Movie News

టాక్సిక్ వచ్చి ఉంటే ఏమయ్యేది

ఇప్పుడు చాలా మంది మూవీ లవర్స్ మదిలో మెదులుతున్న ప్రశ్న ఇదే. నిజానికి దురంధర్ ది రివెంజ్ కి విపరీతమైన బజ్ ఉందని తెలిసినా దానితో క్లాష్ అయ్యి హిట్టు కొట్టాలని యష్ సంకల్పంగా పెట్టుకున్నాడని బెంగళూరు టాక్ జోరుగా నడిచింది. కానీ పరిస్థితులు సహకరించలేదు. పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం, ప్రమోషన్లకు టైం లేకపోవడం. కెవిఎన్ ప్రొడక్షన్స్ కున్న ఆర్థిక సమస్యలు ఇలా రకరకాల కారణాల వల్ల టాక్సిక్ వేరే ఆప్షన్ లేక జూన్ నెలకు వెళ్ళిపోయింది.

ఒకవేళ టాక్సిక్ ఇప్పుడు వచ్చి ఉంటే ఏమయ్యేదో ముందు అనాలసిస్ చేద్దాం. ముందు ఉస్తాద్ భగత్ సింగ్ డ్రాప్ అయ్యేది. మొదట అనౌన్స్ చేసిన మార్చి 26 విడుదలకు కట్టుబడి దానికే ఫిక్స్ అయ్యేది. దేవిశ్రీ ప్రసాద్ కు తగినంత సమయం దొరికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చేసేవారు. దీంతో తెలుగు ప్రేక్షకులకు కేవలం రెండు డబ్బింగ్ ఆప్షన్లు దురంధర్ ది రివెంజ్, టాక్సిక్ మిగిలేవి. టాలీవుడ్ స్ట్రెయిట్ మూవీ లేకుండా ఉగాది పండగ అయిపోయేది.

అసలైన సమస్య మరొకటి వచ్చేది. టాక్సిక్ కు ఉన్న బలమైన డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ కారణంగా ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో థియేటర్ పంపకాల్లో దురంధర్ రివెంజ్ కు ఇబ్బందులు తలెత్తేవి. టాక్సిక్ కూడా బ్లాక్ బస్టర్ తెచ్చుకుంటే సౌత్ లో దురంధర్ రెవిన్యూలో కోత పడేది. అచ్చంగా ఇదే తరహాలో ఉత్తరాది రాష్ట్రాల్లో టాక్సిక్ కలెక్షన్లకు గండి పడేది. అంటే పరస్పరం ఒకరినొకరు దెబ్బ తీసుకునేవారనేది స్పష్టంగా అర్థమవుతోంది.

సో ఎలా చూసుకున్నా క్లాష్ లేకపోవడం మంచిదే అయ్యింది. ఎటొచ్చి దురంధర్ రివెంజ్ ఊపులో ఉస్తాద్ భగత్ సింగ్ ఎఫెక్ట్ అవుతోంది. తెలుగు సినిమా కదా ఎందుకు టెన్షన్ పడాలి అనడానికి లేదు. రెండు సినిమాల హైదరాబాద్ కలెక్షన్లు పక్కపక్కన పెట్టుకుని చూస్తే వాస్తవం ఏంటో అర్థమవుతోంది. దురంధర్ డామినెన్స్ స్పష్టంగా ఉంది. పవన్ అభిమానులు సంతృప్తిపడినా కామన్ ఆడియన్స్ కి ఉస్తాద్ భగత్ సింగ్ నిజంగా కనెక్ట్ అయ్యిందా లేదానేది సోమవారానికి క్లారిటీ వస్తుంది.

This post was last modified on March 20, 2026 11:41 pm

Share

Recent Posts

పెళ్లి గురించి హనుమాన్ హీరో క్లారిటీ

టాలీవుడ్లో యువ కథానాయకులు ఒక్కొక్కరుగా పెళ్లి వైపు అడుగులు వేస్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలో అల్లు శిరీష్ వివాహం చేసుకున్న…

2 hours ago

లెక్క తప్పిన చుక్క చిత్రాలు… ఇమేజ్ మీద మరకలు

భారీ ప్యాన్ ఇండియా మూవీ, ఇమేజ్ ఉన్న స్టార్ హీరో అని కథ పూర్తిగా వినకుండా, జల్లెడ పట్టకుండా తొందరపడితే…

2 hours ago

సెక్యూరిటీ లేకుండా వెళ్లి చంద్రబాబుతో పవన్ ఏం చెప్పారు?

సుప్రీం కోర్టు తీర్పుతో మున్సిపల్ ఎన్నికలు వాయిదా పడిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు.…

3 hours ago

అర్జునుడి కష్టాలు పేరుకి తగ్గట్టే ఉన్నాయి

తమ స్వంత ప్రమేయం లేకుండా ఎవరి వల్లనో ఇబ్బందులు, కష్టాలు పడాల్సి వస్తే ఆ బాధ మాములుగా ఉండదు. ఇట్లు…

3 hours ago

ప్రశాంత్ నీల్ బ్రాండ్ మహత్యం ఇది

కెజిఎఫ్, సలార్ రూపంలో తనకంటూ కల్ట్ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్. తను డైరెక్ట్ చేయకపోయినా కేవలం కథను…

4 hours ago

సంజూ మొదలెట్టాడు… నమన్ ధీర్ ముగించాడు!

225 పరుగులు చేసినా న్యూజిలాండ్‌కు విజయం దక్కలేదు. టీమ్ఇండియా మరో రెండు బంతులు మిగిలి ఉండగానే టార్గెట్‌ను ఛేదించింది. అయితే…

4 hours ago