Movie News

బుచ్చిబాబుకి మాత్రమే ఎలా సాధ్యమవుతోంది

2026 విడుదలైన కాబోతున్న ప్యాన్ ఇండియా మూవీస్ లో హైప్ అంతకంతా పెంచుకుంటూ పోవడమే తప్ప తగ్గించుకోలేకపోయిన సినిమా ఏదైనా ఉందంటే అది పెద్దినే. మొదటి టీజర్, రెండు పాటలు, తాజాగా రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా వదిలిన పెహల్వాన్ వీడియో ఒకదాన్ని మించి మరొకటి బ్లాక్ బస్టరయ్యాయి. ఒక్కసారి కూడా నెగిటివిటీ రాలేదు. యాంటీ ఫ్యాన్స్ కి దర్శకుడు బుచ్చిబాబు ఒక్క శాతం ఛాన్స్ ఇవ్వలేదు. అంత సాలిడ్ కంటెంట్ ఇచ్చాడు.

అసలు శంకర్ వల్లే కానిది బుచ్చిబాబుకు ఎలా సాధ్యమయ్యిందనే ప్రశ్న రావడం సహజం. ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన పాయింట్ ఒకటుంది. అదే సాలిడ్ కంటెంట్. బుచ్చిబాబు ఆషామాషీ రెగ్యులర్ కథను రాసుకోలేదు. పల్లెటూరిలో రకరకాల ఆటలు ఆడే ఒక మాములు కూలీని హీరోగా మార్చి అతని మీద బలమైన బ్యాక్ గ్రౌండ్ సెట్ చేసుకున్నాడు. విలేజ్ నుంచి ఇంటర్నేషనల్ మైలేజ్ దాకా ఒక కుర్రాడి ప్రయాణం ఎలా జరిగిందనే దాని మీద అదిరిపోయే సబ్జెక్టు సిద్ధం చేసుకున్నాడు.

ఇంత మంచి కాన్వాస్ కి రామ్ చరణ్ లాంటి హీరో దొరికే సరికి ఎంత వాడుకోవాలో అంతకన్నా ఎక్కువే పిండేసుకున్నాడు. బయటికి వదలుతున్న ప్రతి విజువల్ ని ఆడియన్స్ ఇష్టపడేలా చేసుకున్నాడు. ఇంకా వేరే పాత్రలను రివీల్ చేయలేదు. జాన్వీర్ కపూర్, శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యెందు శర్మ క్యారెక్టర్లను వీడియో రూపంలో పరిచయం చేయలేదు. వాళ్లందరినీ ట్రైలర్ కట్ కోసం దాచి పెట్టాడు. అది బయటికి వచ్చాక ప్యాన్ ఇండియా బజ్ పెరుగుతుంది.

దీంట్లో క్రికెట్ ఒకటే కాదు రకరకాల గేమ్స్ ఉన్నాయని రివీల్ చేయడం ద్వారా ఆసక్తిని మరింత పెంచాడు బుచ్చిబాబు. సుకుమార్ శిష్యులు అంటే ఆయనలో సగం కాదు ఆయనకు డబుల్ అనే స్థాయిలో క్వాలిటీ ఇవ్వడం అయితే పెరుగుతోంది. ఇక అసలైన టాస్క్ ముందు ఉంది. ఐటెం సాంగ్ పూర్తి చేసి, రీ రికార్డింగ్, పోస్ట్ ప్రొడక్షన్ చూసుకుంటూనే ప్రమోషన్ల మీద దృష్టి పెట్టాలి. ఈ నెలా మినహాయిస్తే చేతిలో ఉన్న ముప్పై రోజులు చాలా కీలకంగా మారబోతున్నాయి.

This post was last modified on March 27, 2026 9:04 pm

Share

Recent Posts

కమల్ కోసం రజినీ త్యాగం?

సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ ఎంత మంచి మిత్రులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐతే కెరీర్…

3 hours ago

‘కామ్రేడ్ కళ్యాణ్’ను కాపాడిన మెగాస్టార్

ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి మద్దతు ఇస్తారో చెప్పడానికి ఇది తాజా రుజువు. ఈ శుక్రవారం విడుదలైన…

3 hours ago

కోన వెంకట్ భాషలో ‘క్రిమినల్స్’ ఎవరు

నిర్మాత, రచయిత కోన వెంకట్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ బాగా వైరలవుతున్నాయి. కొందరు దర్శకులు మూడు గంటల…

5 hours ago

స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు

స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీం కోర్టు తీర్పు కూడా వచ్చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పీడ్ పెంచింది. లోకల్…

7 hours ago

విజయ్ చెప్పింది ప్రాక్టికల్‌గా సాధ్యమేనా

రణబాలినే కాదు ఇకపై తన సినిమాలు దేనికీ తన పరిధి మేరకు టికెట్ రేట్ల పెంపు ఉండకుండా చూసుకుంటానని విజయ్…

7 hours ago

జంతర్ మంతర్… కేసీఆర్ ముందే పసిగట్టారా?

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో నిరసన చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నిరసనలకు…

9 hours ago