వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీని ప్రకటించిన కొన్ని గంటలు కూడా కాలేదు. అప్పుడే ఆ పార్టీ మీద రకరకాల విమర్శలు ఎక్కుపెట్టారు. బ్రాండెడ్ పొలిటీషియన్ కేఏ పాల్ అయితే తనదైన శైలిలో విరుచుకొని పడ్డారు. పార్టీ పేరును కూడా వొదిలిపెట్టకుండా ఉతికి పారేశారు. నువ్వు దోచుకున్నది దాచుకోడానికే పార్టీ పెట్టావని, నువ్వు బీజేపీ వొదిలిన బాణం అని మాకు తెలుసులే అని కామెంట్స్ చేశారు. ఇంతకూ ప్రజాశాంతి పార్టీ కేఏ పాల్ ఏమన్నారంటే..
వైసీపీ నుంచి బయటకు వచ్చిన తరువాత ఇక రాజకీయాలకు దూరంగా వుంటాను, ప్రశాంతంగా కొంతకాలం వ్యవసాయం చేసుకుంటాను అని చెప్పిన విజయసాయి రెడ్డి అంతలోనే మాటమార్చి కొత్త పార్టీ పెట్టడం ఎందుకో చెప్పాలని ప్రశ్నించారు. శ్రీకాకుళం నుంచి రాయలసీమ వరకు, అక్కడ నుంచి హైదరాబాద్ వరకు నీకు ఎన్ని భూములున్నాయో, ఎంత దోచుకున్నావో మాకు తెలుసులే అని కుండబద్దలు కొట్టారు. దోచుకున్నది దాచుకోడానికే కొత్త పార్టీ పెడుతున్నాడని ఆరోపించారు.
విజయసాయి రెడ్డి దోపిడి మీద ఎన్ని ఫిర్యాదులు వచ్చినా సీబీఐ ఎందుకు విచారించడం లేదని అనుమానం వ్యక్తం చేశారు. విజయసాయి రెడ్డికి నిజాయితీ వుంటే దోచుకున్నదంతా పేదలకు పంచి పెట్టాలని, ప్రభుత్వానికి అప్పగించాలని డిమాండ్ చేశారు. బీజేపీతో వున్న సంబంధాల వల్లనే ఆయనను సీబీఐ విడిచి పెట్టిందన్నట్టు కేఏ పాల్ మాట్లాడారు. విజయసాయి రెడ్డి బీజేపీ వొదిలిన బాణం అని ఆరోపించారు. ఎప్పుడు మాట్లాడినా మతాలు, కులాల గురించి మాట్లాడటం ద్వారా విభజన రాజకీయాలు చేయనున్నట్లు ఆయన సంకేతాలు ఇస్తున్నాడని చెప్పారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని 12 మంది రెడ్లు పరిపాలించారని చెప్పిన పాల్ ” ఎప్పుడూ మీరే పాలించాలా… 60 శాతం వున్న బీసీలకు, 27 శాతం వున్న కాపులకు అవకాశం ఇవ్వరా… మాకు చేతకాదా ” అని ప్రశ్నలను సంధించారు. ముందుగా విజయసాయి రెడ్డిలో పరివర్తన రావాలని, ఆ తర్వాత రాజనీతి గురించి మాట్లాడాలని హితవు పలికారు. కేఏ పాల్ విమర్శలు పొలిటికల్ సర్కిల్లో వైరల్ అవుతోంది.
This post was last modified on November 11, 2026 7:01 pm
హీరో రోషన్ మేక, దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ కలయికలో కొత్త సినిమా మొదలయ్యింది. టైటిల్ అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు…
ఇటీవలే విడుదలైన ఆదర్శ కుటుంబం ఏకె 47తో రికార్డులు బద్దలు కొడతారనుకుంటే దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ తీవ్రంగా నిరాశ పరచడం…
థియేటర్ల నుంచి వెళ్ళిపోయి ఓటిటిలో వచ్చినప్పుడు కూడా ట్రోలింగ్ బారిన పడిన ది ప్యారడైజ్ ఇప్పుడప్పుడే సోషల్ మీడియా నుంచి…
తెలుగులో ఉన్న ఒరిజినల్ మ్యూజిక్ డైరెక్టర్లలో వివేక్ సాగర్ ఒకడు. ‘పెళ్ళిచూపులు’ దగ్గర్నుంచి మొదలుపెడితే.. ఎన్నో అద్భుతమైన ఆల్బమ్స్ ఇచ్చిన…
ఎట్టకేలకు విజయసాయి రెడ్డి సొంత రాజకీయ పార్టీ పెట్టేశారు. ముందే చెప్పినట్టు 11:11:11 కు పరివర్తన్ రాజనీతి పార్టీ అని…
రేపు, ఎల్లుండి తేదీల్లో వరసగా టాలీవుడ్ బాక్సాఫీస్ మీదకు ఏడుకి పైగా సినిమాలు దండయాత్ర చేయబోతున్నాయి. స్టార్ క్యాస్టింగ్ ఉన్నవి…