హఠాత్తుగా ఉస్తాద్ భగత్ సింగ్ మార్చి 19కి ప్రీ పోన్ అయ్యిందన్న వార్త ఒక్కసారిగా నిన్న సాయంత్రం సోషల్ మీడియాని కుదిపేసింది. ఉదయం టాక్సిక్ వాయిదా న్యూస్ హల్చల్ తగ్గకముందే పవన్ కళ్యాణ్ టీమ్ షాక్ ఇవ్వడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. సరే ఇంత హడావిడిగా వారం ముందుకు జరిగి, రీ రికార్డింగ్ బాధ్యతలు దేవిశ్రీ ప్రసాద్ కు బదులు తమన్ కు ఎందుకు ఇచ్చారనే అనుమానాలు ప్రేక్షకుల్లో లేకపోలేదు. దానికి స్పష్టమైన కారణాలున్నాయి.
మార్చి మూడో వారం ఉగాది, రంజాన్ పండగలు రెండు ఒకేసారి వచ్చాయి. నాలుగు రోజుల సుదీర్ఘమైన వీకెండ్ పిల్లా పెద్దా అందరూ సెలవుల్లో ఉంటారు. వాళ్ళలో అధిక శాతం జనం థియేటర్ ఎంటర్ టైన్మెంట్ కోరుకుంటారు. అప్పుడు కనిపించే ఏకైక ఆప్షన్ పవర్ స్టార్ మూవీ. ఒకవేళ దురంధర్ 2 రివెంజ్ పోటీలో ఉన్నా పర్వాలేదు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో దానికున్న ఆడియన్స్ వేరు. ఫ్యామిలీస్ దాని వైపు వెళ్లవు. దానికి తోడు మార్చి చివరి వారం ఖాళీగా ఉంది.
ఆ వారంలో శ్రీరామనవమి, గుడ్ ఫ్రైడే, శని ఆదివారాలు ప్లస్ అవుతాయి. ఒకవేళ టికెట్ రేట్ల పెంపు కనక ఉస్తాద్ భగత్ సింగ్ తీసుకుంటే పది రోజుల పాటు పెంచిన ధరలతో ఊహించని స్థాయిలో రికార్డు నెంబర్లు నమోదు చేయొచ్చు. ఒకవేళ జిఓ తీసుకోకపోయినా రికార్డుల మోత అయితే ఖాయం. బాగుంది అనే టాక్ వస్తే కలెక్షన్లు ఎక్కడికో వెళ్లిపోతాయి. యావరేజ్ అన్నా చాలు పవన్ కళ్యాణ్ ర్యాంపేజ్ ఖచ్చితంగా ఇంకో లెవెల్ లో ఉంటుంది. ఏతావాతా చూసుకుంటే ఏప్రిల్ 10 దాకా సిచువేషన్ ఇలాగే ఉంటుంది.
ఇంత మంచి అవకాశం ఉస్తాద్ భగత్ సింగ్ కి మళ్ళీ రాదు. సో దాన్ని వాడుకోవాలనే ఉద్దేశంతో మైత్రి మూవీ మేకర్స్ బృందం మిషన్ ఇంపాజిబుల్ టాస్క్ తీసుకుంది. ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం వెళ్ళిపోయింది. ఇవాళ అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావొచ్చు. దురంధర్ 2 వచ్చినా రాకపోయినా ఈ విధంగా ప్రొసీడ్ అవ్వాలని డిసైడ్ అయ్యారట. కాకపోతే బాలన్స్ డబ్బింగ్, రీ రికార్డింగ్ ఆఘమేఘాల మీద పరుగులు పెట్టించాల్సి ఉంటుంది. ఇంకా సెన్సార్ కార్యక్రమం ఉంది కాబట్టి ఇంకో పది రోజుల్లో ఫస్ట్ కాపీ రెడీ అయిపోవాలి. అందుకే ఈ ఉరుకులు పరుగులు.
This post was last modified on March 5, 2026 10:47 am
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు ఇంకా మూలుగుతూనే…
ఎల్లుండి విడుదల కాబోతున్న చిత్రాల్లో అందరి దృష్టి కొరియన్ కనకరాజు మీదే ఉంది. కొద్దో గొప్పో తమిళ దర్శకుడు లోకేష్…
దీపావళికి విడుదల కాబోతున్న రామాయణ మీద ఎడతెగని చర్చ జరుగుతూనే ఉంది. టీజర్ కన్నా బాగుందనే కామెంట్స్ ట్రైలర్ మీద…
తమిళనాడులో కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీవీకే అధినేత, నటుడు విజయ్.. నేతృత్వంలోని సర్కారు.. తొలి బడ్జెట్‌ను(2026-27)ను బుధవారం అసెంబ్లీలో…
అదేదో సామెత చెప్పినట్టు జన నాయగన్ బాక్సాఫీస్ గ్రాస్ 300 కోట్లు దాటినా కూడా నిర్మాత, బయ్యర్లు పెద్దగా సంతోష…
రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ పార్టీ రాబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి…