Political News

మళ్లీ జగన్ లాంటోళ్లు వస్తే… అమరావతిపై షర్మిల

మళ్లీ ఏ జగన్ లాంటోళ్లు వస్తే అనే ముందుచూపు చంద్రబాబు నాయుడు విజన్ కు నిదర్శనం అని వైయస్ షర్మిల అభిప్రాయపడ్డారు. ఇందుకోసమే అమరావతి చట్టబద్ధతకు అసెంబ్లీ తీర్మానం చేస్తున్నారని అన్నారు. ఈ తీర్మానం పై ఆమె హర్షం వ్యక్తం చేశారు. సెక్షన్ 5 సవరణకు కేంద్రాన్ని కోరడం న్యాయబద్ధమే అని కూడా వ్యాఖ్యానించారు. మళ్లీ ఏ జగన్ లాంటోళ్లు వస్తే..అని ముందుచూపు ఉండడం మీ విజన్ కి నిదర్శనం అని చంద్రబాబును ఉద్దేశించి ట్వీట్ చేశారు.

అయితే ఇదే సమయంలో మరి రాజధాని కోసం విభజన చట్టంలో పెట్టిన సెక్షన్ 94(3) సంగతేంటి అంటూ చంద్రబాబును ప్రశ్నించారు. సెక్షన్ 5 ( సబ్ సెక్షన్ 2) లో ఎట్ అమరావతి పదాన్ని పెట్టించేందుకు ఉన్న శ్రద్ధ.. సెక్షన్ 94(3) కింద అమరావతి ఫండ్స్ అడిగేందుకు లేదా ? గెజిట్ తోనే అమరావతి గెయిన్ అవుతుందా ? ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణ భాద్యత కేంద్రానిదే అని తెలియదా ? ఎంతైతే అంత కేంద్రం నిధులు ఇవ్వాల్సిందే అనే క్లాజ్ సెక్షన్ 94(3d) చదవలేదా ? అంటూ ప్రశ్నించారు.

కేంద్రం చేస్తున్న మోసంపై, నిధులు హక్కుగా ఇవ్వాల్సిందేనని అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. విభజన చట్టానికి కేంద్రం తూట్లు పొడుస్తుందని ఆమె ఆరోపించారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అసెంబ్లీ వేదికగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

మోడీ గారిచ్చిన చెంబుడు నీళ్లు, తట్టెడు మట్టితో సరిపెట్టుకుందామా ? ఇదే బీజేపీ రాజధానికి ఇచ్చిన గొప్ప ప్రసాదంగా భావిద్దామా ? అసలొద్దు.. అప్పులిప్పిస్తే చాలని రాజీపడదామా? పదో పరకో ముష్టిగా పడేస్తుంటే ఇప్పటికింతే సంతోషం అనుకుందామా? అమరావతికి నిర్మాణానికి పట్టే రూ.లక్ష కోట్లు ప్రజల నెత్తిమీద వేద్దామా? అని షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రశ్నలను సంధించారు.

This post was last modified on March 28, 2026 11:39 am

Share

Recent Posts

మతిపోగొడుతున్న వారణాసి లెక్కలు

సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…

27 minutes ago

కళ్యాణ్ గుండె ధైర్యం గట్టిదే

అక్టోబర్ 9 విడుదల కాబోతున్న కామ్రేడ్ కళ్యాణ్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఎదురుగా ఆదర్శ కుటుంబం ఏకె 47…

34 minutes ago

పరీక్షలు బాగా రాపించి సినిమాకి తీసుకురండి

చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…

2 hours ago

హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు ఏపీ సర్కార్?

ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…

3 hours ago

ఐకానిక్ షోకు తెర‌… చివ‌రి సీజ‌న్లో అల్లు అర్జున్‌?

ఇండియాలో వివిధ భాష‌ల్లో అనేక టాక్ షోలు ఉన్నాయి. అందులో అత్యంత పాపుల‌ర్ ఏది అంటే బాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత…

3 hours ago

ఏపీలో బీసీ రిజర్వేషన్లపై సంచలన తీర్పు

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…

4 hours ago