Movie News

వార‌ణాసికి ఇవి టార్గెట్లే కాదు

తొలి రోజు రూ.230 కోట్లు.. మూడు రోజులు తిరిగేస‌రికి రూ.500 కోట్లు.. ఇదీ దురంధ‌ర్ సినిమా ప్ర‌భంజ‌నం. ఈ సినిమా రెండో వీకెండ్ అయ్యేస‌రికి రూ.1000 కోట్ల క్ల‌బ్బులో అడుగు పెట్ట‌డం లాంఛ‌నంగానే క‌నిపిస్తోంది. ఫుల్ ర‌న్లో రూ.2 వేల కోట్ల మైలురాయిని కూడా అందుకోవ‌చ్చు. ఈ వ‌సూళ్ల మోత‌ను చూసి అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఇండియ‌న్ బాక్సాఫీస్‌లో ఎన్నో ఏళ్లుగా నిలిచి ఉన్న‌ అన్ని వ‌సూళ్ల రికార్డులూ బ‌ద్ద‌లు కొట్టేస్తోంద‌ని దురంధ‌ర్‌ను కొనియాడుతున్నారు. 

కానీ ఈ ఘ‌న‌త‌లు దురంధ‌ర్ ఖాతాలో మ‌రీ ఎక్కువ రోజులేమీ ఉండే అవ‌కాశం క‌నిపించ‌డం లేదు. మ‌హా అయితే ఏడాది పాటు మాత్ర‌మే దురంధ‌ర్ పేరిట ఈ రికార్డులుంటాయి. వ‌చ్చే ఏడాది వేస‌విలో రిలీజ్ కాబోతున్న రాజ‌మౌళి, మ‌హేష్ బాబుల వార‌ణాసి వ‌స్తే అన్ని రికార్డులూ గ‌ల్లంత‌వ‌డం ఖాయ‌మే. ఆ సినిమా ఓ మోస్త‌రు టాక్ వ‌చ్చినా చాలు.. ప్ర‌స్తుత రికార్డులు దాని ముందు జుజుబినే అవుతాయి.

ఇప్ప‌టిదాకా చూసిన ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్‌ను బ‌ట్టి వార‌ణాసి ఓపెనింగ్స్ మామూలుగా ఉండ‌వు. ఓవ‌రాల్ వ‌సూళ్లు కూడా ఎవ్వ‌రూ అందుకోలేని స్థాయిలోనే ఉండే అవ‌కాశ‌ముంది. రాజ‌మౌళి సినిమాలంటే క‌శ్మీర్ నుంచి క‌న్యాకుమారి వ‌ర‌కు ఒకే ర‌క‌మైన హైప్ ఉంటుంది. దేశంలో ఉన్న ప్ర‌తి సినీ ప్రేమికుడూ వార‌ణాసి సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూడాల‌నుకుంటాన‌డంలో సందేహం లేదు. దురంధ‌ర్‌కు మంచి హైపే ఉన్నా స‌రే.. వార‌ణాసి రేంజి రీచ్ లేద‌న్నది స్ప‌ష్టం. వార‌ణాసి దేశంలోని అన్ని ప్ర‌ధాన భాష‌ల్లో ఒకేసారి రిలీజ‌వుతుంది. అన్ని భాష‌ల్లోనూ ఒకే రక‌మైన హైప్ ఉంటుంది. 

పాన్ వ‌ర‌ల్డ్ స్థాయిలో ఆ సినిమాకు ఉన్న బ‌జ్ వేరు. ఓవ‌ర్సీస్ క‌లెక్ష‌న్లు ఊహించ‌ని స్థాయిలో ఉండ‌బోతున్నాయి. ఆ చిత్రానికి టికెట్ల ధ‌ర‌లు కూడా ఎక్కువే ఉంటాయి. కాబ‌ట్టి ఓపెనింగ్స్ ద‌గ్గ‌ర్నుంచి ఓవ‌రాల్ వ‌సూళ్ల వ‌ర‌కు నంబ‌ర్స్ చాలా భారీగా ఉంటాయ‌న్న‌ది స్ప‌ష్టం. మ‌ధ్య‌లో ఈ ఏడాది రామాయ‌ణం సినిమా కూడా భారీ హైప్‌తోనే రాబోతోంది కానీ.. దాంతో పోలిస్తే వార‌ణాసికే రీచ్ ఎక్కువ అన్న‌ది స్ప‌ష్టం. కాబ‌ట్టి దురంధ‌ర్ నిర్దేశించే టార్గెట్లు వార‌ణాసికి చిన్న‌విగా అనిపిస్తే ఆశ్చ‌ర్య‌మేమీ లేదు.

This post was last modified on March 23, 2026 11:19 am

Share

Recent Posts

మనసు మార్చుకున్న ఆదర్శం… మంచిదే కానీ

గత కొన్ని రోజులుగా బయట ప్రచారం జరుగుతున్నట్టు ఆదర్శ కుటుంబం ఏకె 47 ఒక వారం వాయిదా పడింది. ముందు…

3 hours ago

పుష్ప విలన్ ‘ట్రబుల్’ కొత్తగా ఉందే

ఒక మీడియం బడ్జెట్ సినిమాకు రాజమౌళి ప్రెజెంట్స్ అని పడిందంటే అందులో విషయం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎందుకంటే…

5 hours ago

జపాన్ ఓడినా టీమిండియా గెలవలేదు…

జపాన్‌పై రెండు పరుగుల తేడాతో గెలిచారు. కానీ ఈ మ్యాచ్ తర్వాత టీమిండియా బ్యాటింగ్‌పై మళ్ళీ సందేహాలు మొదలయ్యాయి. భారత…

5 hours ago

గిన్నిస్ బుక్కంటే క్రేజ్ తగ్గిందనుకోవాలా

ఒకప్పుడు గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డులో పేరు సంపాదించుకోవడమంటే అదో పెద్ద ఘనతగా భావించే వాళ్ళు. పెద్ద పెద్ద…

6 hours ago

నంది అవార్డులు వచ్చేస్తున్నాయహో…

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌భుత్వం ప్రకటించే నంది అవార్డుల‌కు ఎంత విలువ ఉండేదో తెలిసిందే. వాటిని జాతీయ అవార్డుల‌తో స‌మానంగా చూసేవారు.…

7 hours ago

ఆలస్యం జరిగింది ఇక ఆగడం ఉండదు

టాలీవుడ్ సినిమాలకు అదేం శాపమో అర్థం కాదు కానీ కొన్నింటికి ప్రభుత్వాల నుంచి జిఓలు సకాలంలో రావు, చివరి నిమిషం…

9 hours ago