తెలంగాణ కాంగ్రెస్ పార్టీపై మరోసారి తన పట్టును గట్టిగా నిలబెట్టుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. గతంలోనూ ఆయన అనేక సందర్భాల్లో పార్టీలో తన మాటనే నెగ్గించుకున్నారు. తాజాగా రాజ్యసభ ఎన్నికల వేళ అనేక మంది పోటీలో ఉన్నా, ఏకంగా రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ సైతం ఓ అభ్యర్థిని సిఫారసు చేసినా, ఇక సీనియర్లు వీ. హనుమంతరావు వంటివారు నేను సైతం అంటూ ఢిల్లీలోనే పంచాయతీ పెట్టినా సీఎం రేవంత్ రెడ్డి తనదైన శైలిలో మరోసారి చక్రం తిప్పి తన విధేయుడికి టికెట్ దక్కేలా చేసుకున్నారు.
తాజాగా జరుగుతున్న రాజ్యసభ ఎన్నికల్లో తెలంగాణలో రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. వీటిలో ఒకటి బీఆర్ ఎస్ నేత సురేష్ రెడ్డిది కాగా మరొకటి కాంగ్రెస్ పార్టీకే చెందిన జాతీయ స్థాయి నాయకుడు అభిషేక్ మను సింఘ్వీ సీటు. ఈ రెండు స్థానాలు కూడా ఈ ఏడాది ఏప్రిల్‌లో ఖాళీ అవుతున్నాయి. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది. నామినేషన్లకు గడువు గురువారం మార్చి 5వ తేదీతో ముగియనుంది.
ఈ రెండు స్థానాలు కూడా అసెంబ్లీ సభ్యుల ఓట్లతోనే జరుగుతాయి కాబట్టి ప్రస్తుతం మెజారిటీ కాంగ్రెస్‌కే ఉన్న నేపథ్యంలో ఈ రెండు సీట్లూ కాంగ్రెస్‌కే దక్కనున్నాయి. ఒక సీటును మరోసారి అభిషేక్ మను సింఘ్వీకే ఇస్తారని ఆది నుంచి ప్రచారంలో ఉంది. చివరకు దానినే ఏఐసీసీ ఖరారు చేసింది.
ఇక మిగిలిన మరో సీటు వ్యవహారంపైనే నాయకులు నువ్వా నేనా అన్నట్టుగా కుస్తీ పట్టారు. కొందరు సీనియర్ నేతలను కలుసుకుని సిఫారసులు చేయించుకున్నారు. వీ. హనుమంతరావు నేరుగా ఢిల్లీ వెళ్లి ఈసారికి ఇవ్వారాదే అంటూ ప్రాధేయ పడ్డారు. అయినా చివరకు సీఎం రేవంత్ రెడ్డి ముందు నుంచి సిఫారసు చేసిన వేం నరేంద్రరెడ్డికే కాంగ్రెస్ అధిష్టానం తాజాగా సీటును ఖరారు చేసింది. దీంతో గురువారం ఆయన నామినేషన్ వేయనున్నారు. మొత్తంగా ఇంత మంది బరిలో ఉన్నా చివరకు రేవంత్ తన పట్టును నిలబెట్టుకోవడం గమనార్హం.
రేవంత్‌తో పాటే వేం!
కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ రెడ్డితో పాటే వేం నరేంద్రరెడ్డి కూడా వచ్చారు. గతంలో ఇరువురు నేతలు టీడీపీలో కలిసి పనిచేశారు. అప్పటి నుంచే రేవంత్‌కు విధేయుడిగా వేం వ్యవహరించారు. అత్యంత సన్నిహితుడిగా కూడా మారారు. ఫ్యామిలీ ఫ్రెండ్‌గా కూడా పేరు తెచ్చుకున్నారు.
టీడీపీ తరఫున 2004 ఎన్నికలలో మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వేం పోటీ చేసి గెలిచారు. అనంతరం 2012లో జరిగిన ఉప ఎన్నికలో హనుమకొండ నుంచి పోటీ చేసినా పరాజయం పాలయ్యారు. ఇక 2015లో ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసి మరోసారి ఓడిపోయారు. ప్రస్తుతం ముఖ్యమంత్రికి సలహాదారుగా వేం వ్యవహరిస్తున్నారు.
This post was last modified on March 5, 2026 11:16 am
ఒకప్పుడు ఆస్కార్ అవార్డుల గురించి ఇండియన్ ఫిలిం మేకర్స్ ఆలోచించడం కూడా కష్టంగా ఉండేది. కానీ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత…
మొన్న గాంధీ జయంతికి విడుదలైన సినిమాల్లో బడ్జెట్ తక్కువే అయినా తెల్లకాగితం అంతో ఇంతో సౌండ్ చేయడంలో సక్సెసయ్యింది. వీడియోలు…
కొత్తగా ఓటు నమోదు చేసుకోవాలని అనుకునేవారు.. కేంద్ర ఎన్నికల సంఘం వెబ్ సైట్ లేదా..అధికారుల నుంచి ఫాం-6ను తీసుకుని దానిని…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. బాలయ్య చాలా ఏళ్ల…
విమానాలు భయపెడుతున్నాయి. గత వారం ఫ్లై దుబాయ్ విమానాన్ని కూల్చివేసేందుకు కో పైలట్ ప్రయత్నం చేయడం ప్రపంచ వ్యాప్తంగా వార్తయ్యింది.…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 2024 ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆవేశపూరిత ప్రసంగాలు చేసిన సంగతి…