Movie News

థియేటర్ VS ఓటిటి – గ్యాప్ నిజంగా తగ్గించగలరా

థియేటర్ ఆక్యుపెన్సీలు తగ్గిపోవడానికి కారణం ఓటిటికి తక్కువ గ్యాప్ ఉండటమే అన్నది ఎప్పటి నుంచో వినిపిస్తున్న వాదన. ఎలాగూ నాలుగు వారాల్లో ఇంటికే వస్తున్నప్పుడు వందలు వేలు ఖర్చు పెట్టుకుని టికెట్లు ఎందుకు కొనాలనే ధోరణి జనంలో బాగా పెరిగిపోయిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ప్రభాస్, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ల సినిమాలు సైతం నెల రోజులకే డిజిటల్ లో వస్తే ఆడియన్స్ మాత్రం చేయగలిగేది ఏముంది. అందుకే ఇకపై ఎనిమిది వారాల విండో తెచ్చేవిధంగా ఫిలిం ఛాంబర్ పెద్దలు ప్రొడ్యూసర్ కౌన్సిల్ ముందు ప్రతిపాదన పెట్టబోతున్నారనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపికయ్యింది.

ప్రాక్టికల్ గా ఇది ఎంత మేరకు సాధ్యమనేది వేచి చూడాలి. ఎందుకంటే థియేటర్లకు పబ్లిక్ రాక తగ్గిన మాటలో నిజముంది కానీ కేవలం దాన్నొక్కటే సాకుగా చూపలేం. బలమైన కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఇవన్నీ లెక్క చేయరని, బిగ్ స్క్రీన్ ఎక్స్ పీరియన్స్ కోసం వస్తారని చాలాసార్లు ఋజువయ్యింది.

ఎక్కడిదాకో ఎందుకు గత ఏడాది తేజ సజ్జ మిరాయ్ లాంటి ప్యాన్ ఇండియా మూవీ టికెట్ రేట్ల పెంపు లేకుండా, ఓటిటి స్పేస్ తక్కువగా ఉన్నా సరే వంద కోట్ల వసూళ్లు దాటి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. తక్కువ బడ్జెట్ లో తీసిన లిటిల్ హార్ట్స్ తర్వాత ఈటీవీ విన్ లో వస్తుందని తెలిసినా జనం ముప్పై కోట్ల వసూళ్లు చేతికిచ్చారు.

కాబట్టి ఓటిటి అనేది ఒక కారణమే కానీ మొత్తం దానిదే బాధ్యత కాదు. కంటెంట్ క్వాలిటీ మెరుగు పడాలి. ఆషామాషీ కథలకు, వెర్రిమొర్రి కాన్సెప్ట్ లతో సినిమాలు తీసి ప్రమోషన్లతో ఊదరగడతామనే నిర్మాతల చేతిలో ఆడియన్స్ అంత ఈజీగా మోసపోయేందుకు సిద్ధంగా లేరు.

అదిరిపోవాలి, వందల కోట్లతో తీయమని వాళ్ళు డిమాండ్ చేయడం లేదు. రెండున్నర గంటలు చిరాకు పుట్టించకుండా బాగుందనే ఫీలింగ్ కలిగిస్తే చాలని అంటున్నారు. పెద్ద హీరోల సినిమాలకు ప్రీమియర్ షోలు, పది రోజుల పాటు టికెట్ రేట్ల పెంపు ఎంత చేటు చేస్తున్నాయో ఇండస్ట్రీ అగ్రజులు వీలైనంత త్వరగా గుర్తించడం ఎంతో అవసరం.

ఛాన్స్ ఉంది కదాని టయర్ 2 హీరోలకు సైతం టికెట్ రేట్ల జిఓ తెచ్చుకుంటున్న వైనం మొన్న సంక్రాంతికి చూశాం. ప్రొడ్యూసర్లు దీని మీద దృష్టి సారించాలి. ఎయిట్ వీక్స్ విండో అంటే నిర్మాతకు వచ్చే ఓటిటి ఆదాయంలో పెద్ద కోత పడుతుంది. అదంతా థియేటర్లో రికవర్ అవుతుందన్న గ్యారెంటీ లేదు.

బ్లాక్ బస్టర్ అయ్యిందా ఓకే. యావరేజ్ లేదా ఫ్లాప్ అయినా అసలుకే మోసం వస్తుంది. గతంలో దీన్ని కఠినంగా అమలు చేయాలని కొందరు ప్రయత్నించారు కానీ వర్కౌట్ కాలేదు. మరి ఈసారైనా హిందీ, మలయాళం తరహాలో కఠిన ఆంక్షలు అమలులోకి తెచ్చి టాలీవుడ్ నిర్మాతలందరినీ ఒకే తాటిపైకి తెస్తారో లేదో చూడాలి.

This post was last modified on February 26, 2026 10:52 am

Share

Recent Posts

పహల్గామ్‌పై బ్రిక్స్ ఒక్క మాట.. చైనా కూడా ఒప్పుకుంది!

పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో భారత్‌కు అంతర్జాతీయ వేదికపై కీలక మద్దతు లభించింది. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ…

26 minutes ago

గుంటూరు మేయర్ సీటు ఎవరికి

రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మక స్థానాల్లో గుంటూరు మేయర్ స్థానం ఒకటి. విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లు అమరావతి రాజధాని పరిసరాల్లో ఉండటంతో…

27 minutes ago

వైసీపీ ఇలా చేస్తే.. విజ‌య‌వాడ మొత్తం టీడీపీదే..!

వ్యూహాల క‌లిమి.. నాయ‌కుల చెలిమి ఏ పార్టీకైనా అత్యంత అవ‌స‌రం. ఈ విష‌యంలో వైసీపీ చేస్తున్న వ్వ‌వ‌హారం.. పార్టీని దుంప‌నాశ‌నం…

1 hour ago

`వైనాట్ పులివెందుల` ఎందాకా వచ్చింది?

వైసీపీ అధినేత, మాజీ సీఎం జ‌గ‌న్‌.. సొంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందుల‌ను త‌మ హ‌స్త‌గ‌తం చేసుకోవాలన్నది.. టీడీపీ ఆకాంక్ష‌. ముఖ్యంగా స్థానిక…

3 hours ago

పదేళ్ల పాత రీమేక్ బెడిసి కొట్టిందా

ప్రేక్షకులు చాల అడ్వాన్స్ ఉన్నారు, తెలివి మీరిపోయారనే సత్యాన్ని చాలా మంది దర్శక నిర్మాతలు గుర్తించడం లేదు. ఆ ఏముందిలే…

8 hours ago

ఈ ద‌ర్శ‌కుడు ఛాన్సులు భ‌లే ప‌డ‌తాడే..

ఇండస్ట్రీలో వ‌రుస‌గా ఫెయిల్యూర్లు ఇచ్చాక అవ‌కాశాలు ద‌క్కించుకోవ‌డం అంత తేలికైన విష‌యం కాదు. కానీ కొంద‌రు డైరెక్ట‌ర్లు మాత్రం త‌మ…

9 hours ago