తమిళ టాప్ స్టార్లలో ఒకడైన అజిత్‌కు వీరం, వేదాళం, విశ్వాసం చిత్రాలతో మరపురాని విజయాలు అందించాడు దర్శకుడు శివ. తమిళంలో ఒకప్పుడు పేరున్న సినిమాటోగ్రాఫర్ అయిన శివ.. తెలుగులో దర్శకుడిగా పరిచయం కావడం విశేషం. గోపీచంద్ హీరోగా శౌర్యం, శంఖం సినిమాలు తీశాడతను. తర్వాత సొంత భాషలో ‘విక్రమార్కుడు’ సినిమాను ‘సిరుత్తై’ పేరుతో రీమేక్ చేస్తే అది పెద్ద హిట్టయింది.
ఆపై అతను సొంత కథలతో వీరం, వేదాళం, వివేగం, విశ్వాసం సినిమాలు తీశాడు. ఇందులో వివేగం మినహా సినిమాలు బ్లాక్ బస్టర్లు అయ్యాయి. ఐతే అజిత్‌కు మూడు హిట్లు ఇచ్చినా సరే.. తన విషయంలో అజిత్ ఫ్యాన్స్ నుంచి మిశ్రమ స్పందన వస్తుంటుంది. అజిత్‌ను ఒక మూసలోకి తీసుకెళ్లిపోయాడని.. రొటీన్ సినిమాలు తీసి విసిగించాడని అంటుంటారు. ఐతే అజిత్ కాకుండా శివ వేరే హీరోలతో సినిమాలు తీస్తే అస్సలు వర్కవుట్ కాలేదు.
సూపర్ స్టార్ రజినీకాంత్‌తో తీసిన ‘అన్నాత్తే’, సూర్యతో చేసిన ‘కంగువ’ ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్లు అయ్యాయి. దీంతో శివ పట్ల కోలీవుడ్లో బాగా వ్యతిరేకత వచ్చేసింది. తనతో సినిమా చేయడానికి స్టార్లు ఇప్పుడు భయపడుతున్నారు. ఇలాంటి టైంలో అజిత్ మళ్లీ అతడికి అవకాశమిచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి.
వరుస ఫ్లాపుల తర్వాత గత ఏడాది ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’తో హిట్ ట్రాక్ ఎక్కాడు అజిత్. ఆ సినిమా అభిమానులకు గొప్ప ఊరటనిచ్చింది. ఐతే ఆ సినిమా తీసిన ఆధిక్ రవిచంద్రన్‌తోనే ఇంకో సినిమాను అజిత్ లైన్లో పెట్టాడు. కానీ ఇప్పుడేమో లైనప్ మారిందంటున్నారు. మధ్యలోకి శివ సినిమా వచ్చిందని.. దాన్నే ముందుకు తీసుకెళ్తున్నాడని.. ఆ తర్వాతే ఆధిక్ సినిమా ఉంటుందని అంటున్నారు.
కానీ అజిత్ ఫ్యాన్స్ దీని పట్ల నెగెటివ్‌గా స్పందిస్తున్నారు. శివ మళ్లీ రొటీన్ సినిమా తీస్తాడని.. ఫామ్‌లో లేని అతడితో మళ్లీ జట్టు కట్టడం అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. లేక లేక ఒక పెద్ద హిట్ ఇచ్చిన ఆధిక్‌ను వదిలేసిన శివతో వెళ్లడాన్ని వాళ్లు అంగీకరించలేకపోతున్నారు. మారుతితో ప్రభాస్ సినిమా చేస్తుంటే ఫ్యాన్స్ వ్యతిరేకించినట్లే.. అజిత్ అభిమానులు కూడా ఇప్పుడు శివ సినిమా విషయంలో నెగెటివ్‌గా స్పందిస్తున్నారు.
This post was last modified on February 23, 2026 4:07 pm
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…
కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…
ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…
దసరా తర్వాత నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన ది ప్యారడైజ్ సినిమా మిశ్రమ స్పందన…
హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…
గత ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే అధినేత స్థాలిన్ దాన్నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. ఆయన, ఆయన కుమారుడు…