Movie News

మృణాల్‌నే డామినేట్ చేసిన కొత్తమ్మాయి

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో సూపర్ హాట్ హీరోయిన్లలో మృణాల్ ఠాకూర్ ఒకరు. చాలా వరకు సినిమా ప్రమోషన్లకు, ఈవెంట్లకు గ్లామర్ అవతారంలోనే వస్తుంది కాబట్టి.. మృణాల్ ఉందంటే కెమెరాలన్నీ తన చుట్టూనే తిరుగుతాయి. కానీ శనివారం మాత్రం దీనికి పూర్తి భిన్నమైన పరిస్థితి కనిపించింది. అసలు పేరు కూడా తెలియని ఒక కొత్తమ్మాయి మృణాల్‌ను డామినేట్ చేసి.. అందరి దృష్టినీ తన వైపు తిప్పేసుకుంది. హాట్ హాట్ అవతారంతో ‘డెకాయిట్’ ఈవెంట్‌లో హైలైట్ అయిన ఆ అమ్మాయి పేరు.. జైన్ మేరీ ఖాన్.

బాలీవుడ్ ‘ఖయామత్‌ సే ఖయామత్’ సహా పలు చిత్రాలు రూపొందించిన దర్శకుడు మన్సూర్ ఖాన్ కుమార్తెనే జైన్ మేరీ ఖాన్. ఆమె బాలీవుడ్లో మిసెస్ సీరియల్ కిల్లర్, మోనికా: ఓ మై డార్లింగ్ లాంటి సినిమాల్లో నటించింది. కొన్ని వెబ్ సిరీస్‌లు కూడా చేసింది. తెలుగులో ఆమెకు ‘డెకాయిట్’యే తొలి సినిమా. ఇందులో తన పాత్రేంటన్నది తెలియదు. మృణాల్ ఉండగా ఇంకో లేడీ క్యారెక్టర్ గురించి ఎవరు పట్టించుకుంటారు? కానీ ‘డెకాయిట్’ ఈవెంట్లో మాత్రం మృణాల్ ఉన్న సంగతి మరిచిపోయి కెమెరాలన్నీ జైన్ చుట్టూనే తిరిగాయి.

లో నెక్ డ్రెస్‌తో క్లీవేజ్ అందాలను ఆరబోస్తూ.. అందరి దృష్టినీ ఆకర్షించింది జైన్. ఆమె ఫొటోలు, వీడియోలు నిన్న సాయంత్రం నుంచి సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి. సినిమా ఈవెంట్లో ఈ రేంజిలో అందాల ఆరబోత ఏంటి బాబోయ్ అంటూ నోరెళ్లబెట్టి చూశారు అందరూ.

అంతటితో ఆగకుండా జైన్ ఇన్‌స్టా నుంచి ఫొటోలు, వీడియోలన్నీ బయటికి తీశారు. అందులో మరింత హాట్‌గా కనిపిస్తోంది జైన్. దీంతో ఇన్‌స్టాలో తన ఫాలోవర్లు కూడా పెరిగిపోయారు. సినిమాలో కూడా ఇంతే హాట్‌గా కనిపిస్తే, తన పాత్ర-పెర్ఫామెన్స్ కూడా బాగుంటే తెలుగులో జైన్ బిజీ అయ్యే అవకాశాలున్నాయి.

This post was last modified on April 5, 2026 1:41 pm

Share

Recent Posts

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

24 minutes ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

8 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

10 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

11 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

11 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

11 hours ago