అక్కినేని అఖిల్ హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న లెనిన్ నుంచి ఎలాంటి అప్డేట్స్ రావడం లేదు. మే 1 విడుదల చేసే ఆలోచనలో టీమ్ ఉన్నట్టు కొన్ని వారాల క్రితం లీకులు వచ్చాయి. అయితే ఏప్రిల్ 30 పెద్ది లాక్ చేసుకోవడంతో లెనిన్ వాయిదా ఫిక్సని అక్కినేని ఫ్యాన్స్ సైలెంటయ్యారు. కానీ ఇప్పుడు పెద్ది వాయిదా వార్తలు మళ్ళీ చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో మరోసారి అఖిల్ టాపిక్ తెరమీదకు వస్తోంది.
హఠాత్తుగా లెనిన్ బృందం ఎందుకు మౌనం వహిస్తోందనేది ఫ్యాన్స్ నుంచి వస్తున్న మెయిన్ డౌట్. ఇదే బ్యానర్ నిర్మాణంలో ఉన్న ఆనంద్ దేవరకొండ ఎపిక్, అశోక్ గల్లా వీసాకు అప్పుడప్పుడు పబ్లిసిటీ జరుగుతోంది కానీ లెనిన్ మాత్రం మొత్తంగా సైలెంట్ అయిపోయింది. యుద్ధ వాతావరణం వల్ల విదేశాల్లో నెలకొన్న అనిష్చితి, ఏప్రిల్ 30కే కట్టుబడినట్టు పెద్ది నుంచి వస్తున్న వార్తలు వగైరా కారణాలు లెనిన్ ని ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఆపేసినట్టు కనిపిస్తోంది.
ఇన్ సైడ్ టాక్ ప్రకారం లెనిన్ బ్యాలన్స్ షూటింగ్ ఇంకా చెప్పుకోదగ్గ మొత్తంలోనే ఉందట. దర్శకుడు మురళికిషోర్ అబ్బూరుకి ఇది రెండో సినిమానే కావడంతో అవుట్ ఫుట్ విషయంలో నాగార్జున, నాగవంశీ ఇద్దరూ దగ్గరుండి చూసుకోవడం వల్ల కొంత ఆలస్యం జరుగుతోందని అంటున్నారు. ఆల్రెడీ రిలీజ్ చేసిన పాటకు మంచి స్పందన వచ్చాక ఆ ఊపుని కొనసాగించేలా ప్రమోషన్లు కంటిన్యూ చేయాలి. కానీ లెనిన్ ఈ విషయంలో పూర్తిగా వెనుకబడి ఉంది.
షూటింగ్ ప్రారంభం నుంచే లెనిన్ కు ఎదురైన అవాంతరాలు పెద్దవే. ముందు హీరోయిన్ శ్రీలీలను తీసుకున్నారు. తర్వాత మార్చి భాగ్యశ్రీ బోర్సేతో రీ షూట్ చేశారు. అఖిల్ పెళ్లి లాంటి బ్రేకులు కొంత గ్యాప్ వచ్చేలా చేశాయి. ఇవన్నీ దాటుకుని మెల్లగా ఫినిష్ అవుతున్న టైంలో సరైన రిలీజ్ స్లాట్ దొరకడం లేదు. కొంచెం లేట్ అయినా సరే సోలో డేట్ కే లెనిన్ వదలాలని నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ లవ్ యాక్షన్ మూవీకి బడ్జెట్ కూడా భారీగానే అవుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates
