Movie News

ఆహా… కనులవిందుగా కమల్ & రజిని

గత నలభై ఏడు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న సిల్వర్ స్క్రీన్ కాంబినేషన్ ఎట్టకేలకు ప్రారంభం కాబోతోంది. రజనీకాంత్, కమల్ హాసన్ హీరోలుగా నెల్సన్ దర్శకత్వంలో రూపొందబోయే భారీ ప్యాన్ ఇండియా మూవీ అనౌన్స్ మెంట్ ఇవాళ వీడియో రూపంలో వచ్చేసింది.

ఏదో మొక్కుబడిగా నాలుగు కట్స్, రెండు ఫోటోలు వేయడం లాంటివి కాకుండా ప్రత్యేకంగా షూటింగ్ చేసి మరీ క్లిప్ వదిలారు. సూట్లు, బూట్లు, వాచీలు ఎంచుకోవడం దగ్గరి నుంచి ఒకే కారులో ఇద్దరు ప్రయాణించే దాకా నెల్సన్, అనిరుధ్ రవిచందర్ కలిసి చేసిన మేజిక్ మాములుగా లేదు. ఆహా ఏమీ కనువిందు అనుకునేలా ప్రెజెంట్ చేశారు.

బ్యాక్ గ్రౌండ్ చూస్తుంటే ఇది రెట్రో వింటేజ్ స్టైల్ లో రూపొందే గ్యాంగ్ స్టర్ డ్రామాలా కనిపిస్తోంది. సెటప్ కూడా ఎనభై తొంభై దశకం నాటిదనే క్లూస్ ఇచ్చారు. కమల్ రజని కలిసి ఇరవైకి పైగానే సినిమాల్లో కలిసి నటించారు. కానీ 1980 తర్వాత ఇద్దరికీ స్టార్ డం వచ్చాక వీళ్ళను బాలన్స్ చేసే కథతో ఏ దర్శకుడు రాకపోవడంతో ఈ కలయిక కాస్తా కలగా మిగిలిపోయింది.

దానికి తోడు మధ్యలో ఏవో చిన్న అపార్థాలు రాజకీయ కారణాలు కొంత గ్యాప్ తెచ్చినప్పటికీ స్నేహం విషయంలో కమల్, రజని ఇద్దరూ ఒకే మాట మీద ఉంటారు. అందుకే లోక నాయకుడి స్వంత బ్యానర్ రాజ్ కమల్ లో నటించేందుకు రజని రెండు స్క్రిప్టులు ఓకే చేశారు.

ప్రస్తుతం జైలర్ 2 పూర్తి చేసే పనిలో ఉన్న నెల్సన్ దిలీప్ కుమార్ ఆ తర్వాత కమల్ రజని మల్టీస్టారర్ ని తెరకెక్కించబోతున్నారు. స్క్రిప్ట్ దాదాపుగా లాకయ్యిందని సమాచారం. దశాబ్దాల తర్వాత వస్తున్న కలయిక కావడంతో అభిమానుల అంచనాలు అప్పుడే ఎగబాకడం మొదలయ్యింది.

చివరిసారి ఈ ఇద్దరు కలిసి నటించిన మూవీ హిందీలో వచ్చిన గిరఫ్తార్. కానీ ఫుల్ లెన్త్ రోల్స్ చేసింది మాత్రం అల్లాయుద్దీన్ అద్భుతదీపంలోనే. ఇది 1978లో రిలీజ్ అయ్యింది. 2028 విడుదలని టార్గెట్ చేసుకోబోతున్న ఈ క్రేజీ మూవీకి సంబంధించిన క్యాస్టింగ్, ఇతర టెక్నికల్ టీమ్ వివరాలు త్వరలోనే ప్రకటించబోతున్నారు. 

This post was last modified on February 21, 2026 1:19 pm

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

5 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

7 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

7 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

7 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

7 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

8 hours ago