Movie News

కొత్త సమస్య తెచ్చుకున్న దురంధర్ 2

హిందీలోనే కాదు తెలుగుతో సహా ఇతర బాషల ఆడియన్స్ ఎదురు చూస్తున్న సినిమా దురంధర్ 2 ది రివెంజ్. మార్చి 19 విడుదల ఎంతో దూరంలో లేకపోవడంతో అభిమానులు కౌంట్ డౌన్ మొదలుపెట్టేశారు. అయితే ట్విస్ట్ ఏంటంటే ఇంకా దీని షూటింగ్ జరుగుతూనే ఉంది. బ్యాలన్స్ ఉన్న కొన్ని ఎపిసోడ్లను శరవేగంగా పూర్తి చేస్తున్నారు.

తాజాగా దురంధర్ 2 బృందం ఒక కొత్త సమస్యను తెచ్చుకున్నట్టు బాలీవుడ్ రిపోర్ట్. ముంబైలో ఉన్న చారిత్రక ఫోర్ట్ ఏరియాలో ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. వాతావరణం, పర్యావరణానికి ఎలాంటి ఇబ్బందులు కలిగించమని ముంబై సిటీ కౌన్సిల్ దగ్గర అనుమతులు తీసుకున్నారు.

కానీ షూటింగ్ జరుగుతున్న టైంలో పెద్ద ఎత్తున బాణాసంచాతో పాటు నిప్పు రాజేసి ఫైట్లు చిత్రీకరించడంతో ఎంసిసికి ఫిర్యాదు వెళ్ళింది. నిషేధ వస్తువులను ఎలా వాడతారంటూ అధికారులు దురంధర్ 2 బృందానికి హెచ్చరిక జారీ చేశారట.

అయినా సరే ఫిబ్రవరి 14 అర్ధరాత్రి దాటిన తర్వాత ఫ్లడ్ లైట్లతో పాటు ప్రమాదరక వస్తువులతో తిరిగి కొనసాగించడంతో దర్శకుడు ఆదిత్య ధార్ కు చెందిన బి62 స్టూడియోస్ మీద బ్యాన్ విధించే ఆలోచనలో ముంబై సిటీ కౌన్సిల్ ఉన్నట్టు సమాచారం. అదే జరిగితే నగరంలో ఉన్న లొకేషన్లకు అనుమతులు దొరకడం అసాధ్యమవుతుంది. ఇదంతా నిబంధనలు అతిక్రమించడం వల్ల జరిగింది.

ఇప్పుడీ పరిణామాల ప్రభావం విడుదల మీద ఉండకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. మార్చి 19 కేవలం నెల రోజుల దూరంలో ఉండటంతో నిర్మాణాంతర కార్యక్రమాలు ఊపందుకుంటున్నాయి. పుష్ప 2 రికార్డులను ఇది బద్దలు కొడుతుందనే రేంజ్ లో నార్త్ వర్గాలలో ఓ రేంజ్ అంచనాలున్నాయి.

యష్ టాక్సిక్ పోటీ వల్ల దక్షిణాదిలో స్క్రీన్ల సమస్య వచ్చినా దాన్ని ధీటుగా ఎదురుకునేందుకు నిర్మాణ భాగస్వామి జియో స్టూడియోస్ హైదరాబాద్ లో ఒక ఆఫీస్ తీసిందనే టాక్ ఇప్పటికే ప్రచారంలో ఉంది. ఎట్టి పరిస్థితుల్లో వాయిదా లేకుండా ఆదిత్య ధార్ డే అండ్ నైట్ దురంధర్ రివెంజ్ పనుల్లోనే తలమునకలై ఉన్నారు.

This post was last modified on February 17, 2026 12:23 pm

Share

Recent Posts

విజయవాడలో విజయ్… సౌండ్ అదిరింది బాసు

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…

1 minute ago

కుటుంబం ముందున్న అసలు ముప్పు

ప్యాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కానీ ఆదర్శ కుటుంబం ఏకే 47 లాంటి రీజనల్ మూవీ ఇంత…

4 hours ago

కళ్యాణ్ నెమ్మదించినా ఇబ్బంది లేదు

మొదటి మూడు రోజులు డీసెంట్ టాక్ తో దూసుకెళ్లిన కామ్రేడ్ కళ్యాణ్ నిన్న సోమవారం నుంచి బాగా డ్రాప్ అయినట్టు…

5 hours ago

పెద్ద గండం దాటేసిన రణబాలి

ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రణబాలి బుకింగ్స్ మెల్లగా ఊపందుకుంటున్నాయి. సాధారణంగా ఓవర్సీస్ లో విజయ్ దేవరకొండ చూపించే…

5 hours ago

జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌నకు బ్రేక్ ప‌డుతుందా?

వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…

7 hours ago

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

10 hours ago