Movie News

ఒకవేళ రెహమాన్ టైంకి ఇవ్వకపోతే?

ఒకప్పుడు చాలా వరకు ఒక సినిమాకు ఒకే సంగీత దర్శకుడు పాటలతో పాటు నేపథ్య సంగీతం అందించేవాడు. కానీ ఇప్పుడు ట్రెండు మారిపోతోంది. ఒక సంగీత దర్శకుడు పాటలు అందిస్తే.. ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ నేపథ్య సంగీతం సమకూరుస్తున్నాడు. బాలీవుడ్లో అయితే ఒకే సినిమాకు పలువురు సంగీత దర్శకులు పాటలు సమకూర్చే సంస్కృతి కూడా ఉంది. కానీ దక్షిణాదిన మాత్రం చాలా వరకు ఒకే మ్యూజిక్ డైరెక్టర్ అన్ని పనులూ చూసుకోవడమే జరుగుతుంటుంది.

ఈ మధ్య కొన్ని పెద్ద చిత్రాలకు నేపథ్య సంగీతం వేరొకరితో చేయించుకునే సంస్కృతి పెరుగుతోంది. ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రానికి బీజీఎం పని కోసం తమన్ రంగంలోకి దిగాడు. దేవిశ్రీ ప్రసాద్ పాటల వరకే పరిమితం అయ్యాడు. దీని మీద చాలా చర్చ జరగ్గా.. సినిమాను ప్రిపోన్ చేయడం, దేవి బిజీగా ఉండడం వల్లే తమన్‌తో పని చేయించుకోవాల్సి వచ్చిందని, అంతకుమించి ఏమీ లేదని దర్శకుడు హరీష్ శంకర్ స్పష్టం చేశాడు. 

ఐతే త్వరలో ఇంకో పెద్ద సినిమాకు ఇలా వేరే మ్యూజిక్ డైరెక్టర్ బీజీఎం అందిస్తే ఆశ్చర్యమేమీ లేదనే చర్చ జరుగుతోంది. ఆ చిత్రమే.. పెద్ది. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన పాటలు, బీజీఎం కోసం నెలల తరబడి సమయం తీసుకుంటారన్న సంగతి తెలిసిందే. ఐతే సినిమా మొదలు కావడానికి ముందే చాలా కాలం రెహమాన్‌తో కలిసి కూర్చుని పాటలు చేయించుకున్నాడు దర్శకుడు బుచ్చిబాబు.

ఆయన పెట్టిన ఎఫర్ట్ మంచి పాటలు కూడా తయారయ్యాయి. ఐతే ఈ సినిమాకు రెహమాన్ బీజీఎం పని కూడా ముందే మొదలుపెట్టినప్పటికీ.. మొత్తం కంటెంట్ ఆయన చేతికి చేరడానికి టైం పట్టేలా ఉంది. ఏప్రిల్ 30 సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా.. ఇంకా షూట్ పూర్తి కాలేదు. రెహమానేమో రంజాన్ టైంలో పెద్దగా పని చేయరు. ఆల్రెడీ పూర్తయిన సన్నివేశాలకు కూడా ఇంకా బీజీఎం పూర్తి చేయలేదని తెలుస్తోంది. 

ఇంకా కొత్తగా వచ్చే కంటెంట్‌కు నిర్దిష్ట సమయంలో రెహమాన్ వర్క్ పూర్తి చేస్తారా లేదా అన్న సందేహాలున్నాయి. ఒకవేళ రెహమాన్ టైంకి ఔట్ పుట్ ఇవ్వకపోతే.. సినిమా విడుదలను మరోసారి వాయిదా వేయాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితే వస్తే బీజీఎం తమన్ లేదా మరో సంగీత దర్శకుడితో చేయించుకుందామని ప్లాన్-బితో టీం రెడీగా ఉన్నట్టు ఇండస్ట్రీలో వార్త చక్కర్లు కొడుతుంది. కాబట్టి ‘పెద్ది’కి కూడా పాటలు ఒకరు, బీజీఎం ఒకరు చేస్తే ఆశ్చర్యమేమీ లేదు.

This post was last modified on March 21, 2026 12:19 am

Share

Recent Posts

2027 వరల్డ్‌కప్‌లో 13 మ్యాచ్‌లు ఆడితేనే కప్…

2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…

3 hours ago

స్పేస్‌లోనే AI ల్యాబ్… పంపింది హైదరాబాద్ కంపెనీ!

ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…

4 hours ago

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

5 hours ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

11 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

13 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

14 hours ago