Movie News

కలెక్షన్లు అంటే కామెడీ అయిపోయింది

మొన్న శుక్రవారం తమిళంతో పాటు తెలుగులో కూడా లీడర్ అనే సినిమా రిలీజయ్యింది. బైకర్, రాకాస హడావిడిలో మనోళ్లు పట్టించుకోలేదు కానీ ఇంకా థియేటర్లలో ఆడుతోందంటే ఆశ్చర్యమనిపించినా ఇది నిజం. తమిళనాడు వ్యాపారవేత్త శరవణన్ హీరోగా నటించిన ఈ యాక్షన్ డ్రామాకు మూడు రోజుల్లో పాతిక కోట్ల వసూళ్లు వచ్చాయని నిర్మాతలు అధికారికంగా ప్రకటించడం చూసి మీడియా నివ్వెరపోయింది. ఎందుకంటే ఇవి ఒక టయర్ 2 హీరో హిట్ మూవీకి వచ్చే కలెక్షన్లు.

కోలీవుడ్ ట్రేడ్ ప్రకారం లీడర్ వీకెండ్ వరకు వసూలు చేసిన సొమ్ము అయిదు కోట్లలోపేనట. సరే పాతిక కోట్లు వేస్తే వేసుకున్నారు కానీ ఇంకో పెద్ద కామెడీ ఏంటంటే త్వరలో వంద కోట్ల క్లబ్బులోకి అడుగు పెట్టబోతున్నట్టు అందులోనే పేర్కొనడం. సెటైరిక్ గా ఇలా నెంబర్ వేసుకున్నారా లేక నిజంగా వచ్చాయనే భ్రమలో ఉన్నారా అనే దాని మీద చెన్నై వర్గాల్లో చర్చ జరుగుతోంది. రజినీకాంత్ జైలర్ రేంజ్ లో దీనికి టీజర్ కట్ చేసినప్పటి నుంచే ట్రోలింగ్ మొదలయ్యింది.

విచిత్రం ఏమిటంటే లీడర్ తెలుగు వెర్షన్ ని మేకర్స్ అస్సలు పట్టించుకోకపోవడం. కనీస ప్రమోషన్లు చేయలేదు. అసలు వస్తున్న సంగతే ప్రేక్షకులకు రిజిస్టర్ కాలేదు. పాయల్ రాజ్ పుత్, కిక్ శ్యాం, లాల్, వీటి గణేష్, కాలకేయ ప్రభాకర్ లాంటి మనకు పరిచయమున్న ఆరిస్టులు ఉన్నా సరే వాళ్ళను కూడా పబ్లిసిటీలో భాగం చేయలేదు. దీంతో లీడర్ కాస్తా బ్లండర్ గా మారిపోయి త్వరగా థియేటర్ల నుంచి మాయమైపోయేలా ఉంది. దొరై సెంథిల్ కుమార్ దీనికి దర్శకత్వం వహించారు.

ఇంత జరిగిన తర్వాత లీడర్ కథేంటో తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుందిగా. ఒక మెకానిక్ షెడ్ లో డ్రైవర్ గా పని చేసే హీరో గతంలో రా ఏజెంట్ గా గొప్ప పనులు చేసుంటాడు. వాటిలో భార్యనే హత్య చేసిన సూపర్ ట్విస్టు కూడా ఉంటుంది. తర్వాత కూతుర్ని తీసుకొచ్చి వేరే చోట ప్రశాంతంగా బ్రతుకుతూ ఉంటాడు. అయినా విలన్ వల్ల మళ్ళీ బయటికి రావాల్సి వస్తుంది. దేశాన్ని భగ్నం చేసే వాళ్ళ కుట్రలను ఛేదించే క్రమంలో వచ్చే ట్విస్టులను తెరమీద చూసి ధరించాలి. పాతిక కోట్ల సినిమానా మజాకా.

This post was last modified on April 6, 2026 10:25 pm

Share

Recent Posts

`వైనాట్ పులివెందుల` ఎందాకా వచ్చింది?

వైసీపీ అధినేత, మాజీ సీఎం జ‌గ‌న్‌.. సొంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందుల‌ను త‌మ హ‌స్త‌గ‌తం చేసుకోవాలన్నది.. టీడీపీ ఆకాంక్ష‌. ముఖ్యంగా స్థానిక…

30 minutes ago

పదేళ్ల పాత రీమేక్ బెడిసి కొట్టిందా

ప్రేక్షకులు చాల అడ్వాన్స్ ఉన్నారు, తెలివి మీరిపోయారనే సత్యాన్ని చాలా మంది దర్శక నిర్మాతలు గుర్తించడం లేదు. ఆ ఏముందిలే…

6 hours ago

ఈ ద‌ర్శ‌కుడు ఛాన్సులు భ‌లే ప‌డ‌తాడే..

ఇండస్ట్రీలో వ‌రుస‌గా ఫెయిల్యూర్లు ఇచ్చాక అవ‌కాశాలు ద‌క్కించుకోవ‌డం అంత తేలికైన విష‌యం కాదు. కానీ కొంద‌రు డైరెక్ట‌ర్లు మాత్రం త‌మ…

7 hours ago

బీఆర్ఎస్ మాక్ అసెంబ్లీ… సెటైర్లు

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నుంచి బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సెషన్ మొత్తం వారిపై…

8 hours ago

త్రివిక్రమ్ మేజిక్ పని చేసినట్టేనా

ఆదర్శ కుటుంబం టీజర్ వచ్చాక అందులో కంటెంట్ ఎలా ఉంటుందో ప్రేక్షకులకు ఐడియా వచ్చేసింది. అభిమానులు హ్యాపీగానే ఉన్నారు. వెంకీ…

8 hours ago

సీఎం అయినా స్నేహం త‌ర్వాతే..

ఫిలిం ఇండ‌స్ట్రీలో చాలా ఏళ్ల పాటు నంబ‌ర్ స్థానానికి పోటీ ప‌డ్డ ఇద్ద‌రు టాప్ హీరోల మ‌ధ్య మంచి స్నేహం…

9 hours ago