Movie News

తిరస్కరించిన సినిమాకు హడావిడి ఎందుకయ్యా

ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది. తమిళంలో బాబాని పెద్ద ఎత్తున పునః విడుదల చేస్తే వసూళ్లు బాగానే నమోదయ్యాయి. కానీ అన్నింటికి ఇదే ఫలితం రాదు. కొన్ని ఎన్నిసార్లు రుద్దినా జనాలు రిజెక్ట్ చేస్తూనే ఉంటారు.

రజనీకాంత్ ఫ్యాన్స్ అంత సులభంగా మర్చిపోలేని మూవీ కొచ్చడయాన్. తెలుగులో విక్రమసింహ పేరుతో డబ్బింగ్ చేసి వదిలారు. అన్ని భాషల్లో యనానిమస్ గా డిజాస్టర్ అయ్యింది. యానిమేషన్ మూవీని ఏదో రియల్ అన్నంత రేంజ్ లో ఓవర్ పబ్లిసిటీ చేయడం విపరీతమైన నెగటివిటీ తీసుకొచ్చింది.

ఇదంతా పన్నెండు సంవత్సరాల వెనుకటి మాట. అందరూ ఆ సినిమాని మర్చిపోయారు. కట్ చేస్తే ఇప్పుడీ విక్రమసింహని రిపేర్లు చేసి, ఏఐ టెక్నాలజీ వాడి, కొత్త కలర్లు అద్ది న్యూ వెర్షన్ సిద్ధం చేశారు. తాజాగా చిన్న ట్రైలర్ వదిలారు. బెటర్ అనిపించే తేడాలు ఉన్నాయి కానీ మరీ ఇప్పటికిప్పుడు చూసేయాలన్నంత ఎగ్జైట్ మెంట్ ఇచ్చేలా కూడా లేదు.

రజని కూతురు సౌందర్య దర్శకత్వం వహించిన ఈ పీరియాడిక్ డ్రామాలో బొమ్మల రూపంలో దీపికా పదుకునే హీరోయిన్ గా నటించింది. ఏఆర్ రెహమాన్ సంగీతం సైతం ఈ బ్యాడ్ ప్రోడక్ట్ ని కాపాడలేకపోయింది. ఇంత ఘనమైన చరిత్ర కొచ్చడయాన్ ది.

ఎంత రజని మేనియాని క్యాష్ చేసుకునే ప్రయత్నమైనా మరీ ఇంతగా వాడుకోవాలా అంటూ ఫ్యాన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. పడయప్పా, బాషా, అన్నామలై లాంటివి రీ రిలీజ్ చేసినా అర్థముంది కానీ 5జి జనరేషన్ లో ఇప్పుడు కొచ్చడయాన్ వదిలి మళ్ళీ ట్రోలింగ్ కు అవకాశం ఇస్తారా అంటూ అభిమానులే కామెంట్ చేస్తున్నారు.

విడుదల తేదీ గట్రా నిర్మాణ సంస్థ ప్రకటించలేదు కానీ జనాల రియాక్షన్లు తెలుసుకోవడానికి శాంపిల్ వదిలినట్టు కనిపిస్తోంది. కన్నబిడ్డ డైరెక్షన్ కాబట్టి రజని మరోసారి కెమెరా ముందుకు వచ్చి కొచ్చడయాన్ కోసం ప్రమోషన్లు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఫ్యాన్స్ వద్దని కోరుకుంటున్నది ఇదే.

This post was last modified on February 17, 2026 10:29 pm

Share

Recent Posts

మోహన్ బాబును మోసం చేసిన ఓదెల

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…

21 minutes ago

‘హోటళ్ళు నా భార్యా బిడ్డల కోసం’

సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…

1 hour ago

హిట్టు కొట్టిన పది నెలలకు దర్శనం

టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…

2 hours ago

షాకింగ్ టాక్… బత్తా అంత కొత్తగా ఉందా

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…

4 hours ago

మతిపోగొడుతున్న వారణాసి లెక్కలు

సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…

4 hours ago

కళ్యాణ్ గుండె ధైర్యం గట్టిదే

అక్టోబర్ 9 విడుదల కాబోతున్న కామ్రేడ్ కళ్యాణ్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఎదురుగా ఆదర్శ కుటుంబం ఏకె 47…

4 hours ago