బిగ్‌బాస్ విజేతగా అభిజీత్ నిలవడం కంటే, సోహైల్ పాతిక లక్షల ప్రైజ్ మనీ తీసుకుని బయటకు వచ్చేయడం సర్వత్రా హాట్ టాపిక్ అయింది. సోహైల్ పాతిక లక్షలు తీసుకోవడం కంటే అతను చేసిన పనికి వచ్చిన రియాక్షన్స్ మరింత ఆసక్తి రేకెత్తించాయి. సోహైల్ పాతిక లక్షల సూట్‌కేస్ తీసుకుని బయటకు రాగానే నాగార్జున అతడిని ఎత్తి గిరగిరా తిప్పేసాడు. అలాగే అతను పాతిక లక్షలలోంచి పది లక్షలు చారిటీకి ఇస్తానంటే, అది తానే ఇస్తానని, నువ్వు పాతిక లక్షలు తీసుకెళ్లమని నాగ్ చెప్పాడు. అంతే కాదు సోహైల్ తను గెలుచుకున్న దాంట్లో కొంత మెహబూబ్‌కి ఇద్దామనుకుంటే, ఆ అవసరం లేకుండా చిరంజీవితో మెహబూబ్‌కి పది లక్షలు ఇప్పించాడు. టైటిల్ విన్నర్ కంటే సోహైల్కే ఎక్కువ ఎలివేషన్ ఇచ్చారు.
పైగా అభిజీత్ గేమ్ ఆడలేదని, ఎప్పుడూ సోఫాలో కూర్చుని వుండేవాడని అటు నాగార్జునతో, ఇటు చిరంజీవితో కూడా అనిపించారు. అసలు బిగ్‌బాస్ టీమ్ ఎందుకని అభిజీత్‌కి అంత వ్యతిరేకంగా వ్యవహరించిందనే దానిపై సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. అభిజీత్ తన కోసం ఓట్లు వేయడానికి పీ.ఆర్. టీమ్ సిద్ధం చేసుకుని వచ్చాడనేది ఆదిలోనే స్పష్టమయింది. అది కాస్తా ఆ తర్వాత తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టయింది.
అభిజీత్ ఆట ఆడకపోయినా కానీ తెలివిగా మాట్లాడ్డం వల్ల అతనికి అడ్వాంటేజ్ అయింది. అయితే అతడిని స్ఫూర్తిగా తీసుకుని ఇకపై వచ్చేవాళ్లు అలా పీఆర్ సిద్ధం చేసుకుని వస్తే కష్టమని బిగ్‌బాస్ టీమ్ భావించినట్టుంది. అందుకే సోహైల్‌ని వీలయినంత ఎలివేట్ చేస్తూ వెళ్లింది.
అలాగే గేమ్‌ని విపరీతంగా ఆడిన మెహబూబ్‌కి కూడా నజరానా ఇచ్చింది. అభిజీత్ని డైరెక్ట్ గా కార్నర్ చేయకుండా మున్ముందు పీఆర్ ట్రిక్స్ చేసే వాళ్లకు గుణపాఠంగా అతని ప్రైజ్ మనీ సగానికి కుదించేసింది. ఈ టాక్‌లో ని•మెంత అనేది తెలియదు కానీ బిగ్‌బాస్ ఫినాలే జరిగిన తీరు చూస్తే అభిజీత్ గెలవడం బిగ్‌బాస్ క్రియేటివ్ టీమ్‌కి అసలు నచ్చలేదని మాత్రం స్పష్టమయింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates