పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సినిమా చేయడం కోసం మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు చాలా ఏళ్ల కిందట అడ్వాన్స్ ఇచ్చారు. ముందు ఈ బేనర్లో ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమాను అనౌన్స్ చేశారు. కానీ అది ముందుకు కదల్లేదు. తర్వాత వేరే కథ తీసుకుని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పేరుతో సినిమా మొదలుపెట్టారు. దీనికీ అడ్డంకులు తప్పలేదు.
పవన్ పొలిటికల్ జర్నీ, వేరే సినిమా కమిట్మెంట్ల వల్ల ఈ సినిమా ఆలస్యం అవుతూనే వచ్చింది. దీని వల్ల మైత్రీ మూవీ మేకర్స్ సంస్థకు ఇబ్బందులు తప్పలేదు. ఒక సినిమాను అనౌన్స్ చేశాక వీలైనంత త్వరగా పూర్తి చేస్తేనే ప్రయోజనం ఉంటుంది. ఇలా ఏళ్ల తరబడి ఒక ప్రాజెక్టు ఆలస్యం అయితే.. వడ్డీల భారం పెరిగి బడ్జెట్ అదుపు తప్పుతుంది.
‘ఉస్తాద్ భగత్ సింగ్’ మామూలు కమర్షియల్ సినిమానే అయినా.. ఒక ఈవెంట్ ఫిలింకి అయ్యేంత ఖర్చు అయిందంటే.. అది మేకింగ్ ఆలస్యం కావడం, వడ్డీల భారం పెరగడం వల్లే. ఈ మూవీ బడ్జెట్ రూ.150 కోట్లకు పైమాటే అని సమాచారం.
ఐతే ఇంత ఖర్చయినా సరే.. మైత్రీ అధినేతలు టేబుల్ ప్రాఫిట్‌తో సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం. తన వల్లే సినిమా బాగా ఆలస్యం కావడం.. పైగా ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ కోసం కూడా మైత్రీ అధినేతలు సాయపడడం వల్ల పవన్ తన పారితోషకాన్ని బాగా తగ్గించుకున్నట్లు తెలుస్తోంది.
ఇప్పుడు పవన్ ఒక సినిమాకు రూ.50-60 కోట్ల మధ్య అందుకుంటున్నాడు. కానీ గతంలో తీసుకున్న రూ.5 కోట్ల అడ్వాన్స్ కాకుండా రూ.25 కోట్లు మాత్రమే తీసుకున్నాడట పవన్. అంటే ఆయన ఈ చిత్రానికి పుచ్చుకున్నది రూ.30 కోట్లే.
‘ఉస్తాద్ భగత్ సింగ్’ డిజిటల్ రైట్స్‌ను చాలా ముందుగానే నెట్‌ఫ్లిక్స్ సంస్థకు రూ.80 కోట్లకు అమ్మేసినట్లు తెలుస్తోంది. థియేట్రికల్ హక్కుల ద్వారా ఈజీగా రూ.100 కోట్లకు పైగానే వచ్చే అవకాశముంది. మిగతా రైట్స్ అన్నీ కూడా కలిపితే రూ.200 కోట్లకు తక్కువ కాకుండా బిజినెస్ చేసేలా కనిపిస్తోంది ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఇలా నిర్మాతలు బాగానే లాభపడుతున్నారు. రిలీజ్ తర్వాత పరిస్థితిని బట్టి పవన్‌కు ఇంకొంత అదనపు పారితోషకం ఇచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
This post was last modified on March 7, 2026 3:12 pm
కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…
ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…