రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’ మీద అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలిసిందే. ఇందులో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఓ కీలక పాత్ర పోషిస్తుండడం అమితాసక్తిని రేకెత్తిస్తోంది. తెలుగులో ఆయన చేస్తున్న తొలి పూర్తి స్థాయి పాత్ర ఇది. ఇందులో ఆయన చరణ్ కోచ్ పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం.
ఈ పాత్రను బుచ్చిబాబు తీర్చిదిద్దిన తీరు, అలాగే తన మీద షూట్ చేసిన సన్నివేశాలు చూసి శివరాజ్ కుమార్ ఫ్లాట్ అయిపోయాడని తెలుస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఆయన బుచ్చిబాబు ఒక ఖరీదైన వాచ్ బహుమతిగా ఇచ్చారు. బుచ్చిబాబును తన కారవాన్‌లోకి పిలిచి లగ్జరీ బ్రాండ్ ‘జీసీ’ వాచ్‌ను శివరాజ్ బహుమతిగా ఇచ్చిన ఫొటో సోషల్ మీడియాలోకి వచ్చింది. ఈ గిఫ్ట్ విషయంలో బుచ్చిబాబు చాలా ఎగ్జైట్ అవుతూ సోషల్ మీడియాలో తన ఆనందాన్ని పంచుకున్నాడు.
ఒక మారుమూల పల్లెటూరికి చెందిన వ్యక్తి.. ఒక లక్ష్యం కోసం పోరాడే క్రమంలో అంతర్జాతీయ స్థాయి క్రీడాకారుడిగా ఎదిగే కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. హీరో పాత్రలో స్ఫూర్తిని రగిల్చి అతణ్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లే కోచ్ పాత్రలో శివరాజ్ కనిపించనున్నాడు.
ఈ పాత్ర కోసం ఏరికోరి శివరాజ్‌ను తీసుకున్నాడు బుచ్చిబాబు. మెగాస్టార్ చిరంజీవితో గొప్ప అనుబంధం ఉన్న శివరాజ్.. ఆయన కొడుకైన చరణ్‌తో సినిమా చేస్తుండడం పట్ల ఎంతో ఎగ్జైటెడ్‌గా ఉన్నాడు. మార్చి 26కే అనుకున్న ఈ చిత్రం.. నెల రోజులు వాయిదా పడింది.
ఏప్రిల్ 30కి ‘పెద్ది’ కొత్త రిలీజ్ డేట్ ఇచ్చారు. ఐతే ఆ డేట్ అందుకోవడానికి ఇప్పుడు టీం చాలా కష్టపడుతోంది. చరణ్ సరసన జాన్వి కపూర్ నటించిన ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.
This post was last modified on February 20, 2026 4:07 pm
గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…
కూటమి ప్రభుత్వం లక్షకు పైగా కొత్త పింఛన్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న లబ్ధి దారులకు మేలు…
ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకు అర్ధమైంది ఏంటి? అనేది…
వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…
వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ పెట్టనున్నట్టు రాజ్యసభ మాజీ సభ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖపట్నంలో మాట్లాడిన ఆయన..…