తెలుగులో ఉన్న ఒరిజినల్ మ్యూజిక్ డైరెక్టర్లలో వివేక్ సాగర్ ఒకడు. ‘పెళ్ళిచూపులు’ దగ్గర్నుంచి మొదలుపెడితే.. ఎన్నో అద్భుతమైన ఆల్బమ్స్ ఇచ్చిన సంగీత దర్శకుడతను. బ్రోచే వారెవరరురా, ఈ నగరానికి ఏమైంది, మెంటల్ మదిలో, సమ్మోహనం, అంటే సుందరానికి, శ్వాగ్.. ఇలా ప్రతి సినిమాలోనూ తనదైన ముద్ర వేశాడు వివేక్. ఐతే అతను కొంత కాలం కిందట చాలా పెద్ద కష్టాన్నే ఎదుర్కొన్న విషయాన్ని దర్శకుడు తరుణ్ భాస్కర్.
వివేక్ సాగర్ భారీ ఖర్చు పెట్టి హైదరాబాద్‌లోని చిక్కడపల్లిలో కట్టుకున్న స్టూడియో అగ్ని ప్రమాదంలో కాలిపోయిందట. మొత్తం స్టూడియోలోని సామగ్రి మొత్తం అగ్నికి ఆహుతైపోవడంతో సంగీత పరికరాలు ఏమీ లేని స్థితికి వచ్చాడట వివేక్. ఆ స్టూడియోకు ఇన్సూరెన్స్ కూడా చేయించకపోవడంతో ఒక్క రూపాయి కూడా వెనక్కి రాలేదట. ఇది వివేక్‌కు కోలుకోలేని దెబ్బ అని తరుణ్ భాస్కర్ తెలిపాడు.
సరిగ్గా ‘ఈఎన్ఈ రిపీట్’ సినిమా మొదలుపెట్టడానికి ముందే ఇది జరిగినట్లు తరుణ్ తెలిపాడు. ఐతే అంత జరిగినా వివేక్ కుంగిపోకుండా.. పోయింది పరికరాలు మాత్రమే, తన మ్యూజికల్ టాలెంట్ కాదు అని అనుకుని ధైర్యంగా అడుగు ముందుకు వేసినట్లు తరుణ్ తెలిపాడు. ఆ బాధనంతా పక్కన పెట్టి ‘ఈఎన్ఈ రిపీట్’ కోసం మంచి మ్యూజిక్ చేశాడని తరుణ్ తెలిపాడు. వివేక్ విషయంలో జరిగింది వర్ధమాన సంగీత దర్శకులందరికీ ఒక పాఠమని.. మ్యూజిక్ స్టూడియోలకు ఇన్సూరెన్స్ చేయించడం చాలా అవసరమని సూచించాడు తరుణ్ భాస్కర్.
‘ఈఎన్ఈ రిపీట్’లో.. సాంకేతిక కారణాల వల్ల ‘ఈ నగరానికి ఏమైంది’కి సంబంధించిన మ్యూజిక్ ఏదీ వాడలేదని.. ఇందులో పూర్తిగా డిఫరెంట్ మ్యూజిక్ ఉంటుందని తరుణ్ తెలిపాడు. ఇది కూడా సంగీత ప్రధానంగా సాగే సినిమానే అని.. ఇందులో వివేక్ సాగర్ శ్వాగ్ చూస్తారని తరుణ్ భాస్కర్ తెలిపాడు. విశ్వక్సేన్ మరోసారి లీడ్ రోల్ చేసిన ‘ఈఎన్ఈ రిపీట్’ ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
This post was last modified on November 11, 2026 5:09 pm
ముంబై లోకల్ రైళ్లలో ప్రయాణం అంటేనే రద్దీ, హడావుడి. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో రైళ్లలో ఎక్కడం, దిగడం ప్రయాణికులకు…
వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీని ప్రకటించిన కొన్ని గంటలు కూడా కాలేదు. అప్పుడే ఆ…
హీరో రోషన్ మేక, దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ కలయికలో కొత్త సినిమా మొదలయ్యింది. టైటిల్ అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు…
ఇటీవలే విడుదలైన ఆదర్శ కుటుంబం ఏకె 47తో రికార్డులు బద్దలు కొడతారనుకుంటే దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ తీవ్రంగా నిరాశ పరచడం…
థియేటర్ల నుంచి వెళ్ళిపోయి ఓటిటిలో వచ్చినప్పుడు కూడా ట్రోలింగ్ బారిన పడిన ది ప్యారడైజ్ ఇప్పుడప్పుడే సోషల్ మీడియా నుంచి…
ఎట్టకేలకు విజయసాయి రెడ్డి సొంత రాజకీయ పార్టీ పెట్టేశారు. ముందే చెప్పినట్టు 11:11:11 కు పరివర్తన్ రాజనీతి పార్టీ అని…