వందా రెండు వందలు కాదు ఏకంగా నాలుగు వేల కోట్ల బడ్జెట్ తో తీస్తున్నామని నిర్మాత నమిత్ మల్హోత్రా చెబుతున్న రామాయణ నుంచి ఇప్పటిదాకా సాలిడ్ వీడియో కంటెంట్ రాలేదు. ఆ మధ్య చిన్న గ్లిమ్ప్స్ వదిలారు కానీ అది కేవలం లుక్స్ పరిచయానికి మాత్రమే పరిమితమయ్యింది. ఏప్రిల్ 2 హనుమాన్ జయంతి సందర్భంగా అసలైన ప్రమోషన్లను టీమ్ మొదలుపెట్టనుంది. 2 నిమిషాల 38 సెకండ్ల వీడియోని ప్రపంచానికి పరిచయం చేయడానికి సిద్ధమయ్యింది.
ఇప్పుడు కోట్లాది కళ్ళు ఆ టీజర్ మీద ఉండబోతున్నాయి. ఎందుకంటే బాలీవుడ్ స్థాయిని దురంధర్ పది మెట్లు పైకి ఎక్కిస్తే రామాయణ వంద మెట్లు పైకి తీసుకెళ్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. దానికి మొదటి స్టెప్పు ఈ టీజరే. అందులోనూ ఈ ఏడాదే రిలీజ్ కాబట్టి బిజినెస్ పరంగా క్రేజ్ రావాలంటే కంటెంట్ ఓ రేంజ్ లో ఉందనే అభిప్రాయం జనంలో కలగాలి. ఖచ్చితంగా సినిమా చూడాలనే ఆసక్తి అన్ని వర్గాల్లో రేకెత్తించాలి. దర్శకుడు నితేశ్ తివారి మీద భారీ అంచనాలున్నాయి.
ఎక్స్ ట్రాడినరి అనిపిస్తేనే రామాయణ మీద బజ్ మొదలవుతుంది. రన్బీర్ కపూర్, సాయిపల్లవి జంటగా నటించిన ఈ ఎపిక్ డ్రామాలో యష్ రావణుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా రూపొందుతున్న రామాయణ సెకండ్ పార్ట్ 2028లో రిలీజవుతుంది. విజువల్ ఎఫెక్ట్స్ కి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. హిందీ సినిమాల పట్ల ఆది పురుష్ సృష్టించిన నెగటివ్ ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని పోగొట్టాల్సిన బాధ్యత ఇప్పుడీ రామాయణ మీద ఉంది.
ఇక ఆర్టిస్టుల విషయానికి వస్తే యానిమల్ తర్వాత రన్బీర్ కపూర్ కి ఇదే ఫస్ట్ రిలీజ్ కానుంది. సంజయ్ లీలా భన్సాలీ లవ్ అండ్ వార్ ఇంకా ఆలస్యమయ్యేలా ఉంది. సాయిపల్లవికి ఇది డెబ్యూ కాదు. జునైద్ ఖాన్ సరసన నటించిన ఏక్ దిన్ రిలీజవుతున్న నేపథ్యంలో తనకూ రామాయణ బ్రేక్ ఇవ్వడం అవసరం. ఇక కెజిఎఫ్, టాక్సిక్ లాంటి వయొలెంట్ మూవీస్ మధ్య దీన్ని ఎంచుకున్న యష్ సైతం కొత్త షేడ్ చూపిస్తా అంటున్నారు. చూడాలి మరి ఎవరెవరికి ఇది ఎలాంటి మలుపు ఇస్తుందో.
Gulte Telugu Telugu Political and Movie News Updates