గాయం చిన్నదే… ఆందోళన వద్దన్న పెద్ది

రెండు రోజుల్లో పుట్టినరోజు జరుపుకోబోతున్న రామ్ చరణ్ నిన్న పెద్ది సెట్స్ లో గాయపడ్డారనే వార్త అభిమానులకు ఆందోళన కలిగించింది. గచ్చిబౌలిలో షూట్ చేస్తున్న ఎపిసోడ్ లో జరిగిన ప్రమాదంలో కంటికి దగ్గరగా నుదుటిపై చిన్న దెబ్బ తగిలి నాలుగు కుట్లు పడ్డాయనే టాక్ గట్టిగా తిరిగింది. అయితే టెన్షన్ పడాల్సింది ఏమీ లేదని, రెండు మూడు రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని డాక్టర్లు చెప్పడంతో టీమ్ హమ్మయ్యా అనుకుంది. ఎక్స్ లో దాని గురించి పెద్ద చర్చే జరిగింది.

ఏప్రిల్ 30 విడుదల తేదీని ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకూడదనే ఉద్దేశంతో దర్శకుడు బుచ్చిబాబు పగలు రాత్రి కష్టపడుతున్నారు. టీమ్ మొత్తం అదే పని మీద ఉంది. చరణ్ కూడా తన వంతుగా పూర్తి సహకారం అందిస్తూ ఎక్కడికి వెళ్లకుండా అందుబాటులోనే ఉన్నాడు. ఓటిటి డీల్ అయిపోయింది. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ కు డేట్ కన్ఫర్మ్ చేసి అడ్వాన్స్ బుకింగ్స్ మార్చి 27 నుంచి మొదలు పెట్టుకోమని చెప్పేశారు. ఈలోగా చిన్నదిగా కనిపించే అవాంతరం వచ్చి పడింది. .

ఇదంతా పెద్ద గందరగోళానికి దారి తీసే ప్రమాదం ఉందని గురించిన నిర్మాతలు అఫీషియల్ గా నోట్ వదిలారు. చరణ్ త్వరగా కోలుకుని రేపటి నుంచే సెట్స్ లో అడుగు పెడతాడని, మైనర్ ఇంజురీ కాబట్టి చికిత్స త్వరగా పూర్తయ్యిందని శుభవార్త చెప్పేశారు. దీంతో టైం పడుతుందేమోనని భావించిన ఫ్యాన్స్ కి రిలీఫ్ దక్కింది. సో చిన్న బ్రేక్ తప్ప పెద్ది ప్రయాణం ఆగిపోయే ప్రసక్తే లేదన్న మాట. బర్త్ డే టైంలో ఇలా జరగడం బాధే అయినా అది పెద్దది కాకపోవడం అదృష్టం.

ఇలాంటి సందర్భాలు చిరంజీవికి ఎన్నో ఎదురయ్యాయి. గుండా క్లైమాక్స్ ని రైలు పట్టాల బ్రిడ్జ్ మీద తీస్తున్నప్పుడు తండ్రి వెంకట్ రావు తెగ ఖంగారు పడ్డారు. జగదేకవీరుడు అతిలోకసుందరి టైంలో శ్రీదేవి డేట్స్ మళ్ళీ దొరకవనే ఉద్దేశంతో 103 జ్వరంతో దినక్కుతా కసక్కురో పాటలో పాల్గొన్నారు మెగాస్టార్.. చెప్పుకుంటూ పోతే ఇలాంటివి ఎన్నో ఉదాహరణలున్నాయి. రామ్ చరణ్ కు సైతం అలాంటి రెక్స్ పీరియన్సులు ఎదురవుతున్నాయి. లెగసీ అంటే ఇవి కూడా వస్తాయి మరి.