Political News

ట్రంప్ నకు సుప్రీం షాక్.. భారత్ కు లాభమా? నష్టమా?

అంతా నా ఇష్టం…అంతా నా ఇష్టం…ఎడాపెడా ఏది చేసినా అడిగేదెవడ్రా నా ఇష్టం అంటూ కౌరవుడు సినిమాలో నాగబాబు మాదిరిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా టారిఫ్ ల విషయంలో అంతా నా ఇష్టం అంటూ అడ్డగోలుగా టారిఫ్ లు వడ్డించారు. ఇక, తనకు నచ్చని, తన మాట వినని దేశాలపై అయితే ట్రంప్ పగబట్టి మరీ టారిఫ్ లు విధించిన వైనంపై విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే ట్రంప్ నకు అమెరికా సుప్రీంకోర్టు భారీ షాకిచ్చింది. ట్రంప్‌ ఇష్టారీతిన విధించిన టారిఫ్‌లను కొట్టివేస్తూ సంచలన తీర్పునిచ్చింది.

టారిఫ్ లు విధించే హక్కు అధ్యక్షుడికి లేదని ఆరుగురు జడ్జిలు తేల్చి చెప్పారు. అంతేకాదు, అదనంగా విధించిన సుంకాలను తిరిగి చెల్లించాలని కూడా ఆదేశించింది. ఈ క్రమంలోనే భారత్‌పై విధించిన 18శాతం టారిఫ్‌ కూడా అనధికారమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. సుప్రీం కోర్టు తాజా తీర్పుతో యూఎస్‌ స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాల్లో నడుస్తున్నాయి.

ట్రంప్ భారీగా టారిఫ్ విధించిన దేశాలన్నింటికీ ఇక నుంచి 10 శాతం టారిఫ్ వర్తించనుందని వైట్ హౌస్ అధికారి ఒకరు వెల్లడించారు. గతంలో ఎక్కువ టారిఫ్ లతో కుదిరిన ట్రేడ్ డీల్స్ కూ 10 శాతం టారిఫ్ వర్తిస్తుందని ఆయన తెలిపారు. దీంతో, భారత్ పై కూడా టారిఫ్ 18 శాతం నుంచి 10 శాతానికి తగ్గిందని వెల్లడించారు. ఫిబ్రవరి 24 నుంచి 150 రోజుల పాటు 10 శాతం టారిఫ్ తాత్కాలికంగా అమల్లో ఉండబోతోందని తెలిపారు.

మరోవైపు, ఈ తీర్పును తప్పుబట్టిన ట్రంప్ తప్పుబడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సుప్రీం నిర్ణయం దేశానికే అవమానరమని, సుప్రీంకోర్టు జడ్జిలను చూసి సిగ్గుపడుతున్నానని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ జడ్జిలు విదేశీ ప్రభావానికి లోనయ్యారని ఆరోపించారు. అయినా సరే టారిఫ్ లపై వెనక్కి తగ్గేది లేదని, మరిన్ని టారిఫ్ లు విధించేలా కార్యచరణ రూపొందిస్తామని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత 10 శాతం గ్లోబల్ టారిఫ్ ఆర్డర్స్ పై డొనాల్డ్ ట్రంప్ సంతకం చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

అంతకుముందు, ఈ తీర్పు ప్రభావం ఇటీవల చేసుకున్న భారత్-అమెరికా ట్రేడ్ డీల్ పై ఉండదని ట్రంప్ సెలవిచ్చారు. భారత ప్రధాని మోదీ గొప్ప జెంటిల్మన్ అని, తెలివైనవారని కితాబిచ్చారు. అమెరికాకు భారత్ టారిఫ్ చెల్లిస్తుందని, కానీ, ఇండియాకు అమెరికా టారిఫ్ లు చెల్లించదని అన్నారు. అయితే, ఆ తర్వాత వైట్ హౌస్ అధికారి క్లారిటీ నివ్వడంతో భారత్ పై కూడా 10 శాతం టారిఫ్ లు విధించడం ఖాయమైంది.

This post was last modified on February 21, 2026 1:08 pm

Share

Recent Posts

జడల్ జమానాకు సెన్సార్ ట్విస్టులు

ప్యారడైజ్ సెన్సార్ అయిపోయింది. ఊహించినట్టే ఏ సర్టిఫికెట్ వచ్చింది. 2 గంటల 54 నిమిషాల సవారి జాతి ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు…

23 minutes ago

ఇక పిఠాపురంలోనే పవన్ మకాం?

చాలా రోజుల తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కనిపించారు. ప్రకృతి వైద్యం కోసం కేరళం వెళ్లి 20 రోజుల…

40 minutes ago

టీమిండియాకు చెమటలు పట్టించిన జపాన్

జపాన్‌తో మ్యాచ్ అంటే టీమిండియా సులభంగా గెలుస్తుందని అనుకున్నారు క్రికెట్ ఫ్యాన్స్. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తడి…

56 minutes ago

మేయ‌ర్ స్థానాల‌పై ప‌ట్టు.. జ‌న‌సేన వ్యూహ‌మేంటి.. ?

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలకమైన మేయర్ స్థానాలపై జనసేన పార్టీ గట్టి పట్టు సాధించాలని వ్యూహరచన చేస్తోంది. కూటమి…

2 hours ago

ప్యారడైజ్ ఈవెంట్ సూపర్ హిట్

ఓ పెద్ద సినిమా రిలీజవుతుంటే.. అందరూ ఎదురు చూసేది ట్రైలర్ కోసమే. కానీ ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న…

2 hours ago

బుచ్చిబాబు మిస్సయ్యింది శ్రీకాంత్ చేజారకూడదు

సరిగ్గా మూడు నెలల ఇరవై ఎనిమిది రోజుల క్రితం పెద్ది రిలీజయ్యింది. ఒకే సినిమా అనుభవమున్న దర్శకుడు బుచ్చిబాబుని నమ్మి…

4 hours ago