Movie News

మూవీ లవర్స్… ఏడున్నర గంటలు మీవి కావు

బాక్సాఫీస్ వద్ద ఏ సినిమాలు ఆడుతున్నాయి, ఏవి పోతున్నాయనేది కాసేపు పక్కనపెడితే ఇప్పుడు అందరి దృష్టి మార్చి 19 మీద ఉంది. దురంధర్ 2 రివెంజ్, టాక్సిక్ నువ్వా నేనా అనే రీతిలో పోటీకి సిద్ధపడటంతో నెవర్ బిఫోర్ క్లాష్ చూడబోతున్నామని ట్రేడ్ ఎదురు చూస్తోంది. పేరుకు తెలుగు రాష్ట్రాల్లో ఇవి డబ్బింగ్ మూవీస్ అయినప్పటికీ క్రేజ్ పరంగా ఒరిజినల్ లాంగ్వేజ్ కి ఏ మాత్రం తీసిపోని రీతిలో హైప్ ఉంటుందని చెప్పడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఏపీలో టాక్సిక్ కు టికెట్ రేట్ల పెంపు కోసం అప్లికేషన్ పెట్టుకుంటారనే టాక్ ఆల్రెడీ ఉంది. ఇక అసలు విషయానికి వస్తే సినీ ప్రియులకు పెద్ద ఛాలెంజ్ ఉంది.

విశ్వసనీయ సమాచారం మేరకు దురంధర్ 2 రివెంజ్ నిడివి 3 గంటల 40 నిముషాలు ఉందట. అంటే మొదటి భాగం కన్నా ఎక్కువ. ఇంటర్వెల్ కు ఇంకో పావు గంట కలుపుకుంటే మొత్తం ఫోర్ అవర్స్ ఒకే థియేటర్లో ఉండాలి. టాక్సిక్ ఫైనల్ కట్ 3 గంటల 15 నిమిషాలు వచ్చిందని వినికిడి. ఇది కూడా విశ్రాంతితో కలిపి మూడున్నర గంటల టైం డిమాండ్ చేస్తుంది. అంటే ఇంటి నుంచి బయలుదేరి రాను పోను టైం కూడా లెక్కేసుకుంటే ఎంతవుతుందో చెప్పనక్కర్లేదు. ఈ రెండు క్రేజీ మూవీస్ ఫస్ట్ డే చూడాలని డిసైడ్ అయిన మూవీ లవర్స్ వేలల్లో కాదు లక్షల్లో ఉన్నారు. సో వాళ్లంతా లీవ్ తీసుకోవాల్సిందే.

లెన్త్ విషయంలో ఆయా దర్శకులు రాజీ పడకపోవడంతోనే ఇంత నిడివి లాకైనట్టుగా అర్థమవుతోంది. కంటెంట్ బలంగా ఉంటే దీన్ని ఆడియన్స్ అంగీకరిస్తారని దురంధర్ తో పాటు గతంలో పుష్ప 2, యానిమల్ లాంటివి ఋజువు చేశాయి. సో దురంధర్ 2, టాక్సిక్ మీద ఉన్న బజ్ ప్రకారం చూసుకుంటే ఇది పెద్దగా ఇబ్బంది పెట్టే విషయం కాకపోవచ్చు. రేపటి నుంచి మార్చి నెల ప్రారంభం కానుండటంతో ప్రమోషన్ల పరంగా టీమ్స్ యాక్టివ్ కాబోతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాదిని టాక్సిక్ టార్గెట్ చేస్తుండగా మన దక్షిణాది మీద దురంధర్ 2 స్పెషల్ ఫోకస్ పెట్టనుంది. రసవత్తరమైన యుద్దానికి కౌంట్ డౌన్ అయితే మొదలయ్యింది. 

This post was last modified on February 28, 2026 3:04 pm

Share

Recent Posts

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

46 minutes ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

1 hour ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

2 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

2 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

3 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

3 hours ago