Movie News

హృతిక్ చెప్పింది ఒప్పుకోవాల్సిన పాయింటేనా

రామాయణ టీజర్ మీద సోషల్ మీడియాలో ఎంత నెగటివిటీ నడుస్తుందో తెలిసిందే. విజువల్స్ బాగానే ఉన్నప్పటికీ వాటి ప్రెజెంటేషన్, క్వాలిటీ మీద నెటిజెన్లు చాలా కంప్లయింట్స్ చేస్తున్నారు. దీనికి హృతిక్ రోషన్ స్పందిస్తూ ఇన్స్ టాలో సుదీర్ఘమైన మెసేజ్ పంచుకున్నాడు. విఎఫ్ఎక్స్ ని విమర్శించే ముందు దాని పట్ల కనీస అవగాహన ఉండాలని, కొన్ని వందల వేల మంది శ్రమతో కల్కి, బాహుబలి, రామాయణ లాంటి గ్రాండియర్స్ రూపొందుతాయాని వివరంగా చెప్పుకొచ్చాడు.

ఇదంతా బాగానే ఉంది కానీ హృతిక్ మిస్సవుతున్న కొన్ని పాయింట్లున్నాయి. మొదటిది ప్రేక్షకులకు టీమ్ ఎంత కష్టపడిందనేది ఎప్పుడూ అనవసరం. టికెట్ డబ్బులకు న్యాయం చేకూరిందా లేదాని మాత్రమే వాళ్ళు చూసుకుని దాన్నే అభిప్రాయం రూపంలో బయటికి చెబుతారు. నిర్మాత నమిత్ మల్హోత్రా చెప్పినట్టు నాలుగు వేల కోట్లతో రామాయణ రూపొందితే మతిపోయే స్థాయిలో కంటెంట్ కనిపించాలి. అప్పుడు జనాలు వద్దన్నా వాహ్ అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తారు.

అంతెందుకు ఎప్పుడో ముప్పై సంవత్సరాల క్రితం వచ్చిన అమ్మోరులో గ్రాఫిక్స్ ఇప్పుడు చూసినా ఆశ్చర్యం కలిగిస్తాయి. అంజి ఫెయిల్ అయినా దాని క్లైమాక్స్ ఎపిసోడ్ ని తలదన్నేవి చాలా తక్కువగా వచ్చాయి. దేవి, అరుంధతిలో ప్రధాన పాత్ర పోషించింది విఎఫ్ఎక్సే. వందల కోట్ల బడ్జెట్ లు లేని టైంలోనే దర్శకుడు కోడి రామకృష్ణ ఈ అద్భుతాలను సృష్టించారు. ఈయనే త్రినేత్రం, అవతారం లాంటి డిజాస్టర్లు కూడా ఇచ్చారు. సో కంటెంట్, విఎఫెక్స్ రెండూ బ్యాలన్స్ అవ్వాల్సిందే.

సానుభూతితో ఎవరూ టికెట్లు కొనరు. అయ్యో ఇంత కష్టపడ్డారు కదాని ఆడియన్స్ థియేటర్లకు రారు. వాళ్ళను మెప్పించే అంశాలు ఏవో ఉన్నాయనే నమ్మకం కలిగినప్పుడు వర్షంలో గొడుగులు వేసుకుని మరీ టికెట్ల కోసం క్యూ కడతారు. ఇది చరిత్ర ఎన్నోసార్లు ఋజువు చేసింది. వార్ 2 గురించి నిజాయితీగా పూర్ విఎఫ్ఎక్స్ అని ఒప్పుకున్న హృతిక్ రోషన్ ఇప్పుడు రామాయణకు మద్దతు ఇవ్వడం మంచిదే కానీ ఇదే సపోర్ట్ ఆదిపురుష్ టైంలో ఎందుకు ఇవ్వలేదనే డౌట్ వస్తోంది.

This post was last modified on April 5, 2026 3:37 pm

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

7 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

9 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

9 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

10 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

10 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

11 hours ago