ఇటీవల విడుదలైన ఉస్తాద్ భగత్ సింగ్ ఫలితం విషయంలో అభిమానులు ఎంత మాత్రం హ్యాపీగా లేరన్నది వాస్తవం. వింటేజ్ పవన్ కళ్యాణ్ ని చూపించారనే ఆనందం కొంతమేర ఉన్నా కమర్షియల్ గా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావం చూపించలేకపోవడాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలా రొటీన్ కంటెంట్లతో నిరాశ పరచడం కన్నా సుదీర్ఘమైన బ్రేక్ తీసుకుని పూర్తిగా రాజకీయాల మీద దృష్టి పెట్టమని సలహాలు ఇచ్చేస్తున్నారు. కథల ఎంపికను తప్పుబడుతున్నారు.
ఇక్కడ ఫ్యాన్స్ అయినా మరెవరైనా మర్చిపోకూడని విషయాలు కొన్నున్నాయి. పవన్, మహేష్, ప్రభాస్ లాంటి హీరోల స్టార్ డమ్ మార్కెట్ క్యాలికులేషన్లకు అతీతంగా ఉంటుంది. ఒక్క బ్లాక్ బస్టర్ పడితే అరిచిన నోళ్లే పొగడ్తల వర్షం కురిపిస్తాయి. ఇది అర్థం కావాలంటే కొన్ని ఉదాహరణలు చూడాలి. 1990 టైంలో స్వర్గీయ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మూడు సినిమాలు ప్లాన్ చేసుకున్నారు. అవి బ్రహ్మర్షి విశ్వామిత్ర, సామ్రాట్ అశోక, శ్రీనాథ కవిసార్వభౌమ. అన్నీ డిజాస్టర్లే.
ఇంకేం ఎన్టీఆర్ ని జనం చూసేందుకు ఇష్టపడటం లేదని మీడియా తీర్పిచ్చింది. రకరకాల కథనాలు రాసింది. కట్ చేస్తే కేవలం నాలుగేళ్ల గ్యాప్ మేజర్ చంద్రకాంత్ రూపంలో అదిరిపోయే గొప్ప విజయాన్ని అందుకున్నారు. 1996 టైంలో చిరంజీవి ఫ్లాపుల మీద నెగటివ్ క్యాంపైన్ నడిచింది. హిట్లర్ తో కంబ్యాక్ అంటే ఏంటో చూపించారు. బాలయ్య చేసిన రూలర్, ఎన్టీఆర్ బయోపిక్స్ కనీసం బ్రేక్ ఈవెన్ కూడా చేరలేదు. తర్వాత అఖండ నుంచి బ్యాక్ టు బ్యాక్ నాలుగు బ్లాక్ బస్టర్స్ కొట్టేశారు.
ఇలాంటి ఫేజులు అందరు హీరోలు చవి చూశారు. పవన్ కు కొత్తేమీ కాదు. గబ్బర్ సింగ్ ముందు ఫ్లాపులే ఉన్నాయి. ఓజి ముందు హరిహర వీరమల్లు ఏం చేసిందో మర్చిపోలేదుగా. సో ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ వల్ల జరిగే డ్యామేజీ ఏమీ ఉండదు. రేపు సురేందర్ రెడ్డి కోరుకున్న హిట్ ఇస్తే ఇదే అభిమానులు వాహ్ అన్నా అంటారు. దేనికైనా టైం రావాలి. పార్టీ, ప్రజాసేవ కోసమే సినిమాలు చేయక తప్పని పవన్ కళ్యాణ్ ఎప్పటిలాగే కుదుపులకు భయపడకుండా రెండు పడవల ప్రయాణం చేయాల్సిందే.
This post was last modified on March 25, 2026 9:50 pm
కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…
ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…