Movie News

తమిళ హీరోలు మొదలెట్టారు ప్రసాదు

టాలీవుడ్ లెజెండరీ నటుడు రాజేంద్ర ప్రసాద్.. ఈ మధ్య స్టేజ్ ఎక్కాడంటే చాలు ఏం మాట్లాడతాడో, ఏం బాంబులు పేలుస్తాడో అని అందరూ తలలు పట్టుకునే పరిస్థితి తలెత్తుతోంది. ‘రాబిన్ హుడ్’ వేడుకలో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ను దొంగనాకొడుకు వీడు అనడం.. మరో సినీ ఫంక్షన్లో కమెడియన్ ఆలీని ఉద్దేశించి పచ్చి బూతు మాట వాడడం.. ఒకప్పటి హీరోయిన్ రవళిని బాడీ షేమింగ్ చేయడం.. ఇలా పలు సందర్భాల్లో అదుపు తప్పి మాట్లాడిన ఆయన తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు.

ఎన్ని విమర్శలు వచ్చినా ఆయన తీరు మారట్లేదు. తాజాగా తమిళ లెజెండరీ నటుడు ఎంజీఆర్ గురించి ఆయన అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి సోషల్ మీడియాకు టార్గెట్ అయ్యారు. తెలుగు దిగ్గజ నటుడు కాంతారావు చేసిన జానపద చిత్రాలు చూసి ఎంజీఆర్ భయపడ్డారంటూ అసభ్య పదజాలం ఉపయోగిస్తూ ఒక వేడుకలో రాజేంద్రప్రసాద్ మాట్లాడడం వివాదాస్పదమైంది. ఆయన మాట్లాడింది తెలుగులోనే అయినా.. సోషల్ మీడియా కాలం కావడంతో తమిళ జనాలకు విషయం చేరింది.

తమిళులు ఎంజీఆర్‌ను దేవుడిలా చూస్తారు. అలాంటి వ్యక్తి గురించి రాజేంద్ర ప్రసాద్ ఇలా అనడంతో దుమారం రేగింది. దీనిపై తెలుగువాడే అయిన తమిళ హీరో విశాల్ తాజాగా స్పందించాడు. రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యల మీద అతను అభ్యంతరం వ్యక్తం చేశాడు.

‘‘మీపై గౌరవం, మీరు చేసిన వ్యాఖ్యలపై బాధతో ఈ పోస్టు పెడుతున్నా. ఎంజీఆర్‌పై మీరు చేసిన వ్యాఖ్యలు విని బాధ పడ్డాను. దిగ్గజ నటుడు కాంతారావును పొగడ్డం మంచి విషయమే. కానీ ఈ క్రమంలో తమిళ ప్రజలు దైవంలా భావించే ఎంజీఆర్‌ను తక్కువ చేసి మాట్లాడ్డంతో నాతో పాటు ఎంతోమంది బాధ పడ్డారు. మిమ్మల్ని క్షమాపణలు చెప్పమని అడుగుతున్నందుకు నన్ను మన్నించండి. కానీ భవిష్యత్తులో ఎవరు ఇలా మాట్లాడినా నేను ఇలాగే స్పందిస్తాను. ఈ వివాదానికి ముగింపు పలకండి’’ అని విశాల్ పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో రాజేంద్ర ప్రసాద్ మరోసారి తన వ్యాఖ్యలపై సారీ చెప్పక తప్పేలా లేదు.

This post was last modified on March 12, 2026 3:18 pm

Share

Recent Posts

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

4 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

6 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

7 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

7 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

7 hours ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

7 hours ago