Political News

బాబు మ‌న‌సు మెచ్చిన సాయి ప్ర‌సాద్‌.. ఎవ‌రీయ‌న‌!

ఏపీ సీఎం చంద్ర‌బాబ మ‌న‌సు చూర‌గొనాలంటే.. అంత ఈజీకాదు. ఈ విష‌యాన్ని టీడీపీ నాయ‌కుల నుంచి అధికారుల వ‌ర‌కు అంద‌రూ చెప్పేమాట‌. ఎంతో క‌ష్ట‌ప‌డాలి. ఆయ‌న అంచ‌నాల‌ను అందుకునేందుకు ఎప్ప‌టిక‌ప్పుడు మెద‌డుకు ప‌దును పెంచుకోవాలి. ఐటీలో మేలిమిగా ముందుకు సాగాలి. ఆయ‌న ఇలా అడిగితే అలా స‌మాధానం చెప్పే ప‌రిస్థితి ఉండాలి. ఇంత ఉన్నా.. బాబు మ‌న‌సులో చోటు ద‌క్కు తుందా? అంటే.. బిహేవియర్‌ను కూడా బాబు అంచ‌నా వేసుకుని అప్పుడు అవ‌కాశం క‌ల్పిస్తారు.

ఇలా.. బాబు మ‌నసు మెచ్చిన అధికారి సాయి ప్ర‌సాద్‌. ఈయ‌న ఏపీలో సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి. చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి అయిన తొలిసారే.. సాయిప్ర‌సాద్ ప్ర‌తిభ‌ను గ‌మ‌నించారు. అప్ప‌టి నుంచి ఆయ‌న‌ను ప్రోత్స‌హిస్తున్నారు. తాజాగా శ‌నివారం ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా సాయిప్ర‌సాద్ బాధ్య‌త‌ల  స్వీకారం చేశారు. ఈ నేప‌థ్యంలో ప‌లువురు సాయిప్ర‌సాద్ను అభినందిస్తూ.. బాబు మ‌న‌సు మెచ్చిన అధికారి అంటూ.. ఆయ‌న ను ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జి.సాయి ప్రసాద్ శనివారం అమ‌రావ‌తిలోని సచివాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు.ఇప్పటి వరకు సిఎస్ గా పని చేసిన కె.విజయానంద్ శనివారం పదవీ విరమణ చేస్తుండడంతో ఆయన నుండి సాయి ప్రసాద్ సిఎస్ గా బాధ్యతలు స్వీకరించారు.  1991 ఐఏఎస్ బ్యాచ్ ఎపి క్యాడర్ కు చెందిన సాయి ప్రసాద్ ఎంటెక్ చ‌దివారు. 1992 జూన్ నుండి 1993 మే వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వరంగల్ అసిస్టెంట్ కలక్టర్ గా పని చేశారు.

1997 మే నుంచి 1998 ఆగస్టు వరకు కడప జాయింట్ కలక్టర్ గా పనిచేశారు. 2003 అక్టోబరు నుండి 2004 ఆగస్టు వరకు ఎపి ట్రాన్సుకో జెఎండిగా, 2004 ఆగస్టు నుండి 2006 మే వరకు ఇపిడిపిసిఎల్ సిఎండిగా, 2006 మే నుండి 2010 ఫిబ్రవరి వరకు ఎపి సిపిడిసిఎల్ సిఎండిగా పని చేశారు. 2010 ఫిబ్రవరి నుండి 2011 అక్టోబరు వరకు ఎపి హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ గా పని చేశారు. 2022 ఫిబ్రవరి నుండి 2024 జూన్ వరకు కీల‌క‌మైన సీసీఎల్ఏగా పనిచేశారు. ప్ర‌స్తుతం జనవరి జలవరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వ్య‌వ‌హ‌రిస్తూనే ముఖ్య‌మంత్రి ఎక్స్ అఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.

This post was last modified on February 28, 2026 3:46 pm

Share

Recent Posts

కాంగ్రెస్ లో కొండా కార్చిచ్చు

సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…

33 minutes ago

పైరసీ రూపంలో కొత్త తలనెప్పి

ఇప్పటికే పైరసీని ఎలా అణచాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత అభివుద్ది చెందిన తర్వాత…

2 hours ago

పోలీస్ దుస్తుల్లో సూర్య షాకింగ్ ట్విస్టు

కరుప్పు / వీరభద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్ విజయాలతో సూర్య మంచి ఊపు మీద ఉన్నాడు. గత కొన్నేళ్లుగా సరైన…

3 hours ago

రవితేజ విజయాలకు ‘గట్టిముడి’ పడాలి

ఫ్యాన్ బేసులకు అతీతంగా అందరు హీరోల అభిమానులు అధిక శాతం ఇష్టపడే హీరో రవితేజ. ఆరు పదుల వయసుకు దగ్గరగా…

3 hours ago

పోటీకి సిద్ధంకండి… పొత్తు సంగతి నేను చూసుకుంటాను

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…

5 hours ago

తిరుమలలో ‘రోబోట్‌ డాగ్‌’… వాటి కదలికలపై నిఘా!

తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…

6 hours ago