Movie News

చిరంజీవి రవితేజ… జమీల్ జమాలి ఫ్రెండ్సే

అదేంటి దురంధర్ లో మంత్రి జమీల్ జమాలికి మన టాలీవుడ్ చిరంజీవి, రవితేజకు కనెక్షన్ ఏమనుకుంటున్నారా. కొన్ని సినిమా సంగతులు ఇలాగే ఉంటాయి. కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళదాం. మెగాస్టార్ నటించిన బ్లాక్ బస్టర్ ‘గ్యాంగ్ లీడర్’ రీమేక్ హిందీలో ‘ఆజ్ కా గుండారాజ్’గా 1992లో రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో ఎన్ఎన్ సిప్పీ నిర్మించారు. హీరో నలుగురు స్నేహితుల్లో ఒకరిగా రవితేజ నటించగా, కీలకమైన గుడ్డు క్యారెక్టర్ జమీల్ జమాలి అలియాస్ రాకేష్ బేడీకి దక్కింది.  

ఒరిజినల్ వెర్షన్ అమాయకంగా ఉండే ఈ పాత్రలో నారాయణరావు కనిపిస్తారు. దాన్ని బాలీవుడ్ లో రాకేష్ బేడీ పోషించారు. విలన్లు అతి దారుణంగా చిరు ఫ్రెండ్స్ ని మట్టుబెడతారు. చివరి నిమిషంలో కొన ఊపిరితో ఉన్న రాకేష్ బేడి అక్కడికి వచ్చిన చిరంజీవికి అసలు నిజం చెప్పేసి చనిపోతాడు. ఆజ్ కా గుండారాజ్ లో రవితేజ కన్నా ఎక్కువ డైలాగ్స్, యాక్టివ్ గా ఉండేది రాకేష్ బేడీనే. ముఖ్యంగా ప్రాణాలు కోల్పోయే సన్నివేశంలో ఇంటెన్స్ ఎక్స్ ప్రెషన్లు ఉంటాయి.

ఈ రకంగా మన టాలీవుడ్ తో కూడా రాకేష్ బేడీకి కనెక్షన్ ఉందన్న మాట. నాలుగు దశాబ్దాల కెరీర్ లో ఈయన ఎన్నో సినిమాల్లో నటించారు కానీ దురంధర్ ఇచ్చినంత గుర్తింపు ఎప్పడూ రాలేదనేది వాస్తవం. టీవీ సీరియల్స్ లో ఎంతో ఖ్యాతి గడించారు కానీ సిల్వర్ స్క్రీన్ పరంగా మాత్రం రావాల్సినంత క్రెడిట్ రాలేదనేది మూవీ లవర్స్ మాట. బచ్చా హై తు మేరా అంటూ దురంధర్ లో వాడిన రాకేష్ ఊతపదం ఇప్పుడు చాలా కంపెనీలు తమ ప్రకటనల్లో వాడుకుంటున్నాయి.

ఒక ఆర్టిస్టు జీవితాన్ని, ఇమేజ్ ని ఒక్క బ్లాక్ బస్టర్ అమాంతం మార్చేస్తుందని చెప్పడానికి ఇంత కన్నా ఉదాహరణ వేరే అక్కర్లేదు. దురంధర్ పుణ్యమాని రాకేష్ బేడీకి ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. రెమ్యునరేషన్ కూడా అయిదింతలు పెరిగిందని అంటున్నారు. విచిత్రం ఏమిటంటే పలువురు తమిళ తెలుగు దర్శకులు కూడా ఆఫర్లు ఇచ్చారట. కానీ హిందీ తప్ప వేరే భాషకు ఎప్పుడూ ప్రాధాన్యం ఇవ్వని జమీల్ జమాలి సాబ్ ఇకపై ఎలాంటి పాత్రల్లో కనిపిస్తారో చూడాలి.

This post was last modified on March 28, 2026 11:17 am

Share

Recent Posts

కలిసొచ్చే కాలానికి ఛాన్స్ కొట్టేసిన కామ్రేడ్

కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…

7 hours ago

జైలర్ 2 ప్రపంచం ఎంత కొత్తగా ఉంటుంది

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…

9 hours ago

బండ్ల గణేష్ పేరు వాడుకుంది ఎవరు?

ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…

9 hours ago

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

11 hours ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

12 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

13 hours ago