Movie News

తెలుగు తమిళ స్టార్ కమెడియన్లు కలిస్తే

మల్టీస్టారర్లు మాములుగా స్టార్ హీరోల గురించే ఎక్కువగా వాడతాం. ఆర్ఆర్ఆర్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఉదాహరణగా చెప్పుకుంటాం. అయితే స్టార్ కమెడియన్లని హీరోగా పెట్టి సినిమాలు తీసిన దాఖలాలు తక్కువే యమలీల, అందాల రాముడు లాంటివి సోలోగా ఉన్నవి తప్ప ఇద్దరిని హైలైట్ చేసినవి కాదు. అందుకే కొత్తగా ఆలోచించాలని కాబోలు గోల్డెన్ భాగ్యం దర్శకుడు పవన్ బసంశెట్టి సౌత్ హాస్యనటులను ప్యాకేజీగా మార్చాడు.

టాలీవుడ్ లో ఈ మధ్య దూసుకుపోతున్న సత్య. కోలీవుడ్ లో భారీకాయంతోనే ఆఫర్లను మంచి నీళ్లలా పట్టేస్తూ ఇంకోవైపు హీరోగానూ కొనసాగుతున్న యోగిబాబు కలయికలో రూపొందుతున్న గోల్డెన్ భాగ్యం విడుదలకు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా మూడు నిమిషాల టైటిల్ లాంచ్ టీజర్ ని రిలీజ్ చేశారు. సత్య, యోగిబాబు వైట్ అండ్ వైట్ దుస్తుల్లో అలా నడుచుకుంటూ వచ్చి సరదాగా జోకులు వేయడాన్ని కాన్సెప్ట్ గా మార్చి కథను రివీల్ చేయకుండా చూసుకున్నారు.

నాగశౌర్యతో రంగబలి నిరాశపరిచాక పవన్ బసంశెట్టి ఈసారి కామెడీ రూటు ఎంచుకున్నారు. పాయింట్ అయితే వెరైటీగానే అనిపిస్తోంది. ప్రేమ, యాక్షన్, వయొలెన్స్ మూడు ఉంటాయని కాకపోతే అవి సత్య, యోగిబాబు స్టయిల్ లో ఉంటాయని ముందే హింట్ ఇచ్చారు. పవన్ సిహెచ్, నితిన్ జాన్ సంయుక్తంగా సంగీతం సమకూరుస్తున్నారు. ఆ మధ్య కమల్ హాసన్, రజనీకాంత్ మల్టీస్టారర్ టీజర్ తరహాలోనే దీన్ని డిజైన్ చేయడం గమనార్హం. ఇడ్లి సాంబార్ బిర్యానీ పోలిక కూడాపెట్టారు

అంతా బాగానే ఉంది కానీ ఈ ఇద్దరు హీరోలుగా నటించి థియేట్రికల్ గా రెవిన్యూ రాబట్టాలంటే సాలిడ్ కామెడీ కంటెంట్ పడాలి. ఆ అంచనాలకు తగ్గట్టే ఫన్ ఉంటుందని టీమ్ చెబుతోంది. గోల్డెన్ భాగ్యం అని టైటిల్ చూస్తుంటే ట్రెజర్ హంట్ కు సంబంధించిన క్లూస్ కూడా కనిపిస్తున్నాయి. గత కొన్ని నెలలుగా టాలీవుడ్ లో అధిక శాతం యాక్షన్ థ్రిల్లర్స్, ఎలివేషన్ సినిమాలే ఎక్కువగా వచ్చాయి. మరి వినోదాన్ని లక్ష్యంగా చేసుకున్న గోల్డెన్ భాగ్యం ఏం చేస్తుందో చూడాలి.

This post was last modified on September 29, 2026 5:43 pm

Share

Recent Posts

బలహీనపడటాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు

కీలకమైన వీక్ డేస్ పరీక్షలో ప్యారడైజ్ తడబడుతోంది. మొదటి నాలుగు రోజులు ఆదివారం దాకా ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఆడిన…

4 minutes ago

ఏపీలో లిక్కర్ క్వాలిటీ చెకింగ్ కు క్యూఆర్ కోడ్!

2019-24 మధ్య జగన్ జమానాలో ఏపీలో నాణ్యమైన మద్యం కరువైన సంగతి తెలిసిందే. తన మంత్రులు, అనుయాయులకు సంబంధించిన డిస్టిలరీల…

2 hours ago

అప్పుడు అనారోగ్యం గుర్తు లేదా అంబటి?

ఏపీ లిక్కర్ రవాణా కుంభకోణం కేసు దర్యాప్తునకు మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ఏవో కారణాలు చెప్పి…

2 hours ago

తేజ సజ్జ తెలివికి ఇదే నిదర్శనం

యూత్ హీరోలు ప్లానింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే ఆర్థికంగా ఏమో కానీ కెరీర్ పరంగా ఇబ్బందులు చూడాల్సిన పరిస్థితులు ఇండస్ట్రీలో…

2 hours ago

‘ఇకపై వైసీపీకి క్రిస్టియన్లు ఓటు వేయొద్దు!’

వైసీపీ అధినేత జగన్ ఏపీ సీఎంగా ఉన్న 2019-24 మధ్యకాలంలో రాష్ట్రంలో క్రైస్తవ మత ప్రచారం విపరీతంగా జరిగేదని ఆరోపణలు…

3 hours ago

పైరసీ ఇష్యూ వల్ల కాగితానికి ప్రచారం

అక్టోబర్ 2 విడుదల కాబోతున్న సినిమాల్లో తెల్లకాగితం అంతో ఇంతో సౌండ్ చేస్తోంది. యూత్ ఎలిమెంట్స్ తో కోర్ట్, బ్యాండ్…

3 hours ago