సిన పరిస్థితులు ఇండస్ట్రీలో…

4 hours ago