Movie News

త్రిషతో విజయ్… వ్యూహమా లేక వివాదమా?

తమిళంలో నంబర్ వన్ హీరోగా ఉన్న సమయంలో రాజకీయ పార్టీ పెట్టడమే కాక.. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు లేకుండా ఒంటరిగా బరిలోకి దిగుతున్నాడు విజయ్. ఐతే కరూర్ విషాద ఘటన సహా అతడికి వరుసగా ఎదురు దెబ్బలు తప్పట్లేదు. ఇటీవల తన వ్యక్తిగత జీవితం తమిళనాట పెద్ద చర్చకు దారి తీసింది.

విజయ్ భార్య సంగీత విడాకుల కోసం దరఖాస్తు చేస్తూ విజయ్ మీద అనేక ఆరోపణలు చేశారు. దీనికి విజయ్ అండ్ కో నుంచి ఖండనలాంటివేమీ లేకపోయాయి. కేవలం అభిమానులు మాత్రం విజయ్‌ని వెనకేసుకుంటూ వచ్చారు. ఐతే వారం రోజుల గొడవ తర్వాత విజయ్.. భార్య ఆరోపణలను, రూమర్లను నిజం చేస్తూ నటి త్రిషతో కలిసి ఒక పెళ్లి వేడుకకు హాజరై అందరికీ పెద్ద షాకిచ్చారు.

సంగీత.. విజయ్ నటితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్నట్లు పరోక్షంగా మాట్లాడారే తప్ప, పేరు చెప్పలేదు. కానీ విజయ్ మాత్రం ఆ నటి త్రిషనే అని కన్ఫమ్ చేసినట్టు తెలుస్తుంది. ఐతే ఎన్నికలు సమీపిస్తుండగా త్రిషతో కలిసి విజయ్ ఇలా పబ్లిక్ అప్పియరెన్స్ ఇవ్వడం అతడికి మంచిదేనా అనే చర్చ మొదలైంది.

కొందరేమో ఇది ఆత్మహత్యాసదృశ్యం అంటున్నారు. ఎన్నికలు అయ్యే వరకు విజయ్ మౌనం వహిస్తే బాగుండేదని.. రాజకీయాల్లో ఉన్న వాళ్లు వివాహేతర సంబంధంలో ఉన్నట్లు బయటపడితే అంత మంచిది కాదని, అందునా ఇది రైట్ టైమింగ్ కాదని అభిప్రాయపడుతున్నారు. భార్యతో సెటిల్మెంట్ జరిగి విడాకులు తీసుకున్నాక త్రిషతో కలిసి కనిపిస్తే బాగుండేదని.. ఇప్పుడు విజయ్ తొందరపడ్డాడని అంటున్నారు. కానీ అదే సమయంలో విజయ్ చేసింది కరెక్టే అంటున్న వాళ్లూ లేకపోలేదు.

విజయ్‌ని వ్యక్తిగతంగా టార్గెట్ చేయబోతున్నారన్నది స్పష్టం అయిపోయిందని… ఈ క్రమంలో త్రిషను కూడా ఇబ్బంది పెట్టడం ఖాయమని.. అందుకే తర్వాత జరగబోయే డ్యామేజ్‌ను తగ్గించి.. జనాలకు ముందే ఒక స్పష్టత ఇచ్చేస్తే వాళ్లు అర్థం చేసుకుంటారని.. రాజకీయ ప్రత్యర్థులకు ఇక ఈ టాపిక్ మీద మాట్లాడే అవకాశం లేకుండా చూడొచ్చనే ఉద్దేశంతో విజయ్ ఇలా చేసి ఉండొచ్చనే వాదన వినిపిస్తోంది.

కానీ మెజారిటీ అయితే.. విజయ్ చేసింది కరెక్ట్ కాదనే అభిప్రాయమే వ్యక్తం చేస్తున్నారు. వివాహేతర సంబంధం వల్ల ఒక మహిళకు అన్యాయం జరిగింది అనే అభిప్రాయంతో మహిళా ఓటర్లలో వ్యతిరేకత పెరుగుతుందనే మాట బలంగా వినిపిస్తోంది.

This post was last modified on March 6, 2026 10:49 am

Share

Recent Posts

పరీక్షలు బాగా రాపించి సినిమాకి తీసుకురండి

చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…

2 hours ago

హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు ఏపీ సర్కార్?

ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…

2 hours ago

ఏపీలో బీసీ రిజర్వేషన్లపై సంచలన తీర్పు

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…

3 hours ago

అక్టోబర్ మార్కెట్… ఎవరెవరికి జాక్‌‌పాట్

కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…

4 hours ago

రాజమౌళి టచ్ చేసిన స్క్రిప్ట్… హిట్ కొడతారా?

గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…

4 hours ago

దృశ్యం బ్రాండ్ విలువ మహత్యం

బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…

5 hours ago