హీరో రోషన్ మేక, దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ కలయికలో కొత్త సినిమా మొదలయ్యింది. టైటిల్ అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు కానీ డైరెక్టర్ డ్రీం ప్రాజెక్టుగా ఎప్పటి నుంచో చెప్పుకుంటున్న జటాయు కథతోనే రూపొందుతోందని ఇన్ సైడ్ టాక్. సూపర్ హీరో కాన్సెప్ట్ తో పాటు ఇతిహాసాలకు సంబంధించిన అంశాలు ఇందులో ఉంటాయట. విఎఫ్ఎక్స్ కి ఎక్కువ ప్రాధాన్యం ఉన్న దృష్ట్యా బడ్జెట్ కూడా కాస్త ప్రియంగానే అవుతుందని వినికిడి. అశోక్ వర్ధన్, సునీల్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
ఈ కాంబోలో విశేషం ఏమిటంటే హీరో, దర్శకుడు ఇద్దరికీ ఒక సూపర్ హిట్ కావాలి. 2018 సమ్మోహనం తర్వాత ఇంద్రగంటి మూడు సినిమాలు తీస్తే ఏదీ అంచనాలు అందుకోలేదు. నాని నెగటివ్ షేడ్స్ చూపిస్తూ రూపొందించిన ‘వి’కి డైరెక్ట్ ఓటిటి కాబట్టి వ్యూస్ వచ్చాయి కానీ కంటెంట్ పరంగా ప్రేక్షకుల నుంచి ప్రశంసలు రాలేదు. సుధీర్ బాబు ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, ప్రియదర్శి సారంగపాణి జాతకం రెండూ డిజాస్టరయ్యాయి. అందుకే జటాయు ఇంత లేట్ అయ్యింది.
ఇక రోషన్ విషయానికి వస్తే మంచి వయసులో ఉన్న కుర్రాడు, సినిమాలు చేసే విషయంలో మాత్రం అతి నెమ్మదిగా ఉన్నాడు. 2021 పెళ్లి సందడి తర్వాత తను చేసింది ఛాంపియన్ ఒక్కటే. గత ఏడాది డిసెంబర్ లో రిలీజై బాక్సాఫీస్ వద్ద తిరస్కారానికి గురయ్యింది. సితార సంస్థ తీసిన ఏమో ఏమో ఇది షూటింగ్ పూర్తి చేసుకుని సరైన రిలీజ్ డేట్ ఎదురు చూస్తోంది కానీ ఇంకా ఫైనల్ కాలేదు. సో రోషన్ కు సక్సెస్ దక్కితే జనాల్లో గుర్తింపు పెరిగి మార్కెట్ పెంచుకునే అవకాశాలు మెరుగవుతాయి.
జటాయు కాన్సెప్ట్ ఏంటి, ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటాయనేది ఇంకా రివీల్ చేయలేదు కానీ గతంలో ప్రభాస్, విజయ్ దేవరకొండ లాంటి స్టార్లతో తీయాలని ఇంద్రగంటి చాలా ట్రై చేశారు. నిర్మాత దిల్ రాజు ఒకదశలో ఈ ప్రాజెక్టుని చాలా నమ్మారు. కానీ రకరకాల కారణాల వల్ల చేతులు మారుతూ వెళ్లి ఫైనల్ గా ఇప్పటికి కుదిరింది. దీని రూపంలో సాలిడ్ గా ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఇద్దరి మీద ఉంది. హీరోయిన్ గా రేఖా పాండే, విలన్ గా వినయ్ రాయ్ ఫిక్స్ కాగా మిగిలిన క్యాస్టింగ్ ప్రకటించాల్సి ఉంది.
This post was last modified on November 11, 2026 6:51 pm
ఇటీవలే విడుదలైన ఆదర్శ కుటుంబం ఏకె 47తో రికార్డులు బద్దలు కొడతారనుకుంటే దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ తీవ్రంగా నిరాశ పరచడం…
థియేటర్ల నుంచి వెళ్ళిపోయి ఓటిటిలో వచ్చినప్పుడు కూడా ట్రోలింగ్ బారిన పడిన ది ప్యారడైజ్ ఇప్పుడప్పుడే సోషల్ మీడియా నుంచి…
తెలుగులో ఉన్న ఒరిజినల్ మ్యూజిక్ డైరెక్టర్లలో వివేక్ సాగర్ ఒకడు. ‘పెళ్ళిచూపులు’ దగ్గర్నుంచి మొదలుపెడితే.. ఎన్నో అద్భుతమైన ఆల్బమ్స్ ఇచ్చిన…
ఎట్టకేలకు విజయసాయి రెడ్డి సొంత రాజకీయ పార్టీ పెట్టేశారు. ముందే చెప్పినట్టు 11:11:11 కు పరివర్తన్ రాజనీతి పార్టీ అని…
రేపు, ఎల్లుండి తేదీల్లో వరసగా టాలీవుడ్ బాక్సాఫీస్ మీదకు ఏడుకి పైగా సినిమాలు దండయాత్ర చేయబోతున్నాయి. స్టార్ క్యాస్టింగ్ ఉన్నవి…
తాము ఎవరికీ `బీ-టీం` కాదని రాజ్యసభ మాజీ సభ్యుడు వేణంబాకం విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. తమపార్టీ పుట్టక ముందే.. వైసీపీ,…