వ‌నిత విజ‌య్ కుమార్.. మ‌ళ్లీ ప్రేమ‌లో

వ‌నిత విజ‌య్ కుమార్.. ఈ పేరు ఎప్పుడూ వివాదాల‌తోనే వార్త‌ల్లో నిలుస్తుంటుంది. ఇప్ప‌టికే మూడుసార్లు ఆమెకు పెళ్ల‌యింది. మూడు బంధాలు చెడిపోయాయి. చివ‌ర‌గా లాక్ డౌన్ టైంలో పీట‌ర్ అనే ఫిలిం మేక‌ర్‌ను ఆమె పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఆ పెళ్లి మీద నానా ర‌చ్చ జ‌రిగింది. పెళ్ల‌యిన కొన్ని నెల‌ల‌కే ఇద్ద‌రూ విడిపోయారు. దానికి సంబంధించిన ర‌చ్చ ఇంకా కొన‌సాగుతుండ‌గానే.. వ‌నిత తాజాగా పెట్టిన ఇన్‌స్టాగ్రామ్ పోస్టు అంద‌రినీ విస్మ‌యానికి గురి చేసింది.

ఇన్ ల‌వ్ అగైన్.. అంటూ సింపుల్‌గా ఒక మెసేజ్ పెట్టి సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయింది వ‌నిత‌. తాను గొడ‌వ ప‌డ్డ మూడో భ‌ర్త పీట‌ర్‌తో స‌ర్దుబాటు చేసుకుని ఆయ‌న‌తో మ‌ళ్లీ ప్రేమ‌లో ప‌డ్డాన‌ని అంటోందా.. లేక అత‌డి నుంచి విడిపోయిన నేప‌థ్యంలో ఎవ‌రైనా కొత్త వ్య‌క్తిని ప్రేమిస్తోందా అన్న‌ది జ‌నాల‌కు అర్థం కావ‌డం లేదు.

వ‌నిత ఉద్దేశం ఏదైనాప్ప‌టికీ.. ఇన్ని వివాదాల త‌ర్వాత మ‌ళ్లీ ప్రేమ మాట ఎత్త‌డ‌మే జ‌నాల‌కు మింగుడు ప‌డ‌టం లేదు. సీనియ‌ర్ న‌టులు విజ‌య్ కుమార్, మంజులల త‌న‌యురాలైన ఈ అమ్మాయి చేసిన సినిమాలు చాలా త‌క్కువే. తెలుగులో దేవి లాంటి సూప‌ర్ హిట్‌లో అమాయ‌క అమ్మాయిగా న‌టించిన వ‌నిత‌కు.. ఆ త‌ర్వాత ఇక్క‌డ అవ‌కాశాలు రాలేదు. త‌మిళంలో కూడా ఫిలిం ఇండ‌స్ట్రీలో పెద్ద‌గా సాధించింది లేదు. కానీ వ్య‌క్తిగ‌త జీవితానికి సంబంధించిన వివాదాల‌తో ఆమె త‌ర‌చుగా వార్త‌ల్లోకి వ‌స్తుంటుంది.

కొన్నేళ్ల కింద‌ట ఆస్తి విష‌యంలో గొడ‌వల్లో భాగంగా తండ్రి విజ‌య్ కుమార్‌ను సైతం ఆమె రోడ్డుకీడ్చ‌డం సంచ‌ల‌నం రేపింది. ఆ త‌ర్వాత బిగ్ బాస్ షోతో కొన్నాళ్లు వార్త‌ల్లో నిలిచిన వ‌నిత‌.. లాక్ డౌన్ టైంలో పీట‌ర్‌ను పెళ్లాడటం.. కొన్ని నెల‌ల్లోనే వీళ్లిద్ద‌రూ గొడ‌వ‌ప‌డి విడిపోవ‌డం ఎంత వివాదాస్ప‌ద‌మైందో తెలిసిందే.