టీనేజీలోనే హీరోయిన్గా అవకాశం అందుకుని తొలి సినిమాతోనే స్టార్ స్టేటస్ సంపాదించుకున్న కన్నడ అమ్మాయి రష్మిక మందన్నా. తన తొలి చిత్రం కిరిక్ పార్టీ రిలీజయ్యే సమయానికి ఆమె వయసు 20 ఏళ్లే. ఆ సినిమా సూపర్ సక్సెస్ అయి రాత్రికి రాత్రే ఆమె జీవితాన్ని మార్చేసింది.
ఐతే తొలి సినిమా చేస్తున్నపుడే ఆ చిత్ర కథానాయకుడు.. రచయిత, నిర్మాత కూడా అయిన రక్షిత్ శెట్టితో రష్మిక ప్రేమలో పడటం.. సినిమా రిలీజయ్యాక తనతో నిశ్చితార్థం చేసుకుని పెళ్లికి రెడీ అయిపోవడం పెద్ద షాక్.
కెరీర్ ఆరంభంలో ఇలా చేసే హీరోయిన్లు అరుదు. ఐతే వీరి ప్రేమకథ ఎంతో కాలం కొనసాగలేదు. నిశ్చితార్థం చేసుకున్నారు కానీ.. పెళ్లి వైపు అడుగులేయలేదు. రెండేళ్లు తిరిగేసరికి ఇద్దరూ విడిపోవడం తెలిసిన సంగతే. బ్రేకప్ తర్వాత పరస్పరం మాట్లాడుకుంటున్నారో లేదో కానీ.. బయట మాత్రం ఒకరి గురించి ఒకరు మాట్లాడటం ఆపేశారు.
రష్మిక ఆ మధ్య ఒకసారి మీడియాతో మాట్లాడుతూ.. రక్షిత్ చాలా మంచి అబ్బాయి అంటూ కితాబివ్వడం ఆసక్తి రేకెత్తించింది. సోషల్ మీడియాలో మాత్రం ఒకరి గురించి ఒకరు మాట్లాడట్లేదు. ఐతే ఇప్పుడు అనుకోకుండా వీరి మధ్య సంభాషణ సాగింది. కిరిక్ పార్టీలో సూపర్ హిట్ పాట బెలగెద్దు యారా మగువా (తెలుగులో గురువారం సాయంకాలం)కు యూట్యూబ్‌లో వంద మిలియన్ల వ్యూస్ పూర్తయిన నేపథ్యంలో దాని గురించి స్ంపదించింది. తొలి పాట చిత్రీకరణ తనకింకా గుర్తుంది అంటూ ఉద్వేగానికి గురైంది. ఈ ట్వీట్లో దర్శకుడు రిషబ్ శెట్టితో పాటు రక్షిత్ పేర్లను కూడా ట్యాగ్ చేసింది. దీనికి రక్షిత్ స్పందించాడు. Grow grow grow girl.. may all your dreams come true అని ట్వీట్ చేశాడు.
రష్మిక రక్షిత్ పేరును ట్యాగ్ చేయడం.. అతనిలా బదులివ్వడం ట్విట్టర్లో చర్చనీయాంశం అయింది. తొలి సినిమా తర్వాత రష్మిక టాలీవుడ్‌కు వచ్చి ఇక్కడ స్టార్ హీరోయిన్గా సెటిలైపోవడం తెలిసిందే. త్వరలోనే ఆమె తమిళం, హిందీలోనూ అరంగేట్రం చేయనుంది. కన్నడలో రక్షిత్ కెరీర్ కూడా మంచి స్థాయిలోనే ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates