Movie News

పైరసీ ఇష్యూ వల్ల కాగితానికి ప్రచారం

అక్టోబర్ 2 విడుదల కాబోతున్న సినిమాల్లో తెల్లకాగితం అంతో ఇంతో సౌండ్ చేస్తోంది. యూత్ ఎలిమెంట్స్ తో కోర్ట్, బ్యాండ్ మేళం ఫేమ్ హర్ష్ రోషన్ హీరోగా రూపొందిన ఈ టీనేజ్ ప్రేమకథ మీద ఇండస్ట్రీ వర్గాల్లో కొంత సానుకూల టాక్ వినిపిస్తోంది. పలువురు సెలబ్రిటీలకు షోలు వేసినట్టుగా, వాళ్లంతా మెచ్చుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి కానీ సదరు ఫోటోలు వీడియోలు అయితే ఇంకా బయటికి రాలేదు. దీని సంగతలా ఉంచితే ఈ సినిమా పైరసీ బారిన పడిందనే వార్త తెగ హల్చల్ చేసింది.

ఒకటి రెండు క్లిప్పులు సామజిక మాధ్యమాల్లో దర్శనమివ్వగా వేరే సైట్లలో సినిమా వచ్చిందనే ప్రచారం ఎక్స్ లో తెగ తిరగేసింది. నిర్మాణ సంస్థ ఏకంగా అధికారిక ప్రకటన ఇవ్వాల్సి వచ్చింది. దీనికి ఎవరు పాల్పడ్డారు, ఎక్కడ దీన్ని గుర్తించారు. సైబర్ క్రైమ్ లో కంప్లయింట్ ఇచ్చారా లేదానేది ఇంకా తెలియాల్సి ఉంది. కొందరు ఇది పబ్లిసిటీ స్టంట్ అంటూ కామెంట్స్ చేస్తుండగా టీమ్ మాత్రం తీవ్రమైన సమస్యని ఎదురుకున్నామని, ప్రేక్షకులే నిలబెట్టాలని కోరుతున్నారు.

సరే దాని నిర్ధారణ సంగతి పోలీసులు చూసుకుంటారు కానీ ఇప్పుడీ పైరసీ ఇష్యూ వల్ల తెల్లకాగితం మీద ఫోకస్ అయితే వచ్చింది. మరీ భారీ స్థాయిలో కాదు కానీ ఈ సినిమా రిలీజ్ అనే సంగతి ఆడియన్స్ కి రిజిస్టర్ అయ్యింది. అటుపక్క పోటీగా రాజమౌళి సమర్పిస్తున్న డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ఉంది. ఇంకోవైపు తమిళనాడు సీఎం విజయ్ కొడుకు జేసన్ డైరెక్ట్ చేసిన సిగ్మా వస్తోంది. సందీప్ కిషన్ లాంటి ఇమేజ్ ఉన్న హీరో కావడంతో సౌండ్ మెల్లగా పెరుగుతోంది.

ఇలాంటి టైంలో తెల్లకాగితం జనాల దృష్టిలో పడాలంటే మార్కెటింగ్ చాలా కీలకం. సినిమా చిన్నదైనా పెద్దదైనా పైరసీ ఖచ్చితంగా ఖండించాల్సిన విషయమే. ఐబొమ్మ రవి అరెస్ట్ తర్వాత ఇది తగ్గుముఖం పడుతుందనుకుంటే మళ్ళీ మొదటికే రావడం విచిత్రం. అది కూడా రిలీజ్ కాని సినిమాలను టార్గెట్ చేయడం పెద్ద ట్విస్ట్. ఎడిటింగ్ లో జరిగిందా లేక ఓవర్సీస్ కాపీల నుంచి బయటికి వచ్చిందా అనేది కొంచెం లోతుగా విచారణ చేస్తే నిజాలు ఏదో రూపంలో బయటికి వస్తాయి.

This post was last modified on September 29, 2026 5:56 pm

Share

Recent Posts

బలహీనపడటాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు

కీలకమైన వీక్ డేస్ పరీక్షలో ప్యారడైజ్ తడబడుతోంది. మొదటి నాలుగు రోజులు ఆదివారం దాకా ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఆడిన…

14 minutes ago

ఏపీలో లిక్కర్ క్వాలిటీ చెకింగ్ కు క్యూఆర్ కోడ్!

2019-24 మధ్య జగన్ జమానాలో ఏపీలో నాణ్యమైన మద్యం కరువైన సంగతి తెలిసిందే. తన మంత్రులు, అనుయాయులకు సంబంధించిన డిస్టిలరీల…

2 hours ago

అప్పుడు అనారోగ్యం గుర్తు లేదా అంబటి?

ఏపీ లిక్కర్ రవాణా కుంభకోణం కేసు దర్యాప్తునకు మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ఏవో కారణాలు చెప్పి…

2 hours ago

తేజ సజ్జ తెలివికి ఇదే నిదర్శనం

యూత్ హీరోలు ప్లానింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే ఆర్థికంగా ఏమో కానీ కెరీర్ పరంగా ఇబ్బందులు చూడాల్సిన పరిస్థితులు ఇండస్ట్రీలో…

2 hours ago

‘ఇకపై వైసీపీకి క్రిస్టియన్లు ఓటు వేయొద్దు!’

వైసీపీ అధినేత జగన్ ఏపీ సీఎంగా ఉన్న 2019-24 మధ్యకాలంలో రాష్ట్రంలో క్రైస్తవ మత ప్రచారం విపరీతంగా జరిగేదని ఆరోపణలు…

3 hours ago

తెలుగు తమిళ స్టార్ కమెడియన్లు కలిస్తే

మల్టీస్టారర్లు మాములుగా స్టార్ హీరోల గురించే ఎక్కువగా వాడతాం. ఆర్ఆర్ఆర్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఉదాహరణగా చెప్పుకుంటాం. అయితే…

4 hours ago