బాక్సాఫీస్ వద్ద దురంధర్ ది రివెంజ్ ప్రభంజనం మాములుగా లేదు. కనివిని ఎరుగని రీతిలో ఏపీ తెలంగాణలో ఉన్న చిన్న చిన్న బిసి సెంటర్స్ లో సైతం రాత్రి షోలు హౌస్ ఫుల్ కావడం చాలా అరుదైన విషయం. రాత్రి పది దాటితే జనాలు కనిపించని ఊళ్లలో సైతం మిడ్ నైట్ ఆటలకు టికెట్లు దొరక్కపోవడం వింతల్లోకి వింత. అది కూడా మాస్ జనాల్లో అంతగా పట్టులేని రణ్వీర్ సింగ్ లాంటి హిందీ హీరో నటించిన డబ్బింగ్ మూవీకి ఈ స్థాయి స్పందన నిజంగా అద్భుతం.
ఇక్కడే ఇలా ఉంటే ఉత్తరాది రాష్ట్రాల్లో జరుగుతున్న ఊచకోతని ఊహించుకోవచ్చు. ఇక తెలుగు విషయానికి వస్తే ఈ వారం కొత్త రిలీజులు అన్నీ చిన్నవే కావడం చూస్తుంటే, దురంధర్ సునామిలో ఈ చిగురుటాకులు నిలబడతాయా అనే అనుమానం కలుగుతోంది. కోర్ట్ జంట రోషన్, శ్రీదేవి నటించిన ‘బ్యాండ్ మేళం’కి నిర్మాత కోన వెంకట్ పెద్ద ప్రమోషన్లు చేసుకున్నారు. చిరంజీవితో ట్రైలర్ లాంచ్, లెక్కలేనన్ని టీమ్ ఇంటర్వ్యూలు, ఈవెంట్లు చేసి ఎంతో కొంత సౌండ్ అయితే చేశారు.
కానీ గ్రౌండ్ రియాలిటీలో బ్యాండ్ మేళంకి ఏమంత బజ్ లేదు. ఎక్స్ ట్రాడినరి టాక్ వస్తే తప్ప ఇప్పుడున్న పరిస్థితిలో నిలవడం కష్టం. టీమ్ ఆ నమ్మకంతోనే ఉంది. గత వారం తమిళంలో రిలీజై మంచి టాక్ తో నడుస్తున్న ‘యూత్’ని డబ్బింగ్ రూపంలో తీసుకొస్తున్నారు. ప్రేమలు తరహాలో సర్ప్రైజ్ హిట్ అవ్వొచ్చని నిర్మాతలు కాన్ఫిడెంట్ గా ఉన్నారు. జివి ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన మరో కోలీవుడ్ మూవీ ‘హ్యాపీ రాజ్’ అదే రోజు థియేటర్లలో అడుగు పెట్టనుంది.
ప్రియదర్శి, సాయికుమార్ ప్రధాన పాత్రలు పోషించిన ‘సుయోధన’ కూడా ఇదే డేట్ అన్నారు. ఏమైనా మార్పు ఉందేమో వేచి చూడాలి ఇక్కడ చెప్పిన సినిమాలన్నీ దురంధర్ ది రివెంజ్ హవాని తట్టుకోవాలంటే అదిరిపోయాయని అనిపించుకోవాలి. ఉస్తాద్ భగత్ సింగ్ ఫలితం ఆశించిన స్థాయిలో లేకపోవడాన్ని శుక్రవారం రిలీజులు ఎలా వాడుకుంటాయనేది పూర్తిగా టాక్ మీద ఆధారపడి ఉంటుంది సుడిగాలి సుధీర్ ‘గోట్’ని తెలివిగా వాయిదా వేసుకున్నారు. సో ఎవరు నిలుస్తారు ఎవరు పడతారు అనేది లెట్ వెయిట్ అండ్ సీ.
Gulte Telugu Telugu Political and Movie News Updates