నిన్న విడుదలైన బైకర్ కు పబ్లిక్ టాక్, రివ్యూస్ డీసెంట్ గా ఉన్నాయి. సినిమా చూస్తే నిరాశపడరనే అభిప్రాయం అధిక శాతం వ్యక్తమయ్యింది. అలాని థియేటర్లు కలెక్షన్లతో హోరెత్తిపోవడం లేదు. ఎందుకంటే ఇలాంటి స్పోర్ట్స్ డ్రామాలు మెల్లగా పికప్ అవుతాయి. జనాలకు చేరడానికి కొంచెం టైం తీసుకుంటాయి. అందుకే లాజిక్ లేకపోయినా ఎంటర్ టైన్మెంట్ ని నమ్ముకున్న రాకాసనే ఒక అడుగు ముందుంది. కాబట్టి ఇది సరిపోదు.
బైకర్ కోసం శర్వా విపరీతంగా కష్టపడ్డాడు. ఇరవై కిలోల బరువు తగ్గాడు. లుక్ మార్చుకోవడం కోసం అయిదు నెలల సమయం కేటాయించాడు. రెండేళ్లు ఇదే ప్రాజెక్టు మీద ఉన్నాడు. దీని తాలూకు వీడియో కూడా వైరల్ అయ్యింది. అయితే ఒక ఆర్టిస్ట్ ఎంత హార్డ్ వర్క్ చేశాడనేది జనాలకు అవసరం లేదు. తాము కోరుకున్నవి ఉన్నాయా లేదాని మాత్రం సినిమాలో చూసుకుంటారు కాబట్టి అవి బైకర్ లో పూర్తి స్థాయిలో లేవనిపించడం కొంత నెమ్మదితనానికి కారణం కావొచ్చు.
గతంలో నాని జెర్సీ కూడా స్లోగానే ఎక్కింది. చివరికి కల్ట్ గా నిలిచిపోయింది. దీని స్క్రీన్ ప్లే ఏకంగా పుస్తకంగా ప్రచురించి ఇటీవలే మార్కెట్ లోకి రిలీజ్ చేశారు. ఆ స్థాయిలో బైకర్ నిలుస్తుందో లేదో తెలియాలంటే ఇంకొద్ది రోజులు ఆగాలి. ఎందుకంటే కమర్షియల్ పుల్ తక్కువగా ఉండే ఇలాంటి సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకోవడం చాలా అవసరం. ఆ విషయంలో కొంచెం వెనుకబడి ఉన్నట్టు కనిపిస్తున్నప్పటికీ ఆదివారం తర్వాత ఒక స్పష్టత వస్తుంది.
ఇదంతా పక్కనపెడితే శర్వా పడిన కష్టాన్ని మరింతగా గుర్తించాలని అభిమానులు కోరుకుంటున్నారు. నారి నారి నడుమ మురారిలాగా కేవలం వినోదాన్ని నమ్ముకుని హిట్ కొట్టిన బాపతు కాదు బైకర్. ఎమోషన్ కోసం రెండు ముప్పావు గంటలు జనం థియేటర్లో కూర్చోవాలంటే కంటెంట్ సాలిడ్ గా ఉండాలి. దర్శకుడు అభిలాష్ రెడ్డి ఆ దిశగానే మంచి ప్రయత్నం చేశారు. ఫైనల్ తీర్పు ఎలా ఉండబోతోందో రెండో వారంలోకి అడుగు పెట్టక ముందే తేలిపోతుంది. చూద్దాం.
Gulte Telugu Telugu Political and Movie News Updates
