Movie News

నాగబాబు చెప్పిందొకటి.. చిరు చేసిందొకటి

తన అభిమానుల పట్ల మెగాస్టార్ చిరంజీవి చూపించే ప్రేమ ఎలాంటిదో ఎన్నో సందర్భాల్లో చూశాం. అభిమానుల వల్లే ఇలా ఉన్నాను అంటూ కేవలం గొప్పగా మాటలు చెప్పడం కాకుండా తరచుగా తన వీరాభిమానులకు తనను కలిసే అవకాశం కల్పించి వారితో ప్రేమగా మాట్లాడుతుంటాడు చిరు. తాజాగా ఒక సీనియర్ అభిమానికి జీవిత కాల అనుభవాన్ని మిగిల్చారు చిరు.

మెగాస్టార్ పాటలకు అదిరిపోయే లెవెల్లో స్టెప్పులు వేస్తూ నడి వయస్కుడైన మురళీ అనే ఆంధ్రా అభిమాని సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యారు. చిరు మీద తన వల్లమాలిన అభిమానాన్ని గుర్తించి ఆయన్ని మెగాస్టార్‌తో కల్పించే ఏర్పాటు చేశారట మెగా బ్రదర్ నాగబాబు. ఐతే చిరు పది నిమిషాలు సమయం ఇస్తారని.. ఆ టైంలో చిరుతో మాట్లాడి, కాఫీ తాగి, ఫొటో దిగే అవకాశం కల్పిస్తానని నాగబాబు చెప్పారట.

కానీ వాస్తవంగా చిరు మాత్రం నాగబాబు చెప్పిన దానికి భిన్నంగా వ్యవహరించారట. ఆ అభిమానితో ఏకంగా రెండు గంటల పాటు సమయం గడిపాడట. ఈ అనుభవం గురించి సదరు అభిమాని తీవ్ర భావోద్వేగంతో మాట్లాడాడు.

‘‘చిరంజీవి గారితో మిమ్మల్ని కల్పిస్తాం. పది నిమిషాలు కాఫీ తాగి, ఫొటో దిగే అవకాశం ఉంటుందని నాగబాబు సార్ చెప్పారు. కానీ నాగబాబు గారి చెప్పిన దాని కన్నా చాలా ఎక్కువ చేశారు చిరంజీవి గారు. రెండు గంటల పాటు కూర్చోబెట్టి మాట్లాడారు. మన శంకర వరప్రసాద్ గారు షూటింగ్ జరుగుతుంటే..

ఆ షూట్ ఆపి మరీ మాతో మాట్లాడారు. ఇంత ఎనర్జీ మీకు ఎలా వచ్చింది, నేను ఎప్పుడో చేసిన పాటలను ఇప్పుడు మీరు ఎలా చేయగలుగుతున్నారు.. సూపరండీ, మీరు చాలా గొప్ప అని చెప్పారు. ఆయన అలా మాట్లాడుతుంటే ఏం మాట్లాడాలో నాకు తెలియలేదు. మీరు లేకుండా నేను లేను అని.. మీరే నా ప్రాణం అని చెప్పాను. రెండు గంటల పాటు నాకు ఎలా కాలక్షేపం అయిందో తెలియలేదు’’ అని మురళి వివరించారు.

This post was last modified on March 27, 2026 5:16 am

Share

Recent Posts

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

51 minutes ago

రాహుల్ ముందే పసిగడుతున్నారా?

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…

1 hour ago

మోహన్ బాబును మోసం చేసిన ఓదెల

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…

2 hours ago

‘హోటళ్ళు నా భార్యా బిడ్డల కోసం’

సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…

3 hours ago

హిట్టు కొట్టిన పది నెలలకు దర్శనం

టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…

4 hours ago

షాకింగ్ టాక్… బత్తా అంత కొత్తగా ఉందా

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…

6 hours ago