Movie News

ఎన్నాళ్ళకెన్నాళ్ళకు…….50 రోజుల తెలుగు పోస్టర్

ఒకప్పుడు వంద రోజులు, సిల్వర్ జూబ్లీలు చాలా మాములు విషయం. అడవి రాముడు, ప్రేమాభిషేకం ఏడాది ఆడాయి. ఘరానా మొగుడు, సమరసింహారెడ్డిలు రిపీట్ రన్ లోనూ కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఆఖరికి ఫ్లాపులు అనిపించుకున్నవి కూడా అర్ధశతదినోత్సవం చేసుకున్న దాఖలాలు చాలా ఉన్నాయి. ఇదంతా గత చరిత్ర. పైరసీ పెరిగిపోయింది. ఓటిటిలు డామినేట్ చేస్తున్నాయి. టెక్నాలజీ వల్ల ప్రేక్షకులు వినోద పరంగా బోలెడు ఆప్షన్లు దొరుకుతున్నాయి.

14 ఇంచుల టీవీలు పోయి ఇప్పుడు 100 ఇంచుల ఖరీదయిన ఓలెడ్ స్మార్ట్ తెరలు వచ్చేశాయి. ఇవన్నీ బిగ్ స్క్రీన్ బిజినెస్ మీద ప్రభావం చూపించి థియేటర్లలో లాంగ్ రన్ అనే మాట మర్చిపోయేలా చేశాయి. తాజాగా మన శంకరవరప్రసాద్ గారు చాలా గ్యాప్ తర్వాత టాలీవుడ్ కు 50 రోజుల పోస్టర్ ని చూపించింది. 109 కేంద్రాల్లో ఫిఫ్టీ డేస్ ఆడినట్టుగా నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. నిజానికి ఓటిటిలో త్వరగా వచ్చేసినా కూడా పలు చోట్ల ఇంకా చెప్పుకోదగ్గ రెవిన్యూ రావడం విశేషం.

చిరంజీవిని ఆయన వింటేజ్ టైమింగ్ తో దర్శకుడు అనిల్ రావిపూడి ఆవిష్కరించిన విధానం ప్రేక్షకులతో మూడు వందల కోట్లకు పైగా వసూళ్లు వచ్చేలా చేసింది. వెంకటేష్ క్యామియో, నయనతార పాత్ర, భీమ్స్ సంగీతం, చైల్డ్ సెంటిమెంట్, సరిపడా కామెడీ లాంటి అంశాలన్నీ మన శంకరవరప్రసాద్ గారుకి ఘనవిజయం దక్కేందుకు దోహదం చేశాయి. ఇలా యాభై రోజుల మైలురాయిని అందుకున్న గత సినిమా సంక్రాంతికి వస్తున్నాం 92 సెంటర్లతో ఉండగా దాన్ని తిరిగి అనిల్ రావిపూడి సినిమానే క్రాస్ చేయడం గమనార్హం.

కంటెంట్ ప్రాపర్ గా ఉండి, స్టార్ హీరోల మద్దతు కనక దక్కితే ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేయొచ్చని మన శంకరవరప్రసాద్ గారు నిరూపించింది. ఇటీవలే శాటిలైట్ ప్రీమియర్ కూడా జరుపుకున్న నేపథ్యంలో ఫైనల్ రన్ కు దగ్గరగా వచ్చేసిందని చెప్పాలి. మొత్తానికి భోళా శంకర్ తర్వాత రెండేళ్లకు పైగా సాగిన మెగాభిమానుల నిరీక్షణకు న్యాయం చేకూరుస్తూ సూపర్ సక్సెస్ అందుకున్న చిరంజీవి వేసవిలో మెగా ఫాంటసీ మూవీ విశ్వంభరతో రాబోతున్నారు.

This post was last modified on March 2, 2026 12:18 pm

Share

Recent Posts

ట్రైలర్ లేకపోవడం ఎంత వరకు సేఫ్

అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…

2 hours ago

ఇంద్ర చూపిన దారిలో మిగిలినవీ రావాలి

తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…

3 hours ago

అసలు భయాన్ని థియేటర్‌లో చూపిస్తారేమో

ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…

4 hours ago

తెలుగులో లేట్ రిలీజ్ పర్లేదంటారా

బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…

6 hours ago

రవితేజ జాక్‌పాట్… ఇడియట్ డైలాగ్ పేలింది

వరుస ఫ్లాపుల కారణంగా గత కొన్నేళ్లలో మాస్ రాజా రవితేజ ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ బాగా దెబ్బ తిన్న మాట…

7 hours ago

గాంధీ జయంతి ఇంత రష్ ఉందేంటి

అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. నేషనల్ హాలిడే. ఆ మహానుభావుడిని ఎందరు గుర్తు చేసుకుంటారో కానీ సెలవు…

8 hours ago