మిక్స్డ్ టాక్ వచ్చినా తర్వాత పుంజుకున్నట్టు కనిపించిన విష్ణు విన్యాసం వీకెండ్ పూర్తి చేసుకుంది. టీమ్ చెప్పిన స్థాయిలో మేజిక్ చేయడం అనుమానంగానే ఉంది. గత ఇరవై నాలుగు గంటల్లో బుక్ మై షోలో అమ్ముడుపోయిన టికెట్లు 28 వేల లోపే ఉండటం ఫలితం ఏంటో తేటతెల్లం చేస్తోంది.
నిన్న సాయంత్రం కీలకమైన ఇండియా వెస్ట్ ఇండీస్ క్రికెట్ మ్యాచ్ ఈవెనింగ్ షోలను దెబ్బ తీసింది. సాయంత్రం, రాత్రి రెండు షోలకు సరిపడా టైం అదే తినేయడంతో ప్రేక్షకులకు థియేటర్ వెళ్లే ఛాన్స్ లేకపోయింది. విష్ణు విన్యాసమే కాదు కేరళ స్టోరీ 2 లాంటి ఇతర కొత్త రిలీజులకు దీని ప్రభావం తీవ్రంగా ఉంది.
నిర్మాణ సంస్థ అధికారికంగా చెప్పిన ప్రకారం తొలి రెండు రోజులకు తొమ్మిది కోట్లకు పైగానే వసూలు చేసినప్పుడు అందులో సగం ఆదివారం కూడా వచ్చి ఉండాలి. నెంబర్లు వెల్లడి అయ్యాక క్లారిటీ వస్తుంది. అయితే అసలు విన్యాసం ఈ రోజు నుంచి మొదలవుతుందని చెప్పాలి.
ఎందుకంటే వీకెండ్ డ్రాప్స్ ఎంత ఉంటాయనే దాన్ని బట్టి ఫైనల్ స్టేటస్ ఆధారపడి ఉంటుంది. అసలే శుక్రవారం శ్రీవిష్ణు మరో సినిమా మృత్యుంజయ్ వస్తోంది. క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ తో దీని మీద చెప్పుకోదగ్గ అంచనాలున్నాయి. ఇంకోవైపు వరలక్ష్మి శరత్ కుమార్ డైరెక్ట్ చేసి నటించిన సరస్వతికి ప్రమోషన్లు బాగానే జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో విష్ణు విన్యాసం వీలైనంత మొదటి వారంలోనే లాగేయాలి. మార్చి 19 టాక్సిక్, దురంధర్ 2 రివెంజ్ వస్తున్నందున మూవీ లవర్స్ చూపు అటువైపే ఉంది. దానికి తోడు సంక్రాంతి పండగకు మెప్పించిన సినిమాల తర్వాత ఆ స్థాయిలో వేరే ఎంటర్ టైనర్స్ రాకపోయిన అవకాశాన్ని విష్ణు విన్యాసం పూర్తిగా వాడుకోలేదు.
ఒకవేళ పాజిటివ్ టాక్ పూర్తిగా వచ్చి ఉంటే ఇవాళ లెక్క వేరుగా ఉండేది. అయినా సరే శ్రీవిష్ణు ఇమేజ్ పుణ్యమాని కాస్త చెప్పుకోదగ్గ నెంబర్లు కనిపించాయి. ఫిబ్రవరి నుంచి డ్రైగా ఉన్న బాక్సాఫీస్ కు జోష్ తెచ్చే తొలి బాధ్యత తన మీదే ఉంది. మృత్యుంజయ్ తో అది పూర్తవుతుందేమో చూడాలి.
This post was last modified on March 2, 2026 12:13 pm
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ప్రకటించే నంది అవార్డులకు ఎంత విలువ ఉండేదో తెలిసిందే. వాటిని జాతీయ అవార్డులతో సమానంగా చూసేవారు.…
జాతీయ గేయం వందేమాతరం వ్యవహారంపై జరుగుతున్న వివాదాలు అన్నీ ఇన్నీ కావు. దేశానికి స్వాతంత్రం రాక మునుపు నుంచి ఈ…
ఒకప్పుడు కలెక్షన్ కింగ్ గా తొంభై దశకంలో స్టార్ హీరోలకు బలమైన పోటీ ఇచ్చిన మోహన్ బాబుకి ఇప్పటికీ ఫాలోయింగ్…
ప్యారడైజ్ సెన్సార్ అయిపోయింది. ఊహించినట్టే ఏ సర్టిఫికెట్ వచ్చింది. 2 గంటల 54 నిమిషాల సవారి జాతి ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు…
చాలా రోజుల తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కనిపించారు. ప్రకృతి వైద్యం కోసం కేరళం వెళ్లి 20 రోజుల…
జపాన్‌తో మ్యాచ్ అంటే టీమిండియా సులభంగా గెలుస్తుందని అనుకున్నారు క్రికెట్ ఫ్యాన్స్. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తడి…