Movie News

అల్లు అర్జున్‌కు ఆ ఇద్దరి క్షమాపణ

కొన్ని రోజుల కిందట బాలీవుడ్ మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్ కావేరి బరువా.. టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ గురించి చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో తెలిసిందే. అల్లు అర్జున్‌ను కలవబోతే.. ఆయన కళ్లలోకి కళ్లు పెట్టి చూడకూడదు, సార్ అనే పిలవాలి, షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు.. అంటూ ‘డూస్ అండ్ డోంట్స్’తో 42 పాయింట్లు ఇచ్చారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై బన్నీ టీం తీవ్రంగా స్పందించింది.

ఈ వ్యాఖ్యలను ఖండించడమే కాక.. కావేరి మీద, తనతో పాడ్ కాస్ట్ చేసిన స్వీకృతి మీద న్యాయపరమైన చర్యలకు కూడా సిద్ధమైంది. వీళ్లిద్దరి మీద అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియాలో గట్టిగానే దాడి చేశారు. మరోవైపు కావేరి వ్యాఖ్యలను అందిపుచ్చుకున్న బన్నీ యాంటీ ఫ్యాన్స్.. అతణ్ని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు. ఇలా ఒక వారం పాటు వ్యవహారం నాని.. తర్వాత సద్దుమణిగింది.

కాగా ఇప్పుడు కావేరి, స్వీకృతి.. అల్లు అర్జున్‌కు బేషరతుగా క్షమాపణ చెబుతూ ప్రెస్ నోట్స్ రిలీజ్ చేశారు. సరిగా వెరిఫై చేసుకోకుండా అల్లు అర్జున్ మీద ఆ వ్యాఖ్యలు చేశానని.. వాటి పట్ల చింతిస్తున్నానని.. ఆ కామెంట్స్ వెనక్కి తీసుకుంటున్నానని కావేరి స్పష్టం చేశారు. .. తాను మాటల ఫ్లోలో ఆ వ్యాఖ్యలు చేశానన్నారు. అంతే తప్ప తనకు వేరే ఉద్దేశాలేమీ లేవని ఆమె పేర్కొన్నారు.

డూస్ అండ్ డోంట్స్ అంటూ 42 పాయింట్లతో ఎవ్వరూ నోట్ తనకు ఇవ్వలేదని.. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న లిస్ట్ కూడా నిజమైంది కాదని ఆమె స్పష్టం చేసింది. బన్నీకి తాను మనస్ఫూర్తిగా క్షమాపణ చెబుతున్నట్లు పేర్కొన్న కావేరి.. ఆయన హార్డ్ వర్క్‌ను తాను ఎంతో గౌరవిస్తానని పేర్కొన్నారు.

మరోవైపు స్వీకృతి మాట్లాడుతూ.. అల్లు అర్జున్ మీద కావేరి వ్యాఖ్యలకు సంబంధించిన అన్ని వీడియోలు సోషల్ మీడియా నుంచి డెలీట్ చేశామన్న స్వీకృతి.. తాను కూడా బన్నీకి బేషరతుగా క్షమాపణ చెబుతున్నట్లు పేర్కొన్నారు. ఈ వ్యవహారాన్ని ఇంతటితో ముగించాలని ఆమె కోరారు.

This post was last modified on February 17, 2026 1:11 pm

Share

Recent Posts

జూనియర్ ఇచ్చిన జోష్ సరిపోతుందా

ఎల్లుండి విడుదల కాబోతున్న 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' ప్రమోషన్ల ఘట్టం చివరి అంకాన్ని నిన్న దిగ్విజయంగా పూర్తి చేశారు.…

4 minutes ago

పార్టీ క‌న్నా ప‌రువు కాపాడుకునేదెలా…

కొంతమంది నాయకుల విషయంలో పార్టీ ముందు.. తర్వాత నాయకులు.. అనే మాట వినిపిస్తుంది. నిజంగా రాజకీయాల్లో కొత్తగా వచ్చినవారు యువతరం…

15 minutes ago

విజయవాడలో 10 కోట్లు… దేశంలోనే మొదటిసారి

సైబ‌ర్ నేరాల గురించి త‌ర‌చుగా వార్త‌లు వ‌స్తున్నాయి. బాధితుల సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో ప్ర‌భుత్వాలు స‌హా రిజ‌ర్వ్ బ్యాంకు…

54 minutes ago

ఒక్క యాడ్‌కు 40 కోట్ల పారితోష‌కం?

చాలా ఏళ్ల నుంచి త‌మిళ సినిమాను ఏలుతున్న హీరోల్లో అజిత్ ఒక‌డు. సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్, ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌ర్వాత…

60 minutes ago

ఖైర‌తాబాద్‌లో బీజేపీ క్యాండేట్‌ ఆయ‌నేనా?

తెలంగాణ‌లో కీల‌క‌మైన ఖైర‌తాబాద్ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుద‌ల…

5 hours ago

బాబు.. ప‌వ‌న్‌.. జోడీకి జ‌నాలు ఫిధా!

ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు, డిప్యూటీసీఎం, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌ల జోడీకి ప్ర‌జ‌ల్లో మ‌రింత ఆద‌ర‌ణ…

11 hours ago