అయ్యప్పనుమ్ కోషియుమ్ చిత్రానికి రెండో హీరో లోటు తీరిపోయింది. మొదట్నుంచీ అనుకున్నట్టే రానా దగ్గుబాటి ఆ పాత్ర చేస్తున్నాడు. దీనికి సంబంధించి ఒక వీడియో బైట్ కూడా విడుదల చేసారు. పవన్, రానా హీరోలని తేలిపోయింది కానీ ఈ చిత్రానికి రచన చేస్తోన్న త్రివిక్రమ్ పేరు మాత్రం ఇంకా టెక్నీషియన్ల లిస్టులో చేర్చలేదు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ మాటలు రాస్తున్నారనేది ఓపెన్ సీక్రెట్ అయినా కానీ త్రివిక్రమ్ పేరు అధికారికంగా ప్రకటించలేదు.
అయితే ఈ సినిమా ఓపెనింగ్‍లో దర్శకుడు సాగర్ చంద్ర కంటే త్రివిక్రమే ఫోకస్ అయ్యాడు. పవన్, రానా పేర్లు ఎలాగయితే స్పెషల్ వీడియో రూపంలో వెల్‍కమ్ చేస్తూ విడుదల చేసారో అలాగే త్రివిక్రమ్ కోసం కూడా వీడియోతో పాటు తమన్ బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్‍తో ప్రత్యేకమైన అనౌన్స్మెంట్ ఇస్తారట.
ఈ చిత్రానికి త్రివిక్రమ్ కేవలం మాటలు మాత్రమే కాదని, స్క్రీన్‍ప్లే రైటర్ కూడానని తెలిసింది. అందుకే అది ఘనంగా ప్రకటిస్తారట. అల వైకుంఠపురములో తర్వాత త్రివిక్రమ్ రచనలో వస్తోన్న సినిమా కనుక దీనికుండే క్రేజ్ దీనికుంటుంది. కాబట్టి త్రివిక్రమ్ పేరు ఏదో టెక్నీషియన్లు అందరితో చేర్చేయకుండా… ప్రత్యేకమైన ఎలివేషన్ ప్లాన్ చేసుకుంటున్నారన్నమాట.
This post was last modified on December 22, 2020 4:04 pm
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…