Movie News

మూడు రోజుల్లో 500 కోట్లు.. ఇదేం ఊచకోతయ్యా

‘దురంధర్: ది రివెంజ్’ సినిమా రిలీజైనపుడు ఇండియన్ బాక్సాఫీస్ షేకైపోతుందని ముందు నుంచి ఉన్న అంచనానే. ఐతే ఇప్పుడీ సినిమా ప్రభంజనం చూస్తుంటే అంచనాలను మించిపోయినట్లే కనిపిస్తోంది. రోజువారీ బాక్సాఫీస్ నంబర్లు చూసి ట్రేడ్ పండిట్లకు కూడా దిమ్మదిరిగిపోతోంది.

ఈ చిత్రం కేవలం మూడు రోజుల్లోనే రూ.500 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టడం విశేషం. ముందు రోజు ప్రిమియర్లతో కలిపితే డే 1 ఈ సినిమా వరల్డ్ వైడ్ రూ.230 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. రెండో రోజు వసూళ్లు కొంతమేర తగ్గాయి. కానీ శనివారం వీకెండ్ కావడం, రంజాన్ సెలవు కూడా కలిసి రావడంతో వరల్డ్ వైడ్ వసూళ్ల మోత మోగించేసింది ‘దురంధర్ 2’.

శుక్రవారంతో పోలిస్తే శనివారం వసూళ్లు 40 శాతానికి పైగా పెరిగాయి. ఈ ఒక్క రోజే ‘దురంధర్ 2’ రూ.160 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం విశేషం. తొలి రెండు రోజుల్లో తెలుగు, తమిళ వెర్షన్లు రిలీజ్ కాని సంగతి తెలిసిందే. శనివారం మధ్యాహ్నం నుంచి ఇవి కూడా అందుబాటులోకి రావడంతో వసూళ్లు మరింత పెరిగాయి.

ఆదివారం కూడా ‘దురంధర్ 2’ భారీ వసూళ్లతో సాగిపోతోంది. మ్యాట్నీల నుంచి మెజారిటీ షోలు హౌస్ ఫుల్స్‌తో నడుస్తున్నాయి. నాలుగో రోజు కూడా ఈ సినిమా వంద కోట్లకు తగ్గకుండా కలెక్షన్లు రాబట్టే సంకేతాలు కనిపిస్తున్నాయి.

ఎక్స్‌టెండెడ్ వీకెండ్లో ఈ సినిమా రూ.600 కోట్ల మైలురాయిని అందుకోబోతోంది. ఒక హిందీ సినిమాకు ఈ స్థాయిలో వసూళ్లు రావడం ఇప్పటిదాకా ఎన్నడూ జరగలేదు. ‘దురంధర్’ పార్ట్ 1 ఫుల్ రన్లో రూ.1400 కోట్ల వసూళ్లు రాబట్టగా ‘దురంధర్ 2’ ఏకంగా రూ.2 వేల కోట్ల మైలురాయిని అందుకుంటుందని రిలీజ్ ముంగిట ట్రేడ్ పండిట్లు అంచనా వేశారు.

వీకెండ్ వరకు ఈ సినిమా ప్రభంజనం చూస్తే అదేమీ కష్టమైన టార్గెట్ కాదనే అనిపిస్తోంది. రెండో వీకెండ్ అయ్యేసరికి ఈ చిత్రం రూ.1000 కోట్ల మైలురాయిని అందుకోవడం లాంఛనమే.

This post was last modified on March 23, 2026 10:12 am

Share

Recent Posts

బాబు పవన్ భేటీ… స్థానిక ముడి పడినట్టేనా?

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కూటమి నేతలు ఎన్నికల వ్యూహంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో…

50 minutes ago

గంప నిండా సినిమాలు… ఎక్కడయ్యా జనాలు

ఒక జాతీయ సెలవు దినం రోజు ఎనిమిది సినిమాలు విడుదలైతే ఆ వీకెండ్ మొత్తం థియేటర్లు కళకళలాడిపోవాలి. వాటిలో సగం…

1 hour ago

జనాలు పట్టేశాక నిజాలు ఒప్పుకుంటే ఎలా?

ఏదైనా కథ, పాత్ర, లేదా పాట విషయంలో పాత సినిమాల నుంచి స్ఫూర్తి పొందడం కొత్తేమీ కాదు. ఐతే అలా…

1 hour ago

త్రివిక్రమ్ బాధ్యత గురించి భేతాళ ప్రశ్న

నిన్న ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా గురించి నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చే ప్రయత్నం…

2 hours ago

రియాలిటీకి దగ్గరగా ఉన్నా కామెంట్స్ తప్పలేదు

నిన్న కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' టైటిల్ రివీల్ టీజర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అరిటాకులో భోజనాలు వడ్డించే ఒక…

2 hours ago

సరైన పుకారు ఎవరు సృష్టించారు

సరైనోడు ఇచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు బోయపాటి శీను కాంబోలో ఒక సినిమా తెరకెక్కే అవకాశముందంటూ నిన్న…

3 hours ago